ఆపదల్లో, బాధల్లో & కష్టాల్లో చేసుకునే ముఖ్యమైన దుఆలు

https://youtu.be/Al0p2Gz8-64
ఆపదల్లో, బాధల్లో మరియు కష్టాల్లో చేసుకునే ముఖ్యమైన దుఆలు

لَا إلَهَ إِلَّا اللهُ الْعَظيمُ الْحَلِيمْ، لَا إِلَهَ إِلَّا اللهُ رَبُّ العَرْشِ العَظِيمِ، لَا إِلَهَ إِلَّا الله رَبُّ السَّمَوّاتِ ورّبُّ الأَرْضِ ورَبُّ العَرْشِ الكَريم

లా ఇలాహ ఇల్లల్లాహుల్ అదీముల్ హలీమ్, లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అదీమ్, లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుస్ సమావాతి వరబ్బుల్ అర్ధి వ రబ్బుల్ అర్షిల్ కరీమ్

అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు, ఆయన మహోన్నతుడు అత్యంత మృదుత్వం కలవాడు, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు, మహోన్నమైన పీఠానికి అధిపతి, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడు లేడు, భూమ్యాకాశాల ప్రభువు, ఘనమైన పీఠానికీ ప్రభువు.

[అల్ బుఖారీ 7/154 మరియు ముస్లిం 4/2092]
[ హిస్నుల్ ముస్లిం దుఆ సంఖ్య: 122]

اللّهُمَّ رَحْمَتَكَ أَرْجو فَلا تَكِلني إِلى نَفْسي طَرْفَةَ عَيْن، وَأَصْلِحْ لي شَأْني كُلَّه لَا إِلَهَ إِلَّا أنْت

అల్లాహుమ్మ రహ్మతక అర్ జూ ఫలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐనిన్ వ అస్లిహ్ లీ షఅనీ కుల్లహూ, లా ఇలాహ ఇల్లా అన్త్

ఓ అల్లాహ్! నేను నీ కారుణ్యముపైనే ఆశ పెట్టుకున్నాను, కనుక నన్ను క్షణకాలం కోసమైనా నా మనోవాంఛలకు అప్పగించవద్దు. నాకై నా కార్యాలన్నీ చక్కదిద్దు నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు

[అబుదావూద్ 4/324, అహ్మద్ 5/42 మరియు సహీహ్ అబుదావూద్ 3/959 లో అల్బానీ దీనిని హసన్ అన్నారు] [ హిస్నుల్ ముస్లిం దుఆ సంఖ్య:123]

لا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِين

లా ఇలాహ ఇల్లా అన్త సుబ్ హానక ఇన్నీ కున్తు మినద్ దాలిమీన్

నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు, నీవు పరిశుద్ధుడవు నిశ్చయముగా నేనే దుర్మార్గుడిని.

[అత్తిర్మిదీ 5/529, అల్ హాకిం. మరియు అల్ హాకిం దీనిని సహీహ్ అన్నారు అజ్జహబీ ఏకీభవించారు 1/505 మరియు చూడుము సహీహ్ అత్తిర్మిదీ 3/168] [ హిస్నుల్ ముస్లిం దుఆ సంఖ్య:124]

اللهُ اللهُ رَبِّ لا أُشْرِكُ بِهِ شَيْئاً
అల్లాహు అల్లాహు రబ్బీ లా ఉప్రికు బిహీ షైఆ
అల్లాహ్! అల్లాహ్ యే నా ప్రభువు, దేనినైనా నేను ఆయనకు సాటి కల్పించను.

[దీనిని అబుదావూద్ ఉల్లేఖించారు 2/87 మరియు చూడుము సహీహ్ ఇబ్ను మాజహ్ 2/335]
[హిస్నుల్ ముస్లిం దుఆ సంఖ్య:125]

اللّهُمَّ إِنِّي عَبْدُكَ ابْنُ عَبْدِكَ ابْنُ أَمَتِكَ نَاصِيَتِي بِيَدِكَ، مَاضٍ فِيَّ حُكْمُكَ، عَدْلٌ فِيَّ قَضَاؤكَ أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ أَوْ أَنْزَلْتَهُ فِي كِتَابِكَ، أَوْ عَلَّمْتَهُ أَحَداً مِنْ خَلْقِكَ أَوِ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الغَيْبِ عِنْدَكَ أَنْ تَجْعَلَ القُرْآنَ رَبِيعَ قَلْبِي، وَنورَ صَدْرِي وجَلَاءَ حُزْنِي وذَهَابَ هَمِّي

అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక, ఇబ్ను అబ్దిక, ఇబ్ను అమతిక, నాసియతీ బియదిక, మాదిన్ ఫియ్య హుక్ముక, అద్లున్ ఫియ్య ఖదాఉక, అస్అలుక బికుల్లిస్మిన్, హువలక సమ్మైత బిహీ నఫ్సక, అవ్ అన్ జల్తహూ ఫీ కితాబిక అప్ అల్లమ్తహూ అహదన్ మిన్ ఖల్ ఖిక అవ్ ఇస్తాసర్త బిహి ఫీ ఇల్మిల్ గైబి ఇన్దక, అన్ తజ్అలల్ ఖుర్ ఆన రబీఅ ఖల్చీ, వ నూర సద్రీ, వ జలాఅ హుజ్నీ, వదహాబ హమ్మీ

ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నీ దాసుడిని, నీ దాసుడి కుమారుడిని, నీ దాసురాలి పుత్రుడను, నా నొసలు, ముంగురులు నీ చేతిలో ఉన్నాయి. నీ ఆజ్ఞ నాలో కొనసాగుతున్నది నా కొరకై నీ తీర్పు న్యాయసమ్మతమైనది నీ నామములన్నింటితో, వేటినైతే నీవు నీ కొరకు పెట్టుకున్నావో, లేదా నీ గ్రంథంలో అవతరింపజేసావో, లేదా నీ సృష్టిలో ఎవరికైనా తెలిపావో లేదా నీ అగోచర జ్ఞానంలోనే ఉంచాలని నిశ్చయంచుకున్నావో నామములన్నింటితో నిన్ను అడుగుచున్నాను – ఖుర్ఆన్ ను నా మనసుకు వసంతముగా, హృదయానికి కాంతిగా, నా మనోవేదనను దూరం చేసే దానిగా, నా దుఃఖాన్ని దూరం చేసేదిగా చేయమని వేడుచున్నాను

[అహ్మద్ 1/391 మరియు అల్ఫానీ సహీహ్ అన్నారు] [ హిస్నుల్ ముస్లిం దుఆ సంఖ్య:120]