ధర్మం పై స్థిరత్వం కోసం దుఆలు

Video Courtesy: Dawah and Foreigners guidance office, zulfi, Saudi Arabia.

దుఆలు మీరు నేర్చుకొనుటకై పై వీడియోలో చెప్పిన దుఆలు క్రింద పొందుపరిచాం 

రబ్బనా లా తుజిఘ్ ఖులూబనా బాద ఇజ్ హదైతనా

ఓ మా ప్రభువా1 మార్గదర్శకత్వం పొందిన తరువాత మా హృదయాలను పెడ మార్గం వైపులో పడనీయకు

[సూరహ్ ఆలె ఇమ్రాన్ :8]
అల్లాహుమ్మ ముసర్రిఫల్ ఖులూబి సర్రిఫ్ ఖులూబనా అలా తాఅతిక

ఓ అల్లాహ్ హృదయాలను త్రిప్పే వాడా మా హృదయాలను ని విధేయత వైపునకు త్రిప్పేయి 

[సహీహ్ ముస్లిం : 2654 ]
యా ముఖల్లిబల్ ఖులూబి సబ్బిత్ ఖల్బీ  అలా దీనిక్

ఓ హృదయాలను తిప్పుతూ ఉండేవాడా! నా హృదయాన్ని నీ సత్య ధర్మం పై స్థిరంగా ఉంచు

[ సున న్ తిర్మిజి: 2140 ]
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఈమానన్ లాయర్ తద్ద్ 

ఓ అల్లాహ్ నేను నీతో విశ్వసాన్ని ఆర్థిస్తున్నాను, తిరిగి మళ్ళీ అవిశ్వాసంలో పడకుండా ఉండే దృఢమైన విశ్వాసం ప్రసాదించు

[ముస్నద్ అహ్మద్ : 3796]

أَنتَ وَلِىِّۦ فِى ٱلدُّنْيَا وَٱلْءَاخِرَةِۖ تَوَفَّنِى مُسْلِمًا وَأَلْحِقْنِى بِٱلصَّٰلِحِينَ

అంత వలియ్యీ ఫిద్ దున్యా వల్ ఆఖిర. తవఫ్ఫనీ ముస్లిమవ్ వ అల్ హిక్నీ బిస్ సాలీహీన్

నీవే ఇహపర లోకాలలో నీవే నా సంరక్షకుడవు. నీకు విధేయునిగా (ముస్లింగా) ఉన్న స్థితిలోనే నన్ను మరణింపజేయి. మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.

(దివ్య ఖురాన్ 12:101)