నమాజు ముగించిన తర్వాత చేసే జిక్ర్, దుఆ లు

నమాజు తర్వాత చదివే జిక్ర్ ఘనత [ఆడియో] [27:37 నిముషాలు]
https://youtu.be/_eBuDfQT_qU
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[1] అస్తగ్ ఫిరుల్లాహ్ , అల్లాహుమ్మ అంతస్సలామ్ ..


 أَسْـتَغْفِرُ الله
అస్తగ్ ఫిరుల్లాహ్
(ఓ అల్లాహ్ నన్ను క్షమించు) (3సార్లు పఠించవలెను.)

اللّهُـمَّ أَنْـتَ السَّلامُ ، وَمِـنْكَ السَّلام ، تَبارَكْتَ يا ذا الجَـلالِ وَالإِكْـرام
అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త యా ల్ జలాలి వల్ ఇక్రామ్.


ఓ అల్లాహ్! నీవు శాంతి ప్రదాతవు, నీ వద్ద నుండే శాంతి ప్రాప్తిస్తుంది. ఓ వైభవోపేత, గౌరవోన్నతుడా! సకల శుభాలు కలవాడవు నీవే

(ముస్లిం 1/414)

[2] లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ, లాషరీకలహూ…. జల్ జద్ధి మిన్కల్ జద్దు

لَا إِلهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ, లాషరీకలహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత, వలా మూతియ లిమా మనఅత వలా యన్ఫవు జల్ జద్ధి మిన్కల్ జద్దు

అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు, ఓ అల్లాహ్! నీవు ఎవరికైనా ప్రసాదిస్తే దానిని నివారించేవారు ఎవరూ లేరు, నీవు ఎవరికైనా ఇవ్వకుంటే వారికి ప్రసాదించే వారు ఎవరూ లేరు, ఏ గొప్పవాని గొప్పతనం నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్ని చేకూర్చదు.

[అల్ బుఖారీ 1/255 మరియు ముస్లిం 1/414]

[3] లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ, లాషరీకలహూ…. వలవ్ కరిహల్ కాఫిరూన్

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ، لَه النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

లా ఇలాహ ఇల్లల్లాహు వదహులాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్ నిఅమతు వలహుల్ ఫద్లు వలహుస్ సనావుల్ హసన్, లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలవ్ కరిహల్ కాఫిరూన్.

అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ ప్రసాదించిన శక్తి సామర్థ్యాలు తప్ప మరేది లేదు.ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. అనుగ్రహాలు ఆయనవే. కృపావరములు ఆయనవే. మంచి పొగడ్తలు ఆయనకే సొంతం. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. చిత్తశుద్ధితో మా ఆరాధనలను ఆయనకే అంకితం చేస్తాము. తిరస్కారులకు అది ఎంతగా సహించరానిదైనా సరే.

[ముస్లిం 1/415]

[4] సుబ్ హానల్లాహ్, అల్ హమ్ దులిల్లాహ్, అల్లాహు అక్బర్


سُبْحَانَ اللهِ، وَالْحَمْدُ للهِ، وَاللهُ أَكْبَرُ

సుబ్ హానల్లాహ్ (33 సార్లు),
అల్ హమ్ దులిల్లాహ్ (33 సార్లు),
అల్లాహు అక్బర్ (33 సార్లు) చదవాలి.

అల్లాహ్ పరిశుద్దుడు, సకల స్తోత్రాలు అల్లాహ్ కే చెందును. అల్లాహ్ గొప్పవాడు

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీకలహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు , వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ (దీన్ని ఒకసారి చదవాలి)

అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును, ఆయనే అన్నింటి పై అధికారం కలవాడు.

[ముస్లిం 1/418] – దీనిని ఎవరైతే ప్రతి నమాజు తర్వాత ఇలా అంటారో అతని తప్పులు సముద్రపు నురుగు అంత ఉన్నా క్షమించబడును.

[5] మూడు ఖుల్ సూరాలు

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ: قُلْ هُوَ اللهُ أَحَدٌ ۞ اللهُ الصَّمَدُ ۞ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ۞ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ : قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ۞ مِنْ شَرِّ مَا خَلَقَ ۞ وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ۞ وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ۞ وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ


بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ : قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ۞ مَلِكِ النَّاسِ ۞ إِلَهِ النَّاسِ ۞ مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ۞ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ۞ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ

బిస్మిల్లాహ్ హిర్రహ్ మానిర్రహీమ్
ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్ సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్.


బిస్మిల్లాహ్ హిర్రహ్ మానిర్రహీమ్
ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వ మిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్, వ మిన్ షర్రిన్ నఫ్పాసాతి ఫిల్ ఉఖద్, వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్.


బిస్మిల్లాహ్ హిర్రహ్ మానిర్రహీమ్
ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లదీ యువస్ విసు ఫీ సుదూ రిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్

(ప్రతి నమాజు తరువాత ఒకసారి, ఫజర్ మరియు మగ్రిబ్ నమాజు తరువాత మూడు సార్లు చదవాలి.)

[6] ఆయతుల్ కుర్సీ

اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం లాతఅ’ ఖుజుహూ సినతుఁ వలా నౌమ్, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇందహూ ఇల్లా బిఇజ్నిహీ యఅ’లము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహుస్సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జుహుమా వహువల్ అలీయ్యుల్ అజీం. [ఒకసారి పఠించండి] (సూర బఖరలోని ఆయత్ 2 : 255).

అల్లాహ్! ఆయన తప్ప నిజఆరాధ్యుడు మరొకడు లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం, ఆయనకు కునుకు గానీ మరియు నిదురగానీ రానేరాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉంది, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు, మరియు ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు, ఆయన కుర్సీ వైశాల్యం భూమ్యాకాశాలను పరివేష్ఠించి ఉంది, వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన సర్వోన్నతుడు మరియు ఎంతో గొప్పవాడు.

(సహీహ్అ ల్ జామి 5-339) (అల్ బఖర:255)

ఎవరైతే ప్రతి నమాజు తర్వాత పఠిస్తారో అతడిని చావుతప్ప మరేదీ స్వర్గంలోకి ప్రవేశించటం నుండి ఆపలేదు. [అన్నిసాఈ. సంఖ్య 100]

[“ఆమాల్ అల్- యౌమి వల్ లైలహ్ ”లో ఇబ్ను సిన్న సంఖ్య 121 మరియు సహీహ్ అల్ జామిఅ 5/339లో అల్బానీ సహీహ్ అన్నారు. మరియు సిల్సిలతిల్ ఆహాదీస్ అస్సహీహ 2/697 సంఖ్య 972, మరియు సూరతుల్ బఖరలోని ఆయత్ సంఖ్య 255]

[7] లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ… అలా కుల్లి షైఇన్ ఖదీర్

لَا إِلَهَ إِلَّا اللهُ وَحَدْهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ يُحْيِي وَيُمِيتُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (ఈ దుఆ పది సార్లు ఫజర్ నమాజు మగ్ రిబ్ నమాజు తరువాత చదవాలి).

అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, బ్రతికించేవాడు, చంపేవాడు ఆయనే. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు (తిర్మిదీ 5-515, అహ్మద్ 4-237).

[అత్తిర్మిదీ ఉల్లేఖించారు 5/515, అహ్మద్ 4/227 మరియు దీని వివరణ జాద్ అల్ మఆద్ లో 1/300 చూడుము]

[8] ప్రయోజనకరమైన జ్ఞానం, పరిశుద్ధమైన ఆహారం, ఆమోదయోగ్యమైన ఆచరణ

అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఇల్మన్ నాఫిఅన్ వ రిజ్ ఖన్ తయ్యిబన్, వ అమలన్ ముతఖబ్బలన్. (ఫజర్ నమాజు తరువాత చదవాలి)

ఓ అల్లాహ్! ప్రయోజనకరమైన జ్ఞానాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని ఆమోదయోగ్యమైన ఆచరణను ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. (ఇబ్ను మాజ 1-152).

[ఇబ్నమాజాహ్ ఇతరులు మరియు చూడుము సహీహ్ ఇబ్ను మాజాహ్ 1/152, మజ్మఅజ్జవాఇద్ 10/111 మరియు దుఆ సంఖ్య 95]