ముఖ్యమైన జిక్ర్ & దుఆలు – ఇమాం ఇబ్నె బాజ్

[గమనిక: ఈ చాప్టర్ ఇమాం ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారు వ్రాసిన “హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఇది హజ్ చేసే వాళ్ళ కోసం రాయబడిన పుస్తకం. కానీ క్రింది చాప్టర్ లో పేర్కొనబడిన జిక్ర్ మరియు దుఆలు హజ్ చేయని వారు కూడా అరఫా రోజు చేసుకొని లాభం పొందవచ్చు. ఈ జిక్ర్ మరియు దుఆలు అరఫా రోజే కాకుండా మిగతా రోజుల్లో సందర్భాలలో కూడాచేసుకోవచ్చు. అల్లాహ్ మనందరికీ సత్బాఘ్యం ప్రసాదించు గాక, అమీన్]

لاَ  إِلهَ  إِلاَّ  اللهُ  وَحْدَهُ  لَا  شَرِيْكَ  لَهُ ،  لَهُ  المْـُلْكُ  وَلَهُ  الْـحَمْدُ ، يـُحْيِي  وَ  يُمِيْتُ  ، وَ هُوَ  عَلَى   كُلِّ   شَيْءٍ   قَدِيْرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్దహు, లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, యుహ్ఈ వ యుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.

ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావు బ్రతుకులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది.

ఈ క్రింది నాలుగు ధ్యానాలను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడతాడని కొన్ని ప్రామాణిక ఉల్లేఖనలు తెలుపుతున్నాయి – 

سُبْحَانَ  الله
సుబ్-హానల్లాహ్
అన్ని రకాల లోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు

وَ الْـحَـمْدُ  لله
వల్ హమ్దులిల్లాహ్
సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే

وَ  لاَ  إِلَـهَ  إِلاَّ  الله
వలా ఇలాహ ఇల్లల్లాహ్
ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప.

وَ  اللهُ  أَكْبـَرْ
వల్లాహు అక్బర్
అల్లాహ్ అందరి కంటే (అన్నింటి కంటే) మహోన్నతుడు.

سُبْحَانَ اللهِ وَالْـحَمْدُ للهِ وَلاَ إِلَهَ إِلاَّ الله وَاللهُ أَكْبَرُ، وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِاللهِ الْعَـلِيِّ الْعَظِـيْمِ

సుబహానల్లాహి, వల్ హమ్ దులిల్లాహి, వ లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, వ లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్

అల్లాహ్ యే పరమ పవిత్రుడు, సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గలవారెవ్వరూ లేరు, అల్లాహ్ యే మహోన్నతుడు. అల్లాహ్ తప్ప – అంతటి శక్తిసామర్ధ్యాలు గలవారెవ్వరూ లేరు. ఆయనే మహోన్నతుడు, ఘనత గల వాడూను.

سُبْحَانَ  اللهِ  وِبِحَمْدِهِ،  سُبْحَانَ  اللهِ  الْعَظِيمَ

సుబహానల్లాహి వ బిహమ్దిహి – సుబహానల్లాహిల్ అజీమ్.

ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు మరియు సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు ఆయనకే చెందును – ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు, అత్యంత ఘనమైన వాడు.

لاَ  حَوْلَ  وَلاَ  قُوَّةَ  إِلاَّ  بِالله

లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

ఆయన వద్ద నున్న శక్తీ, సామర్థ్యం  తప్ప మరింకేదీ లేదు.

لاَ  إِلَهَ  إِلاَ  أَنْتَ  سُبْحَانَكَ  إِنِّي  كُنْتُ  مِنَ  الظَّالِـمِـيْنَ
లా ఇలాహ ఇల్లా అంత, సుబహానక, ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్
ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – నీవు తప్ప. అన్ని లోపాలకూ అతీతుడివీ, పరమ పవిత్రుడివి. నిశ్చయంగా నేను హద్దుమీరిన వారిలోని వాడినే (కేవలం నీ దయ కారణంగానే నేను హద్దుమీరక నీ దాసుడిగా మారగలిగాను).

لاَ  إِلَهَ  إِلاَّ  الله  وَلاَ  نَعْبُدُ  إِلاَّ  إِيَّاهُ،  لَهُ  النَّعْمَةُ  وَلَهُ  الْفَضْلُ  وَلَهُ  الثَّنَاءُ  الـْحُسْنُ، لاَ  إِلَهَ  إِلاَّ  الله  مـُخْلِصِيْنَ  لَهُ  الدِّيْنَ  وَلَوْ  كَرِهِ  الْكَافِرُونَ

లా ఇలాహ ఇల్లల్లాహ్, వ లా నఆబుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నఅమతు, వ లహుల్ ఫద్లు, వ లహుథ్థానాఉల్ హుస్ను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన లహుద్దీన, వలవ్ కరిహల్ కాఫిరూన్

ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మేమందరమూ కేవలం నిన్నే ఆరాధిస్తాము. అన్ని రకాల శుభాలు మరియు అనుగ్రహాలు ఆయనవే. అత్యంత ఘనమైన ప్రశంసలు కేవలం ఆయన కొరకే. ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మా యొక్క చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం ఆయన కొరకే – సత్యతిరస్కారులకిది అయిష్టమైనా సరే.

رَبَّنَا  آتِنَا  فِي  الدُّنْيَا  حَسَنَةً  وَفِي  الْآخِرَةِ  حَسَنَةً  وَقِنَا  عَذَابَ  النَّارِ

రబ్బనా ఆతినా ఫిద్దున్యా, హసనతవ్ , వ ఫిల్ ఆఖిరతి హసనతవ్, వ ఖినా అదాబన్నార్

ఓ మా ప్రభూ! ఈ ప్రపంచంలో మాకు శుభాలను ప్రసాదించు మరియు పరలోకంలో కూడా శుభాలను ప్రసాదించు మరియు నరకాగ్ని శిక్ష నుండి మమ్ముల్ని కాపాడు.

أَللَّهُمَّ  أَصْلِحْ  لِي  دِيْنِي الَّذِي  هُوَ  عِصْمَةُ  أَمْرِي،  وَأَصْلِحْ  لِي  دُنْيَاي  الَّتِي  فِيْهَا مَعَاشِي،  وَأَصْلِحْ  لِي  آخِرَتِي  الَّتِي  فِيْهَا  مَعَادِي،  وَاجْعَلِ  الـْحَيَاةِ  زِيَادَةً  لِي  فِي كُلِّ  خَيْرٍ، وَالـْمَوْتَ  رَاحَةً  لِي  مِنْ  كُلِّ  شَرٍ

అల్లాహుమ్మ అస్లిహ్ లి దీనీ – అల్లదీ హువ ఇస్మతు అమ్రీ, వ అస్లిహ్ లీ దున్యాయ – అల్లతీ ఫీహా మఆషీ, వ అస్లిహ్ లీ ఆఖిరతీ – అల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతన్ లీ ఫీ కుల్లి ఖైరిన్, వల్ మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్.

ఓ అల్లాహ్!  నా ఆచరణలను (చెడు నుండి) కాపాడే విధంగా నా ధర్మాన్ని సరిదిద్దు. నా జీవనోపాధి ఉన్న నా ఈ ప్రపంచాన్ని సరిదిద్దు. నేను మరల వలసి ఉన్న నా పరలోకాన్ని సరిదిద్దు. నా కొరకు ప్రతి ఒక్క శుభంలోనూ నా ఈ జీవితాన్ని పొడిగించు. మరియు ప్రతి దుష్టత్వం నుండి నా మరణాన్ని కాపాడు.

أَعُوذُ بِالله مِنْ جَهْدِ الْبَلَاءِ،  وَدَرَكِ الشِّقَاءِ،  وَسُوْءِ الْقَضَاءِ،  وَشَمَاتَةِ الأَعْدَاءِ

అఊదు బిల్లాహి మిన్ జహ్ దిల్ బలాఇ, వ దరకిష్ ష ఖాఇ, వ సూఇల్ ఖదాఇ, వ షమాతతిల్ ఆదాఇ.

కఠిన పరీక్షల నుండి, దురదృష్టాల నుండి, నాకు వ్యతిరేకమైన తీర్పుల నుండి మరియు విరోధుల అపహాస్యాల నుండి నేను అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الـْهَمِّ وَالـْحَزَنِ، وَمِنَ الْعَجْزِ وَالْكَسَلِ، وَمِنَ الـْجُبْنِ وَالْبُخْلِ، وَمِنَ الـْمَأْثَمِ وَالـْمَغْرَمِ، وَمِنْ غَلَبَةِ الدِّيْنِ وَقَهْرِ الرِّجَالِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ హమ్మి వల్ హజని, వ మినల్ అజ్ జి వల్ కసలి,  వ మినల్ జుబ్ని వల్ బుఖ్లి, వ మినల్ మఅథమి వల్ మగ్రమి, వ మిన్ గలబతిద్దీని వ ఖహ్రిర్రిజాలి.

ఓ అల్లాహ్! బాధలకు, కష్టాలకు, కలతలకు, విచారానికి, దు:ఖానికి, పీడనలకు, నిస్సహాయానికి, బద్దకానికి, సోమరితనానికి, పిరికితనానికి, పాపాలకు మరియు అప్పులకు, అప్పుల భారముకు మరియు ఇతరులు నాపై ఆధిక్యం చలాయింటానికి వ్యతిరేకంగా నేను నీ శరణు వేడుకుంటున్నాను.

أَعُوذُ بِكَ اللَّهُمَّ مِنَ الْبَرْصِ وَالـْجُنـُوْنِ وَالـْجُذَامِ وَمِنْ سَـيِّءِ الْأَسْقَامِ

అఊదు బిక అల్లాహుమ్మ మినల్ బర్సి, వల్ జునూని, వల్ జుదామి, వ మిన్ సయ్యిఇల్ అస్ కామి

ఓ అల్లాహ్! కుష్టురోగం నుండి, నల్ల కుష్టురోగం నుండి, పిచ్చితనం నుండి మరియు ఇతర అసహ్యమైన వ్యాధుల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنـِّي أَسْأَلُكَ الْعَفْـوَ وَالْعَافِيَـةَ فـِي الدُّنِيَـا وَالْآخِرَةِ،

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరహ్

ఓ అల్లాహ్! ఇహపరలోకాలలో నీ మన్నింపు మరియు రక్షణ కొరకు నేను నిన్ను వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنـِّي أَسْأَلُكَ الْعَفْـوَ وَالْعَافِيـَةَ فـِي دِيـْنِي وَدُنْيَايَ وَأَهْـلِي وَمَالِي

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ

ఓ అల్లాహ్! నా ధర్మం, నా ప్రపంచం, నా కుటుంబం మరియు నా సంపద యొక్క క్షేమం గురించి మరియు  నా మన్నింపు గురించి నేను నిన్ను వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِي وَآمِنْ رَوْعَاتِي، وَاحْفَظْنِي مِنْ بَيْنَ يَدَيَّ وَمِنْ خَلْفِي وَعَنْ يَمِيْنِي وَعَنْ شِمَالِي، وَمِنْ فَوْقِي وَأَعُوْذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تـَحْتِي

అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, వ ఆమిన్ రౌఆతీ, వహ్ ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ వఅన్ షిమాలీ, వమిన్ ఫౌఖీ, వఅఊదు బి అజమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్తీ

ఓ అల్లాహ్! నా తప్పులను దాచివేయి మరియు భయం నుండి నన్ను కాపాడు, నా కుడివైపు నుండి మరియు నా ఎడమ వైపు నుండి మరియు నా పై వైపు నుండి, నా ముందు నుండి మరియు నా వెనుక నుండి నన్ను రక్షించు. నా క్రింద నుండి నేను హత్య చేయబడతానేమో అనే భయంతో నేను నీ ఘనత ఆధారంగా నీ శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ اغْـفِرْ لـِي خَطِيْـئَتـِي وَجَهْلـِي وَإِسْرَافِي فِي أَمْرِي وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنـِّي

అల్లాహుమ్మగ్ ఫిర్ లీ ఖతీఅతీ వ జహ్లీ వ ఇస్రాఫీ, ఫీ అమ్రీ వ మా అంత ఆలము బిహీ మిన్నీ

ఓ అల్లాహ్! నాకంటే అధికంగా నీకు తెలిసిన నా లోపాలను, అజ్ఞానాన్ని మరియు హద్దుమీరటాన్ని క్షమించు.

أَللَّهُمَّ اغْـفِرْ لـِي جَدِّي وَهَزْلـِي وَخَطَـئِي وَعَـمْدِي وَكُلِّ ذَلِكَ عِنْدِي

అల్లాహుమ్మగ్ ఫిర్ లీ జద్దీ వ హజ్లీ, వ ఖతయీ, వ అమ్దీ వ కుల్లు దాలిక ఇన్ దీ

ఓ అల్లాహ్! గంభీరంగా మరియు పరిహాసంగా నేను చేసిన పాపాలను మరియు నా చెడు ఆలోచనలను, నాలోని కొరతలను మరియు నాలోని లోపాలన్నింటినీ  క్షమించు.

أَللَّهُمَّ اغْـفِرْ لِـي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْـتُ وَمَا أَنْـتَ أَعْلَمُ بِهِ مِنِّي، أَنْتَ الـْمُقَدَّمُ وَأَنْتَ الـْمُؤَخِّرُ وَأَنْتَ عَلَى كُلِّ شَـيْءٍ قَدِيْـرٌ

అల్లాహుమ్మగ్ ఫిర్ లీ మా ఖద్దమ్తు, వ మా అఖ్ఖర్తు, వ మా అస్రర్తు, వ మా ఆలంతు, వ మా అంత ఆలము బిహీ మిన్నీ, అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు వ అంత అలా కుల్లి షైఇన్ ఖదీర్.

ఓ అల్లాహ్! నా ద్వారా పూర్వం జరిగిపోయిన వాటినీ మరియు జరుగబోయే వాటినీ క్షమించు, మరియు రహస్యంగానూ, బహిరంగంగానూ నా ద్వారా జరిగిపోయిన వాటినీ క్షమించు – అవి నా కంటే ఎక్కువగా నీకే తెలుసు. కేవలం నీవు మాత్రమే ఎవరినైనా ముందుకు పంపగలవు లేదా వెనక్కి తీసుకురాగలవు. కేవలం నీవు మాత్రమే అన్నింటిపై ఆధిపత్యం కలిగి ఉన్నావు.

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الثَّبَاتَ فِي الْأَمْرِ وَالْعَزِيْمَةَ عَلَى الرُّشْدِ، وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ وَحُسْنَ عِبَادَتِكَ، وَأَسْأَلُكَ قَلْباً سَلِيْمـًا وِلِسَاناً صَادِقاً، وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ، وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ، وَأَسْتَغْـفِرُكَ لـِمَا تَعْلَمُ إِنَّكَ عَلاَّمُ الْغُـيُوْبِ

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక థ్థబాత ఫిల్ అమ్రి, వల్ అజీమత అలర్రుష్ది, వ అస్అలుక షుక్ర నిఅమతిక వ హుస్న ఇబాదతిక, వ అస్అలుక ఖల్బన్ సలీమా, వ లిసానన్ సాదిఖా, వ అస్అలుక మిన్ ఖైరి మా తాలము, వ అఊదుబిక మిన్ షర్రి మా తాలము, వ అస్తగ్ ఫిరుక లిమా తాలము, ఇన్నక అల్లాముల్ గుయూబ్.

ఓ అల్లాహ్! నేను నీ నుండి అన్ని విషయాలలో స్థిరత్వాన్ని మరియు సన్మార్గాన్ని అనుసరించటంలో నిలకడను వేడుకుంటున్నాను. నీ అనుగ్రహాలకు బదులుగా నీకు కృతజ్ఞతలు తెలిపుకునే శక్తినీ మరియు నిన్ను సరిగ్గా ఆరాధించే శక్తినీ ప్రసాదించు. సన్మార్గం పై నడిపించే హృదయాన్ని మరియు సత్యాన్ని పలికే నాలుకను నేను నీ నుండి వేడుకుంటున్నాను. నీకు తెలిసిన మంచిని నేను నీ నుండి కోరుకుంటున్నాను. నీకు తెలిసిన ప్రతి చెడు నుండి నేను నీ వద్ద శరణు కోరుకుంటున్నాను. నీకు తెలిసిన పాపాల నుండి నేను నీ మన్నింపును కోరుకుంటున్నాను. నిశ్చయంగా అన్ని గుప్త విషయాలు నీకే తెలుసు.

أَللَّهُمَّ رَبَّ النَّبِيِّ مـُحَمَّدٍ عَلَيْهِ الصَّلاَةُ وَالسَّلاَمُ اغْـفِرْ لـِي ذَنْبِي، وَأَذْهِبْ غَيْظَ قَلْبِي، وَأَعِذْنِي مِنْ مُّضِلاَّتَ الْفِـتْـنِ مَا أَبْـقَيْتَـنـِي

అల్లాహుమ్మ రబ్బన్నబియ్యి ముహమ్మదిన్ అలైహిస్సలాతు వస్సలామ్ – ఇగ్ ఫిర్లీ దంబీ వ అద్హిబ్ గైజ ఖల్బీ, వ అయిద్నీ మిమ్ ముదిల్లాతల్ ఫిత్ని మా అబ్ ఖైతనీ.

ఓ అల్లాహ్!  ముహమ్మద్ యొక్క ప్రభువా! నా తప్పులను మన్నింపుము. క్రోధం నుండి నా హదయాన్ని శుభ్రం చేయుము. నేను సజీవంగా ఉండాలని నీవు తలిచినంత కాలం వరకు, నన్ను దారి తప్పించే ఫిత్నాల (దుష్టత్వం) నుండి కాపాడుము.

أَللَّهُمَّ رَبَّ السَّماَوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيْمِ، رَبُّناَ وَرَبُّ كُلِّ شـَيْءٍ، فَالِقُ الـْحَبِّ وَالنَّوَى، مُنْزِلُ التَّوْرَاةِ وَالْإِنْجِيْلِ وَالْقُرْآنِ، أَعُوْذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شـَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيِتـِهِ، أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَـيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدُكَ شَـيْءٌ، وَأَنْتَ الْظَاهِرُ فَلَيْسَ فَوْقُكَ شَـيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُوْنَكَ شَـيْءٌ، إِقْضِ عَنِّي الدَّيْنَ وَأَغْنِـنِي مِنْ الْفَقْرِ

అల్లాహుమ్మ రబ్బస్సమావాతి వ రబ్బల్ అర్ది వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బునా వ రబ్బు కుల్లి షైఇన్, ఫాలిఖుల్ హబ్బి వన్నవా, ముంజిలుత్తౌరాతి వల్ ఇంజీలి వల్ ఖుర్ఆన్, అఊదు బిక మిన్ షర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిదుంబి నాశియతిహి, అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆఖిరు ఫలైస బఆదక షైఉన్, వ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్, వ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్, ఇఖ్ది అన్నీ అద్ దైన వ అగ్నినీ మినల్ ఫఖ్రి.

ఓ అల్లాహ్! భూమ్యాకాశాల ప్రభువా మరియు మహోన్నతమైన అర్ష్ సింహాసనం యొక్క ప్రభువా! ఓ మా అందరి యొక్క మరియు అన్నింటి యొక్క ప్రభువా! మొలకెత్తుట కొరకు విత్తనాల్ని మరియు గింజలన్ని చీల్చేవాడా మరియు మొక్కలు మొలకెత్తించేవాడా! నీవే తౌరాతును, ఇంజీలును మరియు ఖుర్ఆన్ ను అవతరింపజేసావు. నీ చేతిలో తన నుదురు చిక్కించుకుని ఉన్న ప్రతిదాని దుష్టత్వం నుండి నేను నీ శరణు కోరుతున్నాను. నీవే ప్రథముడివి – నీకు పూర్వం ఉనికిలో ఏదీ లేదు. నీవే కడపటి వాడివి – నీ తర్వాత ఉనికిలో ఏదీ ఉండదు. నీవే మహోన్నతుడివి – నీ పై ఏదీ లేదు. రహస్యాలన్నీ తెలిసిన వాడివి నీవే. గుప్తంగా దాచబడిన వాటిని నీ కంటే బాగా ఎరిగినవారు ఎవ్వరూ లేరు. నా తరుఫున నా ఋణాలు తీర్చు మరియు లేమీ, పేదరికం, దారిద్ర్యం, శూన్యత్వం మొదలైనవి నా దరిదాపులకు కూడా చేరనంత పటిష్టంగా, అభేద్యంగా నన్ను చేయి.

أَللَّهُمَّ أَعْطِ نَفْسـِي تَقْوَاهَا وَزَكِّـهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِـيُّهَا وَمَوْلاَهاَ

అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా, అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా

ఓ అల్లాహ్!  నాకు తఖ్వా (ధర్మనిష్ఠ) ను  ప్రసాదించు మరియు నా ఆత్మను పవిత్రం చేయి. ఉత్తమంగా పవిత్రత చేకూర్చేవాడివి నీవే. ఉత్తముడివి నీవే, నా రక్షకుడివి నీవే మరియు నా పాలకుడివి నీవే.

أَللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْعَـجَزِ وَالْكَسَلِ، وَأَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْـقَبْرِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్అజజి, వల్ కసలీ, వఅఊదు బిక మిన్ అదాబిల్ ఖబర్

ఓ అల్లాహ్!  నిస్సహాయ స్థితి నుండి మరియు సోమరితనం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు సమాధి శిక్షల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبـْتُ وَبِكَ خَاصَمْتُ، أَعُوْذُ بِعِزَّتِكَ أَنْ تُضِلَّنِـي لاَ إِلَهَ إِلاَّ أَنْتَ، أَنْتَ الـْحَيُّ الَّذِي لاَ يَمُوْتُ وَالـْجِنُّ وَالْإِنْسُ يَمُوْتُوْنَ

అల్లాహుమ్మ లక అస్లమ్ తు, వ బిక ఆమన్ తు, వ అలైక తవక్కల్ తు, వ ఇలైక అనబ్ తు, వ బిక ఖాసమ్ తు, అఊదు బి ఇజ్జతిక అన్ తుదిల్లనీ, లా ఇలాహ ఇల్లా అంత, అంతల్ హయ్యుల్లదీ  లా యమూతు వల్ జిన్ను, వల్ ఇన్సు యమూతూన్.

ఓ అల్లాహ్! నేను నీకు విధేయుడైనాను మరియు నిన్నే విశ్వసించాను, నిన్నే నమ్ముకున్నాను, నీవైపుకే మరలాను, నీ కొరకు పోరాడాను. మార్గభ్రష్టత్వం నుండి నన్ను కాపాడమని నీ ఘనత ద్వారా నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క నీవు తప్ప. నీవే శాశ్వతమైనవాడివి. నీకు చావు లేదు – కానీ, జిన్నాతులు మరియు మానవులకు చావు ఉంది.

أَللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنْ عِلْمٍ لاَ يَـنْـفَعُ وَمِنْ قَلْبٍ لاَ يـَخْشَعُ وَمِنْ نَـفْسٍ لاَ تَشْبَعُ، وَمِنْ دَعْوُةٍ لاَ يُـسْتَجَابُ لَـهَا

అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ ఇల్మిన్ లా యన్ ఫవు, వ మిన్ ఖల్బిన్ లా యఖ్షవు, వ మిన్ నఫ్సిన్ లా తష్బవు, వ మిన్ దావతిన్ లా యుస్తజాబు లహా

ఓ అల్లాహ్! ప్రయోజనం కలిగించని జ్ఞానం నుండి, భయపడని హృదయం నుండి, ఎన్నడూ తనివి తీరని / తృప్తి పొందని ఆత్మ నుండి మరియు స్వీకరించబడని ప్రార్థనల నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ جَنـِّبْـنِي مُنْكَرَاتِ الْأَخْلاَقِ وَالْأَعْمَالِ وَالْأَهْوَاءِ وَالْأَدْوَاءِ

అల్లాహుమ్మ జన్నిబ్ నీ మున్ కరాతిల్ అఖ్లాఖి, వల్ ఆమాలి, వల్ అహ్వాయి, వల్ అద్వాయి.

ఓ అల్లాహ్! ప్రతి చెడు ప్రవర్తన నుండి, చెడు పనుల నుండి, చెడు ఆలోచనల నుండి మరియు రోగాల నుండి నేను నీ రక్షణ వేడుకుంటున్నాను.

أّللَّهُمَّ أَلـْهِمْنِي رُشْدِيْ وَأَعِذْنِي مِنْ شَرِّ نَـفْسِي

అల్లాహుమ్మ అల్ హిమ్ నీ రుష్దీ, వ అయిద్ నీ మిన్ షర్రి నఫ్సీ

ఓ అల్లాహ్! నేను మార్గదర్శకత్వం ప్రసాదించు మరియు నాలోని చెడు నుండి నన్ను రక్షించు.

أَللَّهُمَّ اَكْفِنِـي بِحَلاَلِكِ عَنْ حَرَامِكَ وَأَغْنِـنِـي بِـفَضْلِكَ عَمَّنْ سِوَاكَ

అల్లాహుమ్మ అక్ ఫినీ బి హలాలిక అన్ హరామిక, వ అగ్ నినీ బి ఫద్ లిక అమ్మన్ సివాక

ఓ అల్లాహ్! నా ఆవసరాలకు చాలినంతగా నాకు ధర్మసమ్మతమైన జీవనోపాధినే ప్రసాదించు గానీ, అధర్మమైంది కాదు. ఇతరుల నుండి అడుక్కునే గత్యంతరం రానీయకుండా, నీ ఆనుగ్రహాల ద్వారా నన్ను సంతృప్తి పరుచు,

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـهُدَى وَالتُّـقَـى وَالْعَفَافَ وَالْغِـنَـى

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వ త్తుఖా, వల్ అఫాఫ  వల్ గినా

ఓ అల్లాహ్!  నేను నీ నుండి మార్గదర్శకత్వాన్ని, తఖ్వాను (ధర్మనిష్ఠను), సచ్ఛీలతను మరియు సమృద్ధిని కోరుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـهُدَى وَالسَّدَادَ

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వస్సదాద

ఓ అల్లాహ్! నేను నీ నుండి మార్గదర్శకత్వాన్ని మరియు క్షేమాన్ని కోరుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـجَنَّةَ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَعُوْذُ بِكَ مِنْ النَّارِ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَسْأَلُكَ أَنْ تَـجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِـي خَيْراً

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నత, వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అఊదుబిక మినన్నారి వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అస్అలుక అన్ తజ్అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరా

ఓ అల్లాహ్! నేను నీ నుండి స్వర్గాన్ని మరియు స్వర్గం సమీపానికి చేర్చే పలుకు మరియు పని కోరుకుంటున్నాను. నేను నరకాగ్ని నుండి మరియు నరకం సమీపానికి చేర్చే పలుకు మరియు పని నుండి నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నా కోసం వ్రాసిపెట్టిన ప్రతిదానినీ శుభంగా మార్చమని నేను నిన్ను వేడుకుంటున్నాను.

لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيْكَ لَهُ، لَهُ الْـمُلْكُ وَلَهُ الْـحَمْدُ يُـحْيِي وَيُـمِيْتُ بِـيـَدِهِ الْـخَيْـرُ وَهُوَ عَلَى كُلِّ شـَيْءٍ قَـدِيْـرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్యీ వ యుమీతు, బి యదిహిల్ ఖైరు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్

అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గల వారెవ్వరూ లేరు. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. సకల లోకాలు మరియు సమస్త ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావుబ్రతుకులు ఆయన ఆదేశంతోనే సంభవిస్తాయి. శుభమంతా ఆయన చేతుల్లోనే ఉంది. మరియు ప్రతి దానినీ శాసించే శక్తిసామర్ధ్యాలు గలవాడు ఆయనే.

أَللَّهُمَّ صَلِّ عَلَى مُـحَمَّدٍ وَعَلَى آلِ مُـحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيْمَ وَعَلَى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَـمِيْدٌ مَـجِيْدٌ، وَبَارِكْ عَلَى مُـحَمَّدٍ وَعَلَى آلِ مُـحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْـرَاهِـيْمَ وَعَلَى آلِ إِبْـرَاهِـيْمَ إِنَّكَ حَـمِيْدٌ مَـجِـيْدٌ

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.

ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబంపై నీవు కారుణ్యం కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై కారుణ్యం కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గల వాడవూను. ఓ అల్లాహ్!  ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గలవాడవూను.

رَبَّـنَا آتِنـَا فِي الدُّنْيَا حَسَنَـةً وَفِي الْآخِرَةِ حَسَنَـةً وَقِـنَـا عَذَابَ النَّارِ

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనవ్ వ ఖినా అదాబన్నార్

ఓ నా ప్రభూ! ఈ లోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు పరలోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి కాపాడు.

ఈ వ్యాసం క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
అరబీ పుస్తక రచయిత : షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్).

ఈ పోస్ట్ లింక్: https://telugudua.net/ibn-baz-dua/