షైతాన్ నుండి రక్షణ కోసం

[కోపం చల్లారడానికి పఠించు దుఅ][ ఖురాన్ చదివే ముందు] [ రాత్రిపూట కుక్కలు మొరిగితే]

أَعوذُ بِاللهِ مِنَ الشَّيْطانِ الرَّجِيم
అవూదు బిల్లాహి మినష్ షైతా నిర్రజీమ్
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను


[కోపం చల్లారడానికి ] -[అల్ బుఖారీ 7/99 మరియు ముస్లిం 4/2015]

రాత్రుళ్ళు కుక్కలు మొరిగినప్పుడు మరియు గాడిదలు ఓండ్ర పెట్టినప్పుడు, వాటినుండి అల్లాహ్ శరణు వేడండి. ఎందుకనగా అవి నిశ్చయంగా మీరు చూడని వాటిని చూశాయి [అబుదావూద్ 4/327, అహ్మద్ 3306 మరియు అల్బానీ గారు సహీహ్ అబిదావూద్ 3/961లో దీనిని హసన్ అన్నారు]

رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَٰتِ ٱلشَّيَٰطِينِ* وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ

రబ్బి అవూజుబిక మిన్ హమజాతిష్ షయాతీన్ వ అవూజు బిక రబ్బి అయ్ యహ్ దురూన్

ఓ నా ప్రభూ! షైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణుకోరుతున్నాను. ప్రభూ! వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడు తున్నాను.
( దివ్య ఖురాన్ 23 : 97,98)

భోజనము చేయుటకు ముందు పఠించు దుఆ:

మీరు తినడం ప్రారంభించేటప్పుడు క్రింది విధంగా చెప్పాలి.

بِسْمِ الله
బిస్మిల్లాహి
( అల్లాహ్ పేరుతో)


ఒకవేళ మరచిపోయి మధ్యలో జ్ఞాపకం వస్తే క్రింది విధంగా చెప్పాలి:

بِسْمِ اللهِ في أَوَّلِهِ وَآخِرِه
బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి
అల్లాహ్ పేరుతో (అన్నం తింటున్నాను) దీని ప్రారంభము నుండి ఆఖరు నుండి


(తిర్మీదీ 2-167)

వస్త్రాలు విప్పునపుడు ఏమనాలి?

జిన్ను యొక్క కళ్ళు మరియు ఆదము సంతానము యొక్క మర్మాంగాల మధ్య అడ్డు కొరకు ఇలా అనాలి:

بِسْمِ اللهِ
బిస్మిల్లాహ్

(అల్లాహ్ పేరుతో)

[అత్తిర్మిదీ 2/505 వగైరా మరియు అల్ ఇర్వా సంఖ్య 50, మరియు చూడుము సహీహ్ అల్ జామిఅ 3/230]

మరుగు దొడ్డి ( టాయిలెట్) లోనికి ప్రవేశించే ముందు పఠించు దుఆ :

بِسْمِ اللهِ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبْثِ وَالْخَبَائِثِ

బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్ని అవూదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్

అల్లాహ్ పేరుతో. ఓ అల్లాహ్ నేను అపరిశుభ్రమైన స్త్రీ పురుష జిన్నాతుల నుండి నీ శరణు కోరుచున్నాను. (బుఖారీ, ముస్లిం)

[1/45 దీనిని బుఖారీ ఉల్లేఖించారు. మరియు ముస్లిం 1/283 ఆరంభములో అదనంగా “బిస్మిల్లాహ్” సఈద్ బిన్ మన్సూర్ వివరణ లోనిది. చూడుము ఫత్ హుల్ బారీ 1/244]

షైతాన్ నుండి రక్షణకై ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చదివే దుఆ

بسم الله توكلت على الله، ولا حول ولا قوة إلا بالله

బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, వలా హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి

అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. నేను ఆయన్నే నమ్ముకున్నాను. పాపాల నుండి మరలి పోవాలన్నా, మంచి పనులు చేయాలన్నా ఆయన శక్తివల్లనే సాధ్యమవుతుంది

[అబూదావూద్, తిర్మిజీ, నసాయి తదితరులు దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా పేర్కొన్నారు]
[రిఫరెన్స్: రియాదుస్సాలిహీన్ – హదీసు: 82]

మస్జిద్ లోనికి ప్రవేశించునపుడు షైతాన్ బారినుండి అల్లాహ్ శరణు కోరండి

أَعُوذُ بِاللهِ الْعَظِيمِ، وَبِوَجْهِهِ الْكَرِيمِ، وَسُلْطَانِهِ الْقَدِيمِ، مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ. [بِسْمِ اللهِ، وَالصَّلَاةُ وَالسَّلَّامُ عَلَى رَسُولِ اللهِ] اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

అఊదు బిల్లా హిల్ అదీమ్ వబి వజ్ హి హిల్ కరీమ్. వ సుల్తానిహిల్ ఖదీమ్, మినష్ షైతా నిర్రజీమ్. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రనూలిల్లాహి, అల్లాహుమ్మఫ్ తహ్లి అబ్ వాబ రహ్మతిక్

శపించబడిన షైతాన్ బారి నుండి సర్వోత్తముడైన, కారుణ్యంతో నిండిన ముఖము గల, సర్వశక్తిశాలి అయిన అల్లాహ్ శరణు వేడుచున్నాను. అల్లాహ్ పేరుతో ప్రవేశిస్తున్నాను. అల్లాహ్ సందేశహరునిపై శాంతి మరియు శుభాలు కురియుగాక, ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణా కటాక్షాల ద్వారములు తెరియుము. (అబూ దావూద్, సహీహ్ కలిముత్ తయ్యిబ్ అల్ బానీ)

హజ్రత్ ఫాతిమా ఉల్లేఖన ప్రకారం: “అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబీ వఫ్ తహ్ల్లీ అబ్ వాబ రహ్మతిక్” లాంటి పదాలు కూడా చదివేవారు ( ముస్లిం, ఇబ్నుమాజ 1-128-129)

చెడు కలలు /పీడ కలలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?

1.ఎడమ వైపు మూడుసార్లు ఉమ్మాలి ( తుంపరలు పడకుండా)

2.షైతాను మరియు చెడు కల కీడు నుండి ముూడు సార్లు అల్లాహ్ శరణు కోరాలి


أَعوذُ بِاللهِ مِنَ الشَّيْطانِ الرَّجِيم

అవూదు బిల్లాహి మినష్ షైతా నిర్రజీమ్
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను

3.ఎవరికీ దాని గురించి చెప్పకూడదు


4.ఉన్న స్థితి నుండి మారి మరో వైపునకు తిరిగి పడుకోవాలి.


5.రెండు రకాతులు నమాజు చేసుకుంటే మంచిది


[ముస్లిం 4/1772,4/1773] [హిస్నుల్ ముస్లిం : దుఆ # 114]

నిద్రలో భయాందోళనలకు గురవుతే పఠించు దుఆ

أَعُوذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ غَضَبِهِ وَعِقَابِهِ، وَشَرِّ عِبَادِهِ، وَمِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ وَأَنْ يَحْضُرُونِ

అఊదు బికలిమాతిల్లాహిత్ తామ్మతి మిన్ ఘదబిహీ, వ ఇఖాబిహీ, వ షర్రి ఇబాదిహీ, వ మిన్ హమజాతిష్ షయాతీని వ అయ్ యహ్దురూన్

అల్లాహ్ ఆగ్రహం, ఆయన శిక్ష నుండి, ఆయన దాసుల వల్ల కలిగే కీడు నుండి, షైతాను రేపే దుష్ట ప్రేరేపణల నుండి ఇంకా అవి నా దగ్గరకు రావడం నుండి నేను అల్లాహ్ యొక్క పూర్తి వచనాల ద్వారా శరణు కోరుచున్నాను. (అబూదావూద్, సహీ అత్తిర్మీదీ 3-177)

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرَّهُ إِلَى مُسْلِمٍ

అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు అష్’హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రుహు ఇలా ముస్లిమ్. 

భావం : ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతీ వస్తువు ప్రభువా! మరియు యజమానీ! నీ తప్ప నిజఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్ల- గాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.

(అబూ దావూద్ 5067).

[ఉదయం సాయంకాలం మరియు నిద్రించేకి ముందు దుఆలలో. … అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వషర్రిష్ షైతాని వ షిర్కిహీ]

దుష్ట షైతానుల మాయోపాయాలను తరమడానికి ఏమి పఠించాలి?

أَعُوذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ الَّتِي لَا يُجَاوِزُهُنَّ بَرٌّ ولَا فَاجرٌ مِنْ شَرِّ مَا خَلَقَ، وبَرَأَ وذَرَأَ، ومِنْ شَرِّ مَا يَنْزِلُ مِنَ السَّمَاءِ وِمنْ شَرِّ مَا يَعْرُجُ فِيهَا، ومِن شَرِّ مَا ذَرَأَ في الأَرْضِ ومِنْ شَرِّ مَا يَخْرُجُ مِنْهَا، وِمنْ شَرِّ فِتَنِ اللَّيْلِ والنَّهارِ، ومِنْ شَرِّ كُلِّ طارِقٍ إِلَّا طَارِقاً يَطْرُقُ بخَيْرٍ يَا رَحْمَنُ

అవూదు బికలిమాతిల్లాహి త్తామ్మాతిల్లతీ లా యుజావిజుహున్న బర్రున్ వలా ఫాజిరున్ మిన్ షర్రిమ్ మా ఖలఖ్, వ బరఅ వదరఅ, వమిన్ షర్రి మా యంజిలు మినస్ సమాయి, వ మిన్ షర్రి మా యారుజు ఫీహా, వమిన్ షర్రి మా దరఅ ఫిల్ అర్ది వ మిన్ షర్రి మా యఖ్ రుజు మిన్హా, వ మిన్ షర్రి ఫితనిల్ లైలి వన్ నహారి, వమిన్ షర్రి కుల్లి తారిఖిన్ ఇల్లా తారిఖన్ యత్ రుఖు బి ఖైరిన్ యా రహ్మాన్

అల్లాహ్ సృష్టించిన స్థాపించిన ప్రతి కీడు నుండి, ఆకాశం నుండి దిగే కీడు నుండి, దాని వైపునకు మరలే కీడు నుండి, భూమిపై వ్యాపించి ఉన్న కీడు నుండి, దాని నుండి వెలికి వస్తున్న కీడు నుండి, రేయింబవళ్ళ కీడు నుండి, శుభాలతో నిండిన రేయి తప్ప ప్రతి చీకటి రాత్రి కీడు నుండి, కరుణామయుడైన ఓ అల్లాహ్! మంచి వారు కానీ, చెడ్డవారు కానీ, అతిక్రమించని నీ సమస్త వచనాల ద్వారా నీ శరణు కోరుతున్నాను. (అహ్మద్, ఇబ్నుస్ సున్నీ 637)

[అహ్మద్ 3/419 సహీహ్ పరంపరలతో, ఇబ్నుస్ సున్నీ సంఖ్య 637 మరియు తహావీ యొక్క శోధన పుట 133 లో అల్ అర్నావూత్ ఆయన (దీని) పరంపరల సహీహ్ అన్నారు. మరియు చూడుము మజ్మాఅ అజ్జవాఇద్ 10/127] [హిస్నుల్ ముస్లిం : దుఆ # 247]

భార్యతో సంభోగించడానికి ముందు చేయు దుఅ

بِسْمِ الله اللّهُمَّ جَنِّبْنا الشَّيْطانَ، وَجَنِّبِ الشَّيْطانَ ما رَزَقْتَنا

బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్ నష్ షైతాన, వ జన్ని బిష్ షైతాన మా రజఖ్ తనా

అల్లాహ్ పేరుతో – ఓ అల్లాహ్ మమ్మల్ని షైతాన్ నుండి కాపాడు, అలాగే నీవు మాకు ప్రసాదించే సంతానాన్ని కూడా షైతాన్నుండి కాపాడు [ బుఖారి & ముస్లిం]

[హిస్నుల్ ముస్లిం : దుఆ #192]

ఏయే సందర్భాల్లో మనం షైతాన్ నుండి అల్లాహ్ యొక్క రక్షణ, శరణు కోరాలి? 

1- ఖుర్ఆన్ తిలావత్ ప్రారంభించినప్పుడు. (నహ్ల్ 16:98)

2- మనిషికి తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు. (ఆరాఫ్ 7 :200, 201, మూమినూన్ 23 :97,98, ఫిస్సిలత్ 41 :36)

3- నీ ప్రభును ఎవడు సృష్టించాడు అన్న చెడు ఆలోచన షైతాన్ కలగజేస్తే వెంటనే ఈ తప్పుడు ఆలోచనను మానుకోని, అల్లాహ్ శరణు కోరాలి. (బుఖారీ 3276, ముస్లిం 134).

4- నమాజులో ఖింజబ్ అనే షైతాన్ ద్వారా ఎక్కువ ఆలోచనలు కలిగినప్పుడు. (ముస్లిం 2203).

5- మనిషి చాలా కోపానికి గురి అయినప్పుడు. (బుఖారీ 6115)

6- మనిషి చెడు స్వప్న చూసినప్పుడు. (బుఖారీ3292, ముస్లిం2261)

7- మస్జిదులో ప్రవేశించునప్పుడు. అఊజు బిల్లాహిల్ అజీం, వబివజ్ హిహిల్ కరీం, వసుల్తానిహిల్ ఖదీం, మినష్షైతానిర్రజీం. (అబూ దావూద్ 466)

8- గాడిద గాండ్రింపు విన్నప్పుడు, కుక్క మొరిగినప్పుడు. (బుఖారీ 3303, ముస్లిం 2729).

9- ప్రయాణంలో ఏదైనా ప్రాంతంలో మజిలీ చేసినప్పుడు. అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (ముస్లిం 2708).

10- మరుగుదొడ్లో ప్రవేశించినప్పుడు. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్. (తిర్మిజి 606, బుఖారీ 142)

11- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయి పెట్టి, 3సార్లు బిస్మిల్లాహ్, 7 సార్లు అఊజు బిఇజ్జతిల్లాహి వఖుద్రతిహీ మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్. (ముస్లిం 2202).

12- ఉదయం సాయంకాలం మరియు నిద్రించేకి ముందు దుఆలలో. … అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వషర్రిష్ షైతాని వ షిర్కిహీ. (అబూ దావూద్ 5067).

13- నిద్రలో భయాందోళనలకు గురవుతే. అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ గజబిహీ వఇఖాబిహి వషర్రి ఇబాదిహి వమిన్ హమజాతిష్షయాతీన్, వరబ్బి అఁయ్యహ్ జురూన్. (అబు దావూద్ 3893).

14- పిల్లలకు ఇలా దుఆ ఇవ్వాలి. అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మహ్ మిన్ కుల్లి షైతానివ్ వహామ్మహ్ వమిన్ కుల్లి ఐనిన్ లామ్మహ్. (బుఖారీ 3371).