ఇస్తిగ్ ఫార్, తౌబా & పాప క్షమాపణ జిక్ర్, దుఆలు

“అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతి దినము డెబ్బైసార్లకంటే ఎక్కువ అల్లాహ్ ను మన్నింపుకై వేడుకుంటాను, మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. (బుఖారీ అల్ ఫతహ్ 11/101).

ప్రజలారా! పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి నేనయితే రోజుకు వందేసి సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను.” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు (ముస్లిం 4/2076)

أَسْتَغْفِرُ اللهَ وَأَتُوبُ إِلَيْهِ

అస్తగ్ ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్. { 100 సార్లు పఠించండి}

నేను అల్లాహ్ యొక్క మన్నింపు వేడుకుంటున్నాను, ఆయన సమక్షంలో తౌబా (పశ్చాతాపం) చేస్తున్నాను .

ప్రయోజనం : ఈ జిక్ర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రోజు వందసార్లు చదివేవారు. (ముస్లిం 2702).

ముహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సభలో నుండి లేచే ముందు వంద సార్లు ఈ దుఆ చదివే వారని హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్ను ఉమర్ (రది యల్లాహు అన్హు)ఉల్లేఖించారు:

رَبِّ اغْفِرْ لي، وَتُبْ عَلَيَّ، إِنَّكَ أَنْتَ التَّوّابُ الغَفور

రబ్బిగ్ ఫిర్లీ వ తుబ్ అలైయ్య ఇన్నక అన్తత్ తవ్వాబుల్ గఫూర్

ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తౌబా అంగీకరించు, నిశ్చయంగా నీవు తౌబా అంగీకరించేవాడివి, క్షమించేవాడివి. ( సహీ తిర్మిదీ 3-153 , సహీ ఇబ్నుమాజ 2-321) ( హిస్నుల్ ముస్లిం దుఆ: 195)

أَسْتَغْفِرُ اللهَ الْعَظِيمَ الَّذِي لَا إِلَهَ إلَّا هُوَ الحَيُّ القَيُّومُ وأَتُوبُ إِلَيْهِ

ఎవరయితే “అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి”అని పలుకుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు ఒకవేళ అతను యుద్దభూమి నుండి పారిపోయిన వాడైనా సరే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు (అబూదావూద్, అహ్మద్, తిర్మిదీ 3-182)

اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلهَ إلاَّ أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَااسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلاَّ أَنْتَ

అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్ తనీ వ అనా అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅదిక మస్తతఅతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

భావం : ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులోకి వచ్చుచున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు.

ప్రయోజనం : పై దుఆ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలముకు ముందే అతను మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదవి ఉదయించక ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. (బుఖారి 6306).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించారు: “రాత్రి చివరి గడియలలో ప్రభువు దాసునికి అతి చేరువలో ఉంటాడు. ఆ వేళ అల్లాహ్ ను స్మరించే వారిలో మీరు కూడా చేరాలనుకుంటే చేరండి” (నిసాయి, హాకిమ్ తిర్మిదీ 2-183, సహీహ్ అత్తిర్మిదీ 3/183)

సజ్జా స్థితిలో దాసుడు అల్లాహ్ కు అతి చేరువలో ఉంటాడు. కనుక స్థితిలో మీరు (అల్లాహ్ ను) ఎక్కువగా వేడుకోండి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు’ (ముస్లిం 1/350, అబుషేబా)

అప్పుడప్పుడు నా మనసుకు ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది అప్పుడు నేను రోజుకు నూరుసార్లు అల్లాహ్ ను క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు (ముస్లిం 4/2075) [1]

[1] ఇబ్నుల్ అథీర్ అలా అన్నారు: “లయుఘాను అలా ఖల్ బీ” నాహృదంపై మీద పొర వచ్చినప్పుడు అంటే, దీని అర్థం: తప్పిదం పొరపాటు (మరచిపోవుట) : ఎందుకంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఎల్లప్పుడు అధికంగా స్మరణలో నిమగ్నులై ఉండేవారు, అయితే ఎప్పుడైనా కొన్ని సమయాలలో వారు మరచిపోతే దానిని వారు తన తప్పిదముగా లెక్కకట్టేవారు మరియు క్షమాభిక్ష వేడుకునేవారు. చూడుము జామిఅ అల్ ఉసూల్ 4/386.

سُبْحَانَ اللهِ وَ بِحَمْدِهِ (100 مرة)

సుబ్’హానల్లాహి వబిహందిహీ. (100 సార్లు )
భావం : అల్లాహ్ ప్రశంసతో పాటు ఆయన పవిత్రతను నేను కొనియాడు చున్నాను.

ప్రయోజనం : ఈ జిక్ర్ ఉదయం 100 సార్లు, సాయంకాలం 100 సార్లు చదివినవారికంటే ఉత్తములు ప్రళయదినాన మరెవరూ ఉండరు, కేవలం అతని పరిమాణంలో, లేదా అతని కంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప. (ముస్లిం 2692). మరియు ఈ జిక్ర్ ఉదయం, సాయంకాలం , వంద సార్లు చదివిన వారి పాపాలు సముద్రపు నురుగుకు సమానమైనప్పటికీ క్షమించబడతాయి. (సహీహుత్ తర్గీబ్ 653).

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْ لِي

సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ

ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు. ఓ మా ప్రభువా! నేను నిన్ను స్తుతిస్తున్నాను (కనుక) ఓ అల్లాహ్ నన్ను క్షమించు (బుఖారీ, ముస్లిం)

اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ، دِقَّهُ وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَّتَهُ وَسِرَّهُ

అల్లాహుమ్మగ్ ఫిర్లీ దన్బీ, కుల్లహూ, దిఖ్ఖహు వజిల్లహూ, వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ

ఓ అల్లాహ్! నా పాపాలన్నింటినీ క్షమించుము, చిన్నవి, పెద్దవి, ముందు చేసినవి, తర్వాత చేసినవి, ఇతరుల ఎదుట చేసినవి మరియు గుప్తంగా చేసినవి (అన్నింటిని క్షమించుము.) (ముస్లిం 1/350).

اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْماً كَثِيراً، وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ، فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ

అల్లాహుమ్మ ఇన్నీ దలమ్తు నఫ్సీ దుల్మన్ కసీరన్ వలా యగ్ ఫిరు ద్దునూబ ఇల్లా అంత ఫగ్ ఫిర్ లీ మగ్ఫిరతన్ మిన్ ఇన్దిక వర్ హమ్నీ ఇన్నక అన్తల్ గఫూరుర్ రహీమ్

ఓ అల్లాహ్! చాలా ఎక్కువగా నా ఆత్మకు నేనే విపరీతంగా అన్యాయము చేసుకున్నాను, నీవు తప్ప నా పాపములను క్షమించేవాడెవ్వడూ లేడు కనుక నీ ప్రత్యేక క్షమాగుణంతో నన్ను క్షమించు మరియు నన్ను కరుణించు, నిశ్చయంగా నీవు అమితంగా క్షమించేవాడవు. (ముస్లిం).

[అల్ బుఖారీ 8/168 మరియు ముస్లిం 4/2078]

اللّهُمَّ اغْفِرْ لي ما قَدَّمْتُ وَما أَخَّرْت ، وَما أَسْرَرْتُ وَما أَعْلَنْت ، وَما أَسْرَفْت ، وَما أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي. أَنْتَ المُقَدِّمُ، وَأَنْتَ المُؤَخِّرُ لا إِلهَ إِلاّ أَنْت

అల్లాహుమ్మగ్ ఫిర్లీ మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్తు, వమా అస్ రర్తు. వమా ఆలన్తు , వమా అస్ రఫ్తు , వమా అంత ఆలము బిహీ మిన్నీ, అంతల్ ముఖద్దిము వ అంతల్ ము అఖ్ఖిరు , లా ఇలాహ ఇల్లా అంత్.

ఓ అల్లాహ్! నేను ముందు చేసినవి, తర్వాత చేసినవి, గుప్తంగా చేసినవి ఇతరుల ఎదుట చేసినవి మరియు మితిమీరి ప్రవర్తించిన పాపాలన్నింటినీ క్షమించుము . నేను చేసిన పాపాలన్నీ నీకు తెలుసు (వాటన్నింటిని క్షమించుము). ముందుకు తీసుకువెళ్ళే వాడవు నీవే, వెనక నుంచువాడవు నీవే. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు (ముస్లిం 1/534)

اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ، اللَّهُمَّ نَقِّنِي مِنْ خَطَايَايَ، كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَ بْيَضُ مِنَ الدَّنَسِ، اللَّهُمَّ اغْسِلْنِي مِنْ خَطَايَايَ بِالثَّلْجِ وَالْمَاءِ وَالْبَرَدِ

అల్లాహుమ్మ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లహుమ్మ నఖ్ఖి నీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్ యదు మినద్దనసి, అల్లాహుమ్మగ్ సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్ జి వల్ మాఇ వల్ బరది.

ఓ అల్లాహ్! నాకూ, నా పాపములకు మధ్య, నీవు తూర్పు పడమరల మధ్య ఉంచినంత దూరాన్ని ఉంచుము, ఓ అల్లాహ్! నన్ను మురికి నుండి తెల్లని వస్త్రం శుభ్రము చేయబడునట్లుగా నా పాపముల నుండి నన్ను శుభ్రపరచుము. పాపములనుండి నన్ను మంచుతోనూ, నీటితోనూ మరియు వడగండ్లతోనూ కడిగివేయుము (బుఖారీ, ముస్లిం) ( హిస్నుల్ ముస్లిం దుఆ:27)

[సభ ముగించునప్పుడు, పాప పరిహారము కొరకు పఠించు దుఆ]

سُبْحانَكَ اللّهُمَّ وَبِحَمدِك، أَشْهَدُ أَنْ لا إِلهَ إِلاّ أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتوبُ إِلَيْك

సుబ్ హాన కల్లాహుమ్మ వ బిహమ్దిక, అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక

ఓ అల్లాహ్! నీవు పరిశుద్ధుడవు, సమస్త పొగడ్తలు నీకే, నీవు తప్ప ఆరాధనకు అర్హుడైన వాడెవ్వడూ లేడని సాక్ష్యమిస్తున్నాను, నీ నుండి క్షమాపణను కోరుకుంటున్నాను. మరియు నీ వైపునకే మరులుతున్నాను.(అబూ దావూద్, నిసాయి, ఇబ్నుమాజ, తిర్మిదీ 3-153)

ఖురాన్ లోని ఇస్తిగ్ ఫార్ దుఆలు

رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ

రబ్బనా ఇన్ననా ఆమన్నా ఫగ్ ఫిర్ లనా జునూబనా వ ఖిన్నా అదాబన్నార్

ఓ మా ప్రభూ ! మేము విశ్వ సించాము, కనుక మా పాపాలను మన్నించు ఇంకా మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. 
(3:16)

ربَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينََِ

రబ్బనగ్ ఫిర్ లనా జునూబనా వ ఇస్రాఫనా ఫీ అమ్ రినా వ సబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

ఓ మా ప్రభూ ! మా పాపములను , మా కార్యములలో , మేము మితిమీరి పోయిన దానిని క్షమించుము . మా పాదములను స్థిరముగా ఉంచుము . అవిశ్వాసులను జయించుటకు మాకు సహాయపడుము 
(3:147)

رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الأبْرَارِ

రబ్బనా ఫగ్ ఫిర్ లనా జునూబనా వ కఫ్ఫిర్ అన్నా సయ్యి ఆతినా వత వఫ్ఫ నా మ అల్ అబ్రార్

ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు. (3:193)

رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

రబ్బనా జలమ్ నా అన్ ఫుసనా వ ఇన్ లమ్ తఘ్ ఫిర్ లనా వ తర్ హమ్నా లన కూనన్న మినల్ ఖాసిరీన్

మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము
 (7:23)

رَبَّنَا ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ ٱلْحِسَابُ

రబ్బనగ్ ఫిర్ లీ వలి వాలిదయ్య వలిల్ మూ’మినీన యౌమ యకూముల్ హిసాబ్

మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు. (14 : 41)

لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ

లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక ఇన్నీ కున్తు మిన జ్జాలిమీన్

అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి. (21 : 87)

رَّبِّ ٱغْفِرْ وَٱرْحَمْ وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

రబ్బిగ్ ఫిర్ వర్ హమ్ వ అంత ఖైరుర్రాహిమీన్

నా ప్రభూ! క్షమించు. కనికరించు. కనికరించే వారందరిలోకెల్లా నీవు ఉత్తముడవు. (23 : 118)

رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِي

రబ్బనగ్ ఫిర్ లనా వలిఇఖ్వాని నల్లదీనా సబకూనా బిల్ ఇమానీ వలా తజ్ అల్ ఫీ ఖులుబినా గిల్లల్-లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్ రహీమ్

మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు. 
(59 : 10)

رَبَّنَآ أَتْمِمْ لَنَا نُورَنَا وَٱغْفِرْ لَنَآ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ

రబ్బనా అత్ మిమ్ లనా నూరనా వగ్ ఫిర్ లనా ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్

మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు. 
(66 : 8)