ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి? [ఆడియో, టెక్స్ట్]

ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి
https://youtu.be/dy6dlz_jG4g ⏰ 03:20 నిమిషాలు
🎤 నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రతి ముస్లిం రోజూ సూరా అల్-ఇఖ్లాస్, సూరా అల్-ఫలఖ్, మరియు సూరా అన్-నాస్‌లను ఎప్పుడు, ఎన్నిసార్లు పఠించాలో వివరించబడింది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒకసారి, ఉదయం (అద్కార్ అస్-సబాహ్) మరియు సాయంత్రం (అద్కార్ అల్-మసా) దుఆలలో మూడుసార్లు, మరియు నిద్రపోయే ముందు మూడుసార్లు అరచేతులలోకి ఊది శరీరంపై తుడుచుకుంటూ పఠించాలని చెప్పబడింది. ఈ విధంగా ప్రతి సూరాను రోజుకు 14 సార్లు పఠిస్తారని లెక్కించారు. ఒకవేళ ఉదయం మరియు సాయంత్రం అద్కార్లను ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్‌ల తర్వాత చేస్తే, ఆ మూడుసార్లు చేసే పఠనంలోనే నమాజ్ తర్వాత చేసే ఒకసారి పఠనం కూడా కలిసిపోతుందని, అప్పుడు మొత్తం సంఖ్య 12 అవుతుందని స్పష్టం చేశారు. ఈ సూరాల ఘనతను తెలుసుకొని, ఇతర సందర్భాలలో కూడా వాటిని పఠించాలని ప్రోత్సహించారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ప్రతి ముస్లిం, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)

సూరాలు చదవాలి. ఇవి ఐదుసార్లు అవుతాయి. మరియు ఉదయం అద్కార్, అద్కారుస్ సబాహ్ అని ఏవైతే అంటామో, morning supplications, వాటిలో కూడా ఈ మూడు సూరాలూ, సూరాలు మూడేసి సార్లు చదవాలి.

అలాగే అద్కారుల్ మసా, సాయంకాలం చదివే అద్కార్లలో కూడా ఈ మూడు సూరాలు, ఇఖ్లాస్, ఫలఖ్, నాస్ మూడేసి సార్లు చదవాలి. ఎన్ని అయినాయి? ఉదయం మూడు, సాయంకాలం మూడు, ఆరు. మరియు ప్రతీ ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి. ఐదు. పదకొండు అయినాయి.

మళ్లీ రాత్రి పడుకునే ముందు రెండు అరచేతులను కలిపి, అందులో ఊది, ఒక్కొక్కసారి ఈ సూరాలు చదివి, తలపై, ముఖముపై, శరీరం ముందు భాగం, మిగతా శరీర భాగములతో తుడుచుకోవాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఈ విధంగా మొత్తం 14 సార్లు అవుతుంది.

పఠనాల సంఖ్య మరియు ఒక ప్రత్యేక మినహాయింపు

అద్కారుస్ సబాహ్‌లో మూడు సార్లు, మూడు మూడు సార్లు, అద్కారుల్ మసాలో మూడు మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు, మూడు మూడు సార్లు, తొమ్మిది మరియు ఐదు పూటల ఫర్జ్ నమాజ్‌ల తర్వాత ఒక్కొక్కసారి, పద్నాలుగు.

కానీ శ్రద్ధ వహించండి ఇక్కడ. ఎవరైనా అద్కారుస్ సబాహ్ ఫజ్ర్ నమాజ్ తర్వాత చదువుతున్నారు మరియు అద్కారుల్ మసా మగ్రిబ్ నమాజ్ తర్వాత చదువుతున్నారు, అలాంటప్పుడు వారు

మూడుసార్లు

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్, ఏకైకుడు.” (112:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను వేకువ ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (113:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను మానవుల ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (114:1)

చదువుకున్నారంటే, ఫజ్ర్ తర్వాత ఒక్కొక్కసారి, మగ్రిబ్ తర్వాత ఒక్కొక్కసారి చదివేది ఏదైతే ఉందో అది ఇందులోనే, అంటే మూడుసార్లు చదివితే, ఇంక్లూడ్ (include) అయిపోతుంది. ఎందుకంటే ఫజ్ర్ తర్వాత అద్కారుస్ సబాహ్ ఉద్దేశంతో, మగ్రిబ్ తర్వాత అద్కారుల్ మసా ఉద్దేశంతో చదువుతున్నారు గనుక అని కొందరు ధర్మవేత్తలు చెబుతారు. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే, టోటల్ 12 సార్లు అవుతాయి.

ఇవే కాకుండా ఒక ముస్లిం ఈ సూరాల ఘనతను, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్, సూరతున్నాస్ ఘనతలను హదీథుల ఆధారంగా తెలుసుకోవాలి మరియు వేరు వేరు సందర్భాలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ సందర్భాల్లో చదవాలి. ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకోవడానికి మా క్లాసులో హాజరవుతూ ఉండండి.


దుఃఖం , ఆందోళన, ఒత్తిడి & బాధల్లో చదివే ఒక గొప్ప దుఆ

దుఃఖం , ఆందోళన, ఒత్తిడి & బాధల్లో చదివే ఒక గొప్ప దుఆ
https://youtu.be/fZh3aifnBH0 [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

اللّهُمَّ إِنِّي عَبْدُكَ ابْنُ عَبْدِكَ ابْنُ أَمَتِكَ نَاصِيَتِي بِيَدِكَ، مَاضٍ فِيَّ حُكْمُكَ، عَدْلٌ فِيَّ قَضَاؤكَ أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ أَوْ أَنْزَلْتَهُ فِي كِتَابِكَ، أَوْ عَلَّمْتَهُ أَحَداً مِنْ خَلْقِكَ أَوِ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الغَيْبِ عِنْدَكَ أَنْ تَجْعَلَ القُرْآنَ رَبِيعَ قَلْبِي، وَنورَ صَدْرِي وجَلَاءَ حُزْنِي وذَهَابَ هَمِّي

అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక, ఇబ్ను అబ్దిక, ఇబ్ను అమతిక, నాసియతీ బియదిక, మాదిన్ ఫియ్య హుక్ముక, అద్లున్ ఫియ్య ఖదాఉక, అస్అలుక బికుల్లిస్మిన్ హువలక, సమ్మైత బిహీ నఫ్సక, అవ్ అన్జల్తహూ ఫీ కితాబిక అవ్ అల్లమ్ తహూ అహదన్ మిన్ ఖల్ఖిక, అవ్ ఇస్తాసర్త బిహి ఫీ ఇల్మిల్ గైబి ఇన్దక, అన్ తజ్ అలల్ ఖుర్ఆన రబీఅ ఖల్బీ, వ నూర సద్రీ, వ జలాఅ హుజ్నీ, వదహాబ హమ్మీ!

ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నీ దాసుడిని, నీ దాసుడి కుమారుడిని, నీ దాసురాలి పుత్రుడను, నా నొసలు, ముంగురులు నీ చేతిలో ఉన్నాయి. నీ ఆజ్ఞ నాలో కొనసాగుతున్నది నా కొరకై నీ తీర్పు న్యాయసమ్మతమైనది. నీ నామములన్నింటితో, వేటినైతే నీవు నీ కొరకుపెట్టుకున్నావో, లేదా నీ గ్రంథంలో అవతరింపజేసావో, లేదా నీ సృష్టిలో ఎవరికైనా తెలిపావో, లేదా నీ అగోచర జ్ఞానంలోనే ఉంచాలని నిశ్చయంచుకున్నావో, ఆ నామములన్నింటితో నిన్ను అడుగుచున్నాను – ఖుర్ఆన్ ను నా మనసుకు వసంతముగా, హృదయానికి కాంతిగా, నా మనోవేదనను దూరం చేసే దానిగా, నా దుఃఖాన్ని దూరం చేసేదిగా చేయమని వేడుచున్నాను.

[అహ్మద్ 1/391 మరియు అల్బానీ సహీహ్ అన్నారు]

మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు

رَبَّنَا ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ ٱلْحِسَابُ
రబ్బనగ్ ఫిర్ లీ వలి వాలిదయ్య వలిల్ మూ’మినీన యౌమ యకూముల్ హిసాబ్
మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు.

(14 : 41)

ఖురాన్ లోని రబ్బనా దుఆలు:
https://telugudua.net/rabbana-dua

జిక్ర్ (అల్లాహ్ నామస్మరణ) మనసులో చేస్తే సరిపోతుందా? నాలుకతో చెయ్యాలా? [వీడియో]

జిక్ర్ (అల్లాహ్ నామస్మరణ) మనసులో చేస్తే సరిపోతుందా? నాలుకతో చెయ్యాలా? 
https://youtu.be/Y3R6FbJ4VE0 [30 సెకండ్లు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

Important Links:

సూరహ్ ఇఖ్లాస్ ఒకే సందర్భంలో 10సార్లు చదివిన వారికి స్వర్గంలో ఒక గొప్ప కోట (ప్యాలెస్) లభిస్తుంది [వీడియో ]

సూరహ్ ఇఖ్లాస్ ఒకే సందర్భంలో 10సార్లు చదివిన వారికి స్వర్గంలో ఒక గొప్ప భవనం (ప్యాలెస్) లభిస్తుంది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) – https://youtu.be/5H5O9ETGH9c

సూర ఇఖ్లాస్ 10సార్లు చదవడం

عن سَعِيد بْنَ الْمُسَيَّبِ: أَنَّ نَبِيَّ الله ﷺ قَالَ: مَنْ قَرَأَ قُلْ هُوَ اللهُ أَحَدٌ عَشْرَ مَرَّاتٍ، بُنِيَ لَهُ بِهَا قَصْرٌ فِي الْجَنَّةِ، وَمَنْ قَرَأَ عِشْرِينَ مَرَّةً، بُنِيَ لَهُ بِهَا قَصْرَانِ فِي الْجَنَّةِ، وَمَنْ قَرَأَهَا ثَلاثِينَ مَرَّةً، بُنِيَ لَهُ بِهَا ثَلاثَةُ قُصُور فِي الْجَنَّةِ . فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ: وَاللهِ يَا رَسُولَ اللهِ! إِذَنْ لَتَكْثُرَنَّ قُصُورُنَا فَقَالَ رَسُولُ اللهِ ﷺ: اللهُ أَوْسَعُ مِنْ ذَلِكَ .{ الدارمي (3429) الصحيحة تحت الحديث (589)}

సఈద్ బిన్ ముసయ్యిబ్ తెలిపారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:

ఎవరైతే ఖుల్ హువల్లాహు అహద్ పది సార్లు చదువుతారో వారి కొరకు స్వర్గంలో ఒక కోట నిర్మించబడుతుంది. ఎవరైతే ఇరవై సార్లు చదువుతారో వారి కొరకు స్వర్గంలో రెండు కోటలు నిర్మించబడుతుంది. ఎవరైతే ముప్పై సార్లు చదువుతారో వారి కొరకు స్వర్గంలో మూడు కోటలు నిర్మించబడుతుంది.అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చెప్పారు, ప్రవక్తా! అలాగైతే మా కోటలు చాలా ఎక్కువ అవుతాయి, అప్పుడు ప్రవక్త చెప్పారు, అల్లాహ్ అంతకంటే చాలా గొప్పగా ప్రసాదించేవాడు.

(సునన్ దార్మి 3429, సహీహా 589 హదీసులో ప్రస్తావించారు).

సూరహ్ ఇఖ్లాస్ (Suratul Ikhlas) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3dePHBnlkeXpCe1NBDiPaA

సూరహ్ ఇఖ్లాస్

ఆయతుల్ కుర్సీ ఎప్పుడెప్పుడు చదవాలి? చదవడం ద్వారా కలిగే పుణ్యాలు [వీడియో]

రోజువారి జీవితంలో ఆయతుల్ కుర్సీ ఎప్పుడెప్పుడు చదవాలి? చదవడం ద్వారా కలిగే పుణ్యాలు
https://youtu.be/tYzmTUdC0o4 [5 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఉదయం మరియు సాయంత్రం ఆయతుల్ కుర్సీ చదవడం వల్ల కలిగే లాభాలు

ఉదయాన దీన్ని పఠించినవారు సాయంత్రం వరకూ షైతాన్ బారి నుండి సురక్షితంగా ఉంటారు , అలాగే సాయంత్రం దీన్ని పఠించిన వారు ఉదయం వరకూ షైతాన్ బారినుండి సురక్షితంగా ఉంటారు. (హాకిం 1/562. హదీసు నంబర్. 2064. షేఖ్ అల్బానీ సహీహా 3162లో ప్రస్తావించారు).

ప్రతీ ఫర్జ్(ఫజ్ర్, జుహ్ర్, అసర్, ముగ్రిబ్, ఇషా) నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదవడం ద్వారా కలిగే లాభాలు

ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహ 972).

పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదవడం వల్ల కలిగే లాభాలు

పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).

ప్రవక్త యూనుస్(అలైహిస్సలాం) దుఆ

لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ

లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్

అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి. (21 : 87)

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు : “దైవ ప్రవక్త యూనుస్ అలైహిస్సలామ్ దుఆ ఆధారంగా ఏ ముస్లిం తన గోడుని నివేదించుకున్నా అల్లాహ్ దానిని ఆమోదిస్తాడు.” (జామే తిర్మిజీ హ. నెం.3505, అల్బానీ గారు ఈ హదీస్ ని ప్రామాణికమైనదిగా ఖరారు చేసారు.)

ఇతర సంబంధిత లింకులు:

ఖురాన్ ను అత్యధికంగా పారాయణం చెయ్యండి