బంగారం & వెండిని కూడబెట్టుకోవడం కంటే మెరుగైన దుఆ వాక్యాలు [వీడియో]

బంగారం & వెండిని కూడబెట్టుకోవడం కంటే మెరుగైన దుఆ వాక్యాలు
https://youtu.be/-_0DITGNGCo – [60 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

దుఆ వినండి:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الثَّبَاتَ فِي الْأَمْرِ، وَالْعَزِيمَةَ عَلَى الرُّشْدِ، وَأَسْأَلُكَ مُوجِبَاتِ رَحْمَتِكَ، وَعَزَائِمَ مَغْفِرَتِكَ، وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ، وَحُسْنَ عِبَادَتِكَ، وَأَسْأَلُكَ قَلْبَاً سَلِيمَاً، وَلِسَانَاً صَادِقَاً، وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ لِمَا تَعْلَمُ، إِنَّكَ أنْتَ عَلاَّمُ الْغُيُوبِ

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకస్సబాత ఫిల్ అమ్ర్ – ఓ అల్లాహ్! నాకు ధర్మంపై నిలకడ

వల్ అజీమత అలర్రుష్ద్ – మరియు విధేయేతలో దృఢత్వం ప్రసాదించమని కోరుతున్నాను

వఅస్అలుక మూజిబాతి రహ్మతిక్ – నీ కారుణ్యం తప్పనిసరిగా ప్రాప్తించే సత్కార్యాలు

వఅజాఇమ మగ్ ఫిరతిక్ – నీ క్షమాభిక్ష కూడా తప్పనిసరిగా ప్రాప్తించాలని వేడుకుంటున్నాను

వఅస్అలుక షుక్ర నిఅ మతిక్ – నేను అర్థిస్తున్నాను నీ అనుగ్రహాల కృతజ్ఞత భాగ్యం మరియు

వహుస్న ఇబాదతిక్ – నీ ఆరాధన ఉత్తమ రీతిలో చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించమని

వఅస్అలుక ఖల్బన్ సలీమా – నిష్కల్మషమైన మనస్సు ప్రసాదించమని

వలిసానన్ సాదిఖా – సత్యం పలికే నాలుక ప్రసాదించమని వేడుకుంటున్నాను

వఅస్అలుక మిన్ ఖైరి మా తఅ లమ్ – నీకు తెలిసి ఉన్న ప్రతి మేలు నీతో కోరుతున్నాను

వఅఊజు బిక మిన్ షర్రి మా తఅ లమ్ – నీకు తెలిసి ఉన్న ప్రతి కీడు నుండి శరణు ప్రసాదించు

వ అస్తగ్ ఫిరుక లిమా త లమ్, – నీకు తెలిసి ఉన్న నా పాపాలన్నీ క్షమించుమని కోరుతున్నాను

ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్ – నిశ్చయంగా నీవు అగోచరాల పరిపూర్ణ జ్ఞానం గలవాడివి

[ముఅ జమ్ కబీర్ తబ్రానీ 7135 | సహీహా 3228]

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

భోజనం చేసిన తర్వాత ఈ దుఆ చదవండి, పాపాలు మన్నించబడతాయి

భోజనం చేసిన తర్వాత ఈ దుఆ చదవండి, పాపాలు మన్నించబడతాయి
https://youtu.be/L89lfsiN-uY [1 minute]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

الْحَمْدُ للهِ الَّذي أَطْعَمَني هذا وَرَزَقَنيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلا قُوَّة

“అల్ హమ్ దులిల్లాహిల్లదీ అత్ అమనీ హాదా, వ రజఖనీహి మిన్ గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వతిన్”

సమస్త స్తోత్రములు నన్ను తినిపించిన ఆ అల్లాహ్ కు చెందును. నా ఏ విధమైన కృషి ఎలాంటి శక్తి లేకుండానే ఆయన నాకు ప్రసాదించాడు. (ఇబ్నుమాజ, సహీ తిర్మిదీ 3-159)

Dua After eating:

Alhamdu lillaahil-lathee ‘at’amanee haathaa, wa razaqaneehi, min ghayri hawlin minnee wa laa quwwatin. (Praise is to Allah, Who has given me this food and sustained me with it though I was unable to do it and powerless) (At-Tirmithi, Abu Dawud, and Ibn Majah. See also Al-Albani, Sahih At-Tirmithi 3/159)

సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదివితే కలిగే పుణ్యాలు

సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదివితే కలిగే పుణ్యాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلهَ إلاَّ أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَااسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلاَّ أَنْتَ

అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్ తనీ వ అనా అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅదిక మస్తతఅతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

భావం : ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులోకి వచ్చుచున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు.

ప్రయోజనం : పై దుఆ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలముకు ముందే అతను మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదవి ఉదయించక ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. (బుఖారి 6306).

పడుకునే ముందు ఈ చిన్న జిక్ర్ చేస్తే సముద్రపు నురుగంత పాపాలు కూడా మన్నించబడతాయి

https://youtu.be/GrBeEWaasDg – [1:39 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. సుబ్ హానల్లాహ్ వల్ హందు లిల్లాహ్ వ లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్.

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ سُبْحَانَ الله وَ الْحَمْدُ لِلهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ