దుస్తులు ధరిస్తున్నప్పుడు ఈ దుఆ చదవండి
الحَمْدُ لِلَّهِ الَّذِي كَسَانِي هَذَا الثَّوبَ وَرَزَقَنِيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلَا قُوَّةٍ
అల్ హందులిల్లాహిల్లజీ కసానీ హాజస్ సౌబ వరజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్
(అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే మాకు ఈ వస్త్రాలు ధరింపజేశాడు, ఇది నాకు ప్రసాదించాడు, ఇందులో నా శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు)
[అబూ దావూద్ 4023] [షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు]
లాభం: ఎవరు ఈ దుఆ చదువుతారో వారి గత పాపాలు మన్నించబడతాయి
భోజనం చేసిన తర్వాత ఈ దుఆ చదవండి
الحَمْدُ لِلَّهِ الَّذِي أَطْعَمَنِي هَذَا وَرَزَقَنِيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلَا قُوَّةٍ
అల్ హందులిల్లాహిల్లజీ అత్అమనీ హాజా వరజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్
(అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే మాకు తినిపించాడు, ఇది ప్రసాదించాడు, ఇందులో నా శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు)
[తిర్మిజి 3458] [షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు]
లాభం: ఎవరు ఈ దుఆ చదువుతారో వారి గత పాపాలు మన్నించబడతాయి
గమనిక: ఇక్కడ గత పాపాలు అంటే “చిన్న పాపాలు” అని భావం. పెద్ద పాపాల మన్నింపుకొరకు స్వచ్చమైన తౌబా చేయవలసి ఉంటుంది