
రబ్బనగ్ ఫిర్ లీ వలి వాలిదయ్య వలిల్ మూ’మినీన యౌమ యకూముల్ హిసాబ్
మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు.
(14 : 41)
1491. హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: దావూద్ ప్రవక్త (అలైహిస్సలాం) ప్రార్థనల్లో ఇది కూడా ఒకటి:
అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుక హుబ్బక, వ హుబ్బ మయ్-యుహిబ్బుక, వల్-అమల్ అల్లజీ యుబల్లిఘునీ హుబ్బక. అల్లాహుమ్మ అజ్-అల్ హుబ్బక అహబ్బ ఇలయ్య మిన్ నఫ్ సీ, వ అహ్ లీ, వ మినల్ మాయిల్ బారిద్
“ఓ అల్లాహ్! నేను నీ ప్రేమను, నిన్ను ప్రేమించేవారి ప్రేమను, నన్ను నీ ప్రేమ దాకా చేర్చే కర్మలను ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నీ ప్రేమను నా కొరకు నా ప్రాణం కన్నా, నా ఆలుబిడ్డల కన్నా, చల్లని నీటికన్నా ప్రియమైనదిగా చెయ్యి.” (తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)
ముఖ్యాంశాలు;
ఈ ప్రార్ధనలో అల్లాహ్ ప్రేమతోపాటు అల్లాహ్ ప్రియదాసుల ప్రేమను, సత్కార్యాల ప్రేమను కూడా అర్ధించటం జరిగింది. ఎందుకంటే మనిషికి వీటి మూలంగా కూడా అల్లాహ్ ప్రేమ, ఆయన సాన్నిహిత్యం లభిస్తాయి.
ఈ హదీసు హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen) నుండి తీసుకోబడింది . Book 17, Hadith 1491
لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ
లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్
అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి. (21 : 87)
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు : “దైవ ప్రవక్త యూనుస్ అలైహిస్సలామ్ దుఆ ఆధారంగా ఏ ముస్లిం తన గోడుని నివేదించుకున్నా అల్లాహ్ దానిని ఆమోదిస్తాడు.” (జామే తిర్మిజీ హ. నెం.3505, అల్బానీ గారు ఈ హదీస్ ని ప్రామాణికమైనదిగా ఖరారు చేసారు.)
ఇతర సంబంధిత లింకులు: