أدعية وأذكار
من الكتاب والسُّنّة الصَّحيحة
تأليف
عبد المحسن بن حمد العباد البدر
﷽
[డౌన్లోడ్ PDF – అరబిక్ దుఆలు]
< 1 >
اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ بِذَنْبِي فَاغْفِرْ لِي فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ
అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్ తనీ వ అన అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅదిక మస్తతఅతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.
ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులోకి వచ్చుచున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు.
సహీహ్ బుఖారీ (6306). హదీసు ఉల్లేఖకులు: షద్దాద్ బిన్ ఔస్ (రజియల్లాహు అన్హు). (దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ‘సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్’ లేదా పాపక్షమాపణ కోరే అత్యుత్తమ దుఆ అని పేర్కొన్నారు).
< 2 >
اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا، وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ، فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّك أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
అల్లాహుమ్మఇన్నీ జలమ్ తు నఫ్సీ జుల్మన్ కసీరా, వలా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అంత, ఫగ్ ఫిర్లీ మగ్ ఫిరతన్ మిన్ ఇందిక్ వర్ హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీమ్
ఓ అల్లాహ్! నేను నా ఆత్మకు (నాకు నేనుగా) తీవ్రమైన అన్యాయం (పాపాలు) చేసుకున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవరూ లేరు. కాబట్టి నీ తరపు నుండి (నీ దయతో) నన్ను క్షమించు మరియు నాపై కరుణ చూపు. నిశ్చయంగా, నీవే అత్యంత క్షమాశీలుడవు మరియు పరమ దయాళుడవు.
సహీహ్ బుఖారీ (834) మరియు సహీహ్ ముస్లిం (6869). హదీసు ఉల్లేఖకులు: అబూ బకర్ (రజియల్లాహు అన్హు).
< 3 >
رَبِّ اغْفِرْ لِي خَطِيئَتِي وَجَهْلِي وَإِسْرَافِي فِي أَمْرِي كُلِّهِ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي، اللَّهُمَّ اغْفِرْ لِي خَطَايَايَ وَعَمْدِي وَجَهْلِي وَهَزْلِي، وَكُلُّ ذَلِكَ عِنْدِي، اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ وَأَنْتَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
రబ్బిగ్ ఫిర్లీ ఖతీయతీ వ జహ్లీ వ ఇస్రాఫీ ఫీ అమ్రీ కుల్లిహి వమా అంత ఆలము బిహీ మిన్నీ, అల్లాహుమ్మగ్ఫిర్ లీ ఖతాయాయ వ అమ్దీ వ జహ్లీ వ హజ్లీ, వ కుల్లు జాలిక ఇందీ, అల్లాహుమ్మగ్ ఫిర్ లీ మా ఖద్దమ్తు వ మా అఖ్ఖర్తు వమా అస్రర్తు వ మా ఆలంతు అంతల్ ముకద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు వ అంత అలా కుల్లి షయ్’ఇన్ ఖదీర్.
ఓ నా ప్రభూ! నా తప్పులను, నా అజ్ఞానాన్ని మరియు నా వ్యవహారాలన్నింటిలో నేను హద్దుమీరి చేసిన పనులను (పాపాలను) క్షమించు. నా కంటే నీకే బాగా తెలిసిన నా (ఇతర) పాపాలను కూడా క్షమించు. ఓ అల్లాహ్! నా పాపాలను, నేను ఉద్దేశపూర్వకంగా (తెలిసి) చేసిన తప్పులను, నా అజ్ఞానాన్ని, మరియు నేను బాధ్యతారహితంగా చేసిన తప్పులను క్షమించు. ఇవన్నీ నాలో ఉన్నాయి (నా ఈ తప్పులన్నింటినీ నేను అంగీకరిస్తున్నాను).
ఓ అల్లాహ్! నేను గతంలో (ముందు) చేసిన, మరియు భవిష్యత్తులో (ఆ తర్వాత) చేయబోయే పాపాలను క్షమించు. నేను రహస్యంగా చేసిన, మరియు బహిరంగంగా చేసిన పాపాలను క్షమించు. నీవే (సన్మార్గంలో, ఉన్నతస్థానాలకు) ముందుకు పంపేవాడివి, నీవే వెనక్కి నెట్టేవాడివి. మరియు నీవు ప్రతి ఒక్క విషయంపై (సర్వానికీ) సంపూర్ణ శక్తి సామర్థ్యాలు గలవాడివి.
సహీహ్ బుఖారీ (6398) మరియు సహీహ్ ముస్లిం (6901). హదీసు ఉల్లేఖకులు: అబూ మూసా (రజియల్లాహు అన్హు).
< 4 >
اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ، دِقَّهُ، وَجِلَّهُ، وَأَوَّلَهُ، وَآخِرَهُ، وَعَلَانِيَتَهُ، وَسِرَّهُ
అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహు
ఓ అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గతమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు
సహీహ్ ముస్లిం (1084). హదీసు ఉల్లేఖకులు: అబూ హురైరా (రజియల్లాహు అన్హు).
< 5 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْهَمِّ وَالْحَزَنِ وَالْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْبُخْلِ وَضَلَعِ الدَّيْنِ وَغَلَبَةِ الرِّجَالِ
అల్లాహుమ్మ ఇన్నీ అవూదు బిక మినల్ హమ్మి వల్ హజన్, వల్ అజ్ జి వల్ కసలి వల్ జుబ్ ని వల్ బుఖ్ లి వ దలయి అద్ దైని వ ఘలబతిర్రిజాల్.
ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను ఆందోళన (విచారం) మరియు దుఃఖం నుండి, అసమర్థత (నిస్సహాయత) మరియు బద్ధకం (సోమరితనం) నుండి, పిరికితనం మరియు పిసినారితనం (లోభత్వం) నుండి, అప్పుల భారం మరియు మనుషుల (శత్రువుల లేదా అప్పుల వాళ్ల) ఆధిపత్యం (అణచివేత) నుండి నీ శరణు కోరుతున్నాను.
సహీహ్ బుఖారీ (6369). హదీసు ఉల్లేఖకులు: అనస్ (రజియల్లాహు అన్హు).
< 6 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْبُخْلِ، وَأَعُوذُ بِكَ مِنَ الْجُبْنِ، وَأَعُوذُ بِكَ أَنْ أُرَدَّ إِلَى أَرْذَلِ الْعُمُرِ، وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الدُّنْيَا، وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్-బుఖ్లి, వ అఊదు బిక మినల్-జుబ్ని, వ అఊదు బిక అన్ ఉరద్ద ఇలా అర్దలిల్-ఉమురి,వ అఊదు బిక మిన్ ఫిత్నతిద్-దున్యా,వ అఊదు బిక మిన్ అదాబిల్-ఖబ్రి.
ఓ అల్లాహ్! నేను పిసినారితనం నుండి నీ శరణు కోరుతున్నాను, పిరికితనం నుండి నీ శరణు కోరుతున్నాను, (దీనమైన మరియు) నిస్సహాయమైన వృద్ధాప్యానికి చేరకుండా నీ శరణు కోరుతున్నాను, ఈ ప్రపంచపు ఫితనాల (పరీక్షల/ప్రలోభాల) నుండి నీ శరణు కోరుతున్నాను, మరియు సమాధి (ఖబ్ర్) శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాను.
సహీహ్ బుఖారీ (6365). హదీసు ఉల్లేఖకులు: సఅద్ బిన్ అబీ వక్కాస్ (రజియల్లాహు అన్హు).
< 7 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْكَسَلِ وَالْهَرَمِ وَالْمَأْثَمِ وَالْمَغْرَمِ، وَمِنْ فِتْنَةِ الْقَبْرِ وَعَذَابِ الْقَبْرِ، وَمِنْ فِتْنَةِ النَّارِ وَعَذَابِ النَّارِ، وَمِنْ شَرِّ فِتْنَةِ الْغِنَى، وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْفَقْرِ، وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ، اللَّهُمَّ اغْسِلْ عَنِّي خَطَايَايَ بِمَاءِ الثَّلْجِ وَالْبَرَدِ، وَنَقِّ قَلْبِي مِنَ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنَ الدَّنَسِ، وَبَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్-కసలి, వల్-హరమి, వల్-మఅసమి, వల్-మగ్రమి,
వ మిన్ ఫిత్నతిల్-ఖబ్రి, వ అదాబిల్-ఖబ్రి,
వ మిన్ ఫిత్నతిన్-నారి, వ అదాబిన్-నారి,
వ మిన్ షర్రి ఫిత్నతిల్-గినా, వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్-ఫఖ్రి,
వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్-మసీహిద్-దజ్జాల్.
అల్లాహుమ్మగ్-సిల్ అన్నీ ఖతాయాయ బిమాఇస్-సల్జి వల్-బరది,
వ నక్కి ఖల్బీ మినల్-ఖతాయా కమా నక్కైతస్-సౌబల్-అబ్యద మినద్-దనసి,
వ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బాఅద్-త బైనల్-మష్రిఖి వల్-మగ్రిబి.
ఓ అల్లాహ్! నేను బద్ధకం నుండి, వృద్ధాప్యం నుండి, పాపం నుండి మరియు అప్పుల భారం నుండి నీ శరణు కోరుతున్నాను. సమాధి ఫితనా (పరీక్ష) మరియు సమాధి శిక్ష నుండి, నరకాగ్ని ఫితనా మరియు నరకాగ్ని శిక్ష నుండి, మరియు సంపద తెచ్చిపెట్టే కీడు (ఫితనా) నుండి నీ శరణు కోరుతున్నాను. నేను పేదరికపు ఫితనా నుండి నీ శరణు కోరుతున్నాను, మరియు మసీహుద్-దజ్జాల్ యొక్క ఫితనా నుండి నీ శరణు కోరుతున్నాను.
ఓ అల్లాహ్! మంచు మరియు వడగళ్ల నీటితో నా పాపాలను కడిగివేయు. తెల్లని వస్త్రం మురికి నుండి శుభ్రపరచబడినట్లుగా నా హృదయాన్ని పాపాల నుండి శుభ్రపరచు. మరియు తూర్పు, పడమరల మధ్య ఎంత దూరం ఉందో, నాకు మరియు నా పాపాలకు మధ్య అంతటి దూరాన్ని ఉంచు (నన్ను పాపాలకు దూరంగా ఉంచు).
సహీహ్ బుఖారీ (6368) మరియు సహీహ్ ముస్లిం (6871). హదీసు ఉల్లేఖకులు: ఆయిషా (రజియల్లాహు అన్హా).
< 8 >
اللَّهُمَّ رَبَّ السَّمَوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ، رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ، فَالِقَ الْحَبِّ وَالنَّوَى وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ، اللَّهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ، وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ، اقْضِ عَنَّا الدَّيْنَ وَأَغْنِنَا مِنَ الْفَقْرِ
అల్లాహుమ్మ రబ్బస్-సమావాతి వ రబ్బల్-అర్ది, వ రబ్బల్-అర్షిల్-అజీమ్,
రబ్బనా వ రబ్బ కుల్లి షైఇన్,
ఫాలిఖల్-హబ్బి వన్-నవా,
వ మున్జిలత్-తౌరాతి వల్-ఇంజీలి వల్-ఫుర్ఖాన్,
అఊదు బిక మిన్ షర్రి కుల్లి షైఇన్ అన్త ఆఖిదున్ బినాసియతిహి.
అల్లాహుమ్మ అన్తల్-అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్,
వ అన్తల్-ఆఖిరు ఫలైస బఅదక షైఉన్,
వ అన్తజ్-జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్,
వ అన్తల్-బాతిను ఫలైస దూనక షైఉన్,
ఇఖ్ది అన్నాద్-దైన వ అగ్నినా మినల్-ఫఖ్రి.
ఓ అల్లాహ్! ఆకాశాల ప్రభువా, భూమికి ప్రభువా, మరియు గొప్ప అర్ష్ (సింహాసనం)కు ప్రభువా! మా ప్రభువా, మరియు ప్రతిదానికీ ప్రభువా! గింజలను, విత్తనాలను మొలకెత్తించేవాడా! తౌరాత్, ఇంజీల్ మరియు ఫుర్ఖాన్ (ఖుర్ఆన్) లను అవతరింపజేసినవాడా! నీవు దేని ముంగురులు పట్టుకొని ఉన్నావో (అంటే దేనిపై నీకు పూర్తి అదుపు, ఆధిపత్యం ఉందో), ఆ ప్రతి ప్రాణి/వస్తువు యొక్క కీడు నుండి నేను నీ శరణు కోరుతున్నాను..
ఓ అల్లాహ్! నీవే మొట్టమొదటివాడివి, నీకంటే ముందు ఏమీ లేదు. నీవే చిట్టచివరివాడివి, నీ తర్వాత ఏమీ ఉండదు. నీవే అత్యున్నతమైనవాడివి (బహిర్గతమైనవాడివి), నీ పైన ఏమీ లేదు. నీవే ఆంతర్యాలను ఎరిగినవాడివి (దాగి ఉన్నవాడివి), నీకంటే రహస్యమైనది ఏమీ లేదు. మా తరపున మా అప్పులను తీర్చు, మరియు పేదరికం నుండి మమ్మల్ని దూరం చేసి స్వయం సమృద్ధులుగా (ధనవంతులుగా) చేయి.
సహీహ్ ముస్లిం (6889). హదీసు ఉల్లేఖకులు: అబూ హురైరా (రజియల్లాహు అన్హు).
< 9 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عَمِلْتُ وَمِنْ شَرِّ مَا لَمْ أَعْمَلْ
అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ షర్రి మా అమిల్తు, వ మిన్ షర్రి మా లమ్ అఅమల్.
ఓ అల్లాహ్! నేను చేసిన పనుల కీడు (చెడు పరిణామాలు) నుండి, మరియు నేను చేయని పనుల కీడు నుండి నేను నీ శరణు కోరుతున్నాను.
సహీహ్ ముస్లిం (6895). హదీసు ఉల్లేఖకులు: ఆయిషా (రజియల్లాహు అన్హా).
< 10 >
اللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ، وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ
అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనీ, అల్లదీ హువ ఇస్మతు అమ్రీ,
వ అస్లిహ్ లీ దున్-యాయ, అల్లతీ ఫీహా మఆషీ,
వ అస్లిహ్ లీ ఆఖిరతీ, అల్లతీ ఫీహా మఆదీ,
వజ్-అలిల్-హయాత జియాదతన్ లీ ఫీ కుల్లి ఖైరిన్,
వజ్-అలిల్-మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్.
ఓ అల్లాహ్! నా కోసం నా ధర్మాన్ని (దీన్ ను) బాగుపరచు, ఎందుకంటే అదే నా వ్యవహారాలన్నింటికీ రక్షణ (ఆధారం). నా కోసం నా ఇహలోకాన్ని (దునియాను) బాగుపరచు, ఎందుకంటే ఇందులోనే నా జీవనోపాధి ఉంది.మరియు నా కోసం నా పరలోకాన్ని (ఆఖిరత్ ను) బాగుపరచు, ఎందుకంటే అక్కడికే నా తిరుగుప్రయాణం ఉంది. నా ఈ జీవితాన్ని ప్రతి మంచి పనిని అధికంగా చేయడానికి (పెంచుకోవడానికి) అవకాశంగా చేయి.మరియు నా మరణాన్ని ప్రతి కీడు (చెడు) నుండి నాకు విశ్రాంతిగా (విముక్తిగా) చేయి.
సహీహ్ ముస్లిం (6903). హదీసు ఉల్లేఖకులు: అబూ హురైరా (రజియల్లాహు అన్హు).
< 11 >
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْهُدَى وَالتُّقَى وَالْعَفَافَ وَالْغِنَى
అల్లాహుమ్మ ఇన్నీ అస్’అలుకల్-హుదా, వత్-తుఖా, వల్-అఫాఫ, వల్-ఘినా.
ఓ అల్లాహ్! నేను నీ నుండి మార్గదర్శకత్వాన్ని, తఖ్వాను (ధర్మనిష్ఠను), సచ్ఛీలతను మరియు సమృద్ధిని కోరుకుంటున్నాను.
సహీహ్ ముస్లిం (6904). హదీసు ఉల్లేఖకులు: ఇబ్న్ మస్ఊద్ (రజియల్లాహు అన్హు).
< 12 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعَجْزِ وَالْكَسَلِ، وَالْجُبْنِ وَالْبُخْلِ، وَالْهَرَمِ وَعَذَابِ الْقَبْرِ، اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عِلْمٍ لَا يَنْفَعُ، وَمِنْ قَلْبٍ لَا يَخْشَعُ، وَمِنْ نَفْسٍ لَا تَشْبَعُ، وَمِنْ دَعْوَةٍ لَا يُسْتَجَابُ لَهَا
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్-అజ్ జి వల్-కసలి, వల్-జుబ్ని వల్-బుఖ్లి, వల్-హరమి వ అజాబిల్-ఖబ్రి. అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ ఇల్మిన్ లా యన్ఫఉ, వ మిన్ ఖల్బిన్ లా యఖ్షఉ, వ మిన్ నఫ్సిన్ లా తష్బఉ, వ మిన్ దావతిన్ లా యుస్తజాబు లహా.
ఓ అల్లాహ్! నిస్సహాయత (అశక్తత), సోమరితనం, పిరికితనం, పిసినారితనం, వృద్ధాప్యపు దీనస్థితి మరియు సమాధి శిక్షల నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా ఆత్మకు దైవభీతిని (తఖ్వాను) ప్రసాదించు మరియు దానిని పవిత్రపరచు; దానిని పవిత్రపరిచే వారిలో నీవే అత్యుత్తముడవు, నీవే దానికి సంరక్షకుడవు మరియు యజమానివి. ఓ అల్లాహ్! ప్రయోజనం చేకూర్చని విద్య, భయపడని (భక్తి లేని) హృదయం, సంతృప్తి చెందని ఆత్మ (మనస్సు) మరియు స్వీకరించబడని ప్రార్థన (దుఆ) నుండి నేను నీ శరణు కోరుతున్నాను.
సహీహ్ ముస్లిం (6906). హదీసు ఉల్లేఖకులు: జైద్ బిన్ అర్ఖమ్ (రజియల్లాహు అన్హు).
< 13 >
اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ، وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِعِزَّتِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْ تُضِلَّنِي، أَنْتَ الْحَيُّ الَّذِي لَا يَمُوتُ وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوتُونَ
అల్లాహుమ్మ లక అస్లమ్తు, వ బిక ఆమన్తు, వ అలైక తవక్కల్తు, వ ఇలైక అనబ్తు, వ బిక ఖాసమ్తు. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బి-ఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత అన్ తుదిల్లనీ. అంతల్-హయ్యుల్లజీ లా యమూతు, వల్-జిన్ను వల్-ఇన్సు యమూతూన.
ఓ అల్లాహ్! నేను నీకే కట్టుబడి ఉన్నాను (విధేయుడినయ్యాను), నీపైనే విశ్వాసం ఉంచాను, నీపైనే నా భారం వేశాను (నమ్మకం ఉంచాను), నీ వైపుకే పశ్చాత్తాపంతో మరలాను మరియు నీ (సహాయం) తోనే సత్యవిరోధులతో వాదించాను. ఓ అల్లాహ్! నీవు తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడు వేరొకడు లేడు, నన్ను మార్గభ్రష్టుని చేయకుండా నీ ఘనత/మహిమ ద్వారా నీ శరణు కోరుతున్నాను. ఎన్నటికీ మరణం లేని సజీవుడవు నీవే, కానీ జిన్నులు మరియు మానవులు మరణించేవారు.
సహీహ్ బుఖారీ (7383) మరియు సహీహ్ ముస్లిం (6899). హదీసు ఉల్లేఖకులు: ఇబ్న్ అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా).
< 14 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ وَتَحَوُّلِ عَافِيَتِكَ وَفُجَاءَةِ نِقْمَتِكَ وَجَمِيعِ سَخَطِكَ
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ జవాలి ని’మతిక, వ తహవ్వులి ఆఫియతిక, వ ఫుజాఅతి నిఖ్మతిక, వ జమీఇ సఖతిక
ఓ అల్లాహ్! నీవు ప్రసాదించిన అనుగ్రహం (నా నుండి) తొలగిపోకుండా, నీవిచ్చిన భద్రత (మరియు ఆరోగ్యం) మారిపోకుండా, అకస్మాత్తుగా నీ శిక్ష రాకుండా మరియు నీ అన్ని రకాల ఆగ్రహాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను.
సహీహ్ ముస్లిం (6943). హదీసు ఉల్లేఖకులు: ఇబ్న్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా).
< 15 >
اللَّهُمَّ مُصَرِّفَ الْقُلُوبِ صَرِّفْ قُلُوبَنَا عَلَى طَاعَتِكَ
అల్లాహుమ్మ ముసర్రిఫల్-ఖులూబి, సర్రిఫ్ ఖులూబనా అలా తాఅతిక
ఓ అల్లాహ్! హృదయాలను మరల్చేవాడా (మరియు మార్చేవాడా)! మా హృదయాలను నీ విధేయత వైపుకు మరల్చు.
సహీహ్ ముస్లిం (6750). హదీసు ఉల్లేఖకులు: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రజియల్లాహు అన్హుమా).
< 16 >
اللَّهُمَّ رَبَّ جَبْرَائِيلَ وَمِيكَائِيلَ وَإِسْرَافِيلَ، فَاطِرَ السَّمَوَاتِ وَالأَرْضِ، عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ، أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ، اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِكَ، إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ
అల్లాహుమ్మ రబ్బ జిబ్రాయీల వ మీకాయీల వ ఇస్రాఫీల, ఫాతిరస్-సమావాతి వల్-అర్ది, ఆలిమల్-ఘైబి వష్-షహాదతి, అంత తహ్కుము బైన ఇబాదిక ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన. ఇహ్దినీ లిమఖ్-తులిఫ ఫీహి మినల్-హఖ్ఖి బి-ఇజ్నిక, ఇన్నక తహ్దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్-ముస్తఖీమ్.
ఓ అల్లాహ్! జిబ్రాయీల్, మీకాయీల్ మరియు ఇస్రాఫీల్ (దూతల) ప్రభువా! ఆకాశాలు మరియు భూమిని సృష్టించినవాడా! అగోచరమైన (కనిపించని) మరియు గోచరమైన (కనిపించే) విషయాలన్నీ తెలిసినవాడా! నీ దాసులు విభేదించుకున్న (భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న) విషయాలలో నీవే వారి మధ్య తీర్పునిస్తావు. (ప్రజలు) విభేదించుకున్న విషయాలలో నీ అనుమతితో నాకు సత్యం వైపుకు మార్గదర్శకత్వం చేయి. నిశ్చయంగా నీవు ఎవరిని కోరుకుంటే వారిని రుజుమార్గం (సన్మార్గం) వైపుకు నడిపిస్తావు.
సహీహ్ ముస్లిం (1811). హదీసు ఉల్లేఖకులు: ఆయిషా (రజియల్లాహు అన్హా).
< 17 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ، وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ، وَأَعُوذُ بِكَ مِنْكَ، لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ، أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బి-రిదాక మిన్ సఖతిక, వ బి-ముఆఫాతిక మిన్ ఉఖూబతిక, వ అఊజు బిక మిన్క, లా ఉహ్సీ సనాఅన్ అలైక, అంత కమా అస్నైత అలా నఫ్సిక.
ఓ అల్లాహ్! నీ ఆగ్రహం నుండి నీ ప్రసన్నత (సంతోషం) లో నేను శరణు కోరుతున్నాను. నీ శిక్ష నుండి నీ క్షమాపణలో శరణు కోరుతున్నాను. మరియు నీ (ఆగ్రహం/శిక్ష) నుండి నీలోనే శరణు కోరుతున్నాను. నీ పొగడ్తలను (స్తోత్రాలను) నేను పూర్తిగా లెక్కించలేను (వర్ణించలేను). నిన్ను నీవు ఏ విధంగానైతే వర్ణించుకున్నావో (పొగుడుకున్నావో), నీవు సరిగ్గా అలాగే ఉన్నావు
సహీహ్ ముస్లిం (1090). హదీసు ఉల్లేఖకులు: ఆయిషా (రజియల్లాహు అన్హా).
< 18 >
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ جَهْدِ الْبَلَاءِ وَدَرَكِ الشَّقَاءِ وَسُوءِ الْقَضَاءِ وَشَمَاتَةِ الْأَعْدَاءِ
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ జహ్దిల్-బలాఇ, వ దరకిష్-షఖాఇ, వ సూఇల్-ఖదాఇ, వ షమాతతిల్-అ’దాఇ
ఓ అల్లాహ్! కఠినమైన ఆపదల తీవ్రత నుండి, దౌర్భాగ్యం (కష్టాలు) నన్ను ఆవరించకుండా, చెడు విధి (నాకు నష్టం కలిగించే తీర్పు) నుండి, మరియు నా కష్టాలను చూసి శత్రువులు సంతోషించడం (హేళన చేయడం) నుండి నేను నీ శరణు కోరుతున్నాను.
సహీహ్ బుఖారీ (6347) మరియు సహీహ్ ముస్లిం (6877). హదీసు ఉల్లేఖకులు: అబూ హురైరా (రజియల్లాహు అన్హు).
< 19 >
اللَّهُمَّ اجْعَلْ لِي فِي قَلْبِي نُورًا، وَفِي لِسَانِي نُورًا، وَفِي سَمْعِي نُورًا، وَفِي بَصَرِي نُورًا، وَمِنْ فَوْقِي نُورًا، وَمِنْ تَحْتِي نُورًا، وَعَنْ يَمِينِي نُورًا، وَعَنْ شِمَالِي نُورًا، وَمِنْ بَيْنِ يَدَيَّ نُورًا، وَمِنْ خَلْفِي نُورًا، وَاجْعَلْ فِي نَفْسِي نُورًا، وَأَعْظِمْ لِي نُورًا
అల్లాహుమ్మజ్-అల్ లీ ఫీ ఖల్బీ నూరా, వ ఫీ లిసానీ నూరా, వ ఫీ సమ్’ఈ నూరా, వ ఫీ బసరీ నూరా, వ మిన్ ఫౌఖీ నూరా, వ మిన్ తహ్తీ నూరా, వ అన్ యమీనీ నూరా, వ అన్ షిమాలీ నూరా, వ మిన్ బైన యదయ్య నూరా, వ మిన్ ఖల్ఫీ నూరా, వజ్-అల్ ఫీ నఫ్సీ నూరా, వ అ’జిమ్ లీ నూరా
ఓ అల్లాహ్! నా హృదయంలో వెలుగును (జ్యోతిని) ప్రసాదించు, నా నాలుకపై వెలుగును ప్రసాదించు, నా వినికిడిలో వెలుగును ప్రసాదించు, నా చూపులో వెలుగును ప్రసాదించు, నా పైన వెలుగును ప్రసాదించు, నా కింద వెలుగును ప్రసాదించు, నా కుడి వైపున వెలుగును ప్రసాదించు, నా ఎడమ వైపున వెలుగును ప్రసాదించు, నా ముందు భాగంలో వెలుగును ప్రసాదించు, నా వెనుక భాగంలో వెలుగును ప్రసాదించు, నా ఆత్మలో వెలుగును ప్రసాదించు, మరియు నా కోసం ఈ వెలుగును అపారం చేయి (గొప్పగా పెంచు).
సహీహ్ బుఖారీ (6316) మరియు సహీహ్ ముస్లిం (1797). హదీసు ఉల్లేఖకులు: ఇబ్న్ అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా).
< 20 >
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنَ الْخَيْرِ كُلِّهِ عَاجِلِهِ وَآجِلِهِ مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَم،ْ وَأَعُوذُ بِكَ مِنَ الشَّرِّ كُلِّهِ عَاجِلِهِ وَآجِلِهِ مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ عَبْدُكَ وَنَبِيُّكَ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عَاذَ بِهِ عَبْدُكَ وَنَبِيُّكَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْجَنَّةَ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ وَأَسْأَلُكَ أَنْ تَجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِي خَيْرًا
అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక మినల్ ఖైరి కుల్లిహీ ఆజిలిహీ వ ఆజిలిహీ మా అలిమ్ తు మిన్హు వ మాలమ్ అఅ్ లమ్, వ అఊజుబిక మినష్షర్రి కుల్లిహీ ఆజిలిహీ వ ఆజిలిహీ మా అలిమ్ తు మిన్హు వ మాలమ్ అఅ్ లమ్. అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక, వ అఊజుబిక మిన్ షర్రి మా ఆజ బిహీ అబ్దుక వ నబియ్యుక, అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ జన్నత వమా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔ అమలి, వ అఊజుబిక మినన్నారి వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔ అమలి, వ అస్ అలుక అన్త జ్ అల కుల్ల ఖదా ఇన్ ఖదైతహూ లీ ఖైరా
“ఓ అల్లాహ్! నేను త్వరగా చేకూరే లేదా ఆలస్యంగా చేకూరే, నాకు తెలిసిన లేదా నాకు తెలియని అన్ని రకాల మంచిని నీ నుంచి కోరుతున్నాను. అలాగే నేను త్వరగా జరిగే లేదా ఆలస్యంగా జరిగే, నాకు తెలిసిన లేదా నాకు తెలియని అన్ని రకాల చెడుగుల నుంచి నీ రక్షణ కోరుతున్నాను. ఓ అల్లాహ్! నీ నుంచి నీ దాసుడు మరియు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోరిన ప్రతి మంచినీ కోరుతున్నాను. అలాగే నీ దాసుడు మరియు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోరినట్లుగానే ప్రతి చెడుగు నుంచి రక్షణ కోరుతున్నాను. ఓ అల్లాహ్! నేను నీ నుంచి స్వర్గాన్ని కోరుతున్నాను. అలాగే స్వర్గానికి చేరువ చేసే వాక్కును, ఆచరణను కోరుతున్నాను. ఓ అల్లాహ్! నరకాగ్ని నుంచి నేను నీ రక్షణ కోరుతున్నాను. అలాగే నరకాగ్నికి చేరువ చేసే వాక్కు నుంచి మరియు ఆచరణ నుంచి నీ రక్షణ కోరుతున్నాను.ఓ అల్లాహ్! నీవు నా కొరకు నిర్ణయించిన విధిని నా కొరకు ఉత్తమమైనదిగా మలచవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను”
సునన్ ఇబ్న్ మాజా (3846) సహీహ్ ఇస్నాద్ (ప్రామాణిక చైన్) తో. ఉల్లేఖకులు: ఆయిషా (రజియల్లాహు అన్హా). (ఇది షేఖ్ అల్-అల్బానీ గారి ‘సిల్సిలా అస్-సహీహా’ 1542 లో కూడా ధృవీకరించబడింది).
< 21 >
اللَّهُمَّ بِعِلْمِكَ الْغَيْبَ وَقُدْرَتِكَ عَلَى الْخَلْقِ أَحْيِنِي مَا عَلِمْتَ الْحَيَاةَ خَيْرًا لِي، وَتَوَفَّنِي إِذَا عَلِمْتَ الْوَفَاةَ خَيْرًا لِي، اللَّهُمَّ وَأَسْأَلُكَ خَشْيَتَكَ فِي الْغَيْبِ وَالشَّهَادَةِ، وَأَسْأَلُكَ كَلِمَةَ الْحَقِّ فِي الرِّضَا وَالْغَضَبِ، وَأَسْأَلُكَ الْقَصْدَ فِي الْفَقْرِ وَالْغِنَى، وَأَسْأَلُكَ نَعِيمًا لَا يَنْفَدُ، وَأَسْأَلُكَ قُرَّةَ عَيْنٍ لَا تَنْقَطِعُ، وَأَسْأَلُكَ الرِّضَاءَ بَعْدَ الْقَضَاءِ، وَأَسْأَلُكَ بَرْدَ الْعَيْشِ بَعْدَ الْمَوْتِ، وَأَسْأَلُكَ لَذَّةَ النَّظَرِ إِلَى وَجْهِكَ وَالشَّوْقَ إِلَى لِقَائِكَ فِي غَيْرِ ضَرَّاءَ مُضِرَّةٍ وَلَا فِتْنَةٍ مُضِلَّةٍ، اللَّهُمَّ زَيِّنَّا بِزِينَةِ الْإِيمَانِ، وَاجْعَلْنَا هُدَاةً مُهْتَدِينَ
అల్లాహుమ్మ బి-ఇల్మికల్-గైబ, వ ఖుద్రతిక అలల్-ఖల్ఖి, అహ్యినీ మా అలిమ్తల్-హయాత ఖైరల్-లీ, వ తవఫ్ఫనీ ఇజా అలిమ్తల్-వఫాత ఖైరల్-లీ. అల్లాహుమ్మ వ అస్’అలుక ఖష్యతక ఫిల్-గైబి వష్-షహాదతి, వ అస్’అలుక కలిమతల్-హఖ్ఖి ఫిర్-రిదా వల్-గదబి, వ అస్’అలుకల్-ఖస్ద ఫిల్-ఫఖ్రి వల్-గినా, వ అస్’అలుక నఈమన్ లా యన్ఫదు, వ అస్’అలుక ఖుర్రత ఐనిన్ లా తన్ఖతిఉ, వ అస్’అలుకర్-రిదాఅ బ’దల్-ఖదాఇ, వ అస్’అలుక బర్దల్-ఐషి బ’దల్-మౌతి, వ అస్’అలుక లజ్జతన్-నజరి ఇలా వజ్హిక, వష్-షౌఖ ఇలా లిఖాఇక, ఫీ గైరి దర్రాఅ ముదిర్రతిన్ వ లా ఫిత్నతిన్ ముదిల్లతిన్. అల్లాహుమ్మ జయ్యిన్నా బి-జీనతిల్-ఈమాని, వజ్-అల్నా హుదాతన్ ముహ్తదీన్.
ఓ అల్లాహ్! అగోచరమైన (కనిపించని) విషయాలపై నీకున్న జ్ఞానం ద్వారా, మరియు సృష్టిపై నీకున్న ఆధిపత్యం (శక్తి) ద్వారా నేను వేడుకుంటున్నాను: జీవించడం నాకెంత కాలం శ్రేయస్కరమో అంతకాలం నన్ను సజీవంగా ఉంచు, మరియు మరణించడం నాకు మేలని నీవు భావించినప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! ఏకాంతంలోనూ మరియు అందరి ముందు (బహిరంగంగానూ) నీ పట్ల భయభక్తులు కలిగి ఉండేలా చేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. సంతోషంలో ఉన్నప్పుడు మరియు కోపంలో ఉన్నప్పుడు సత్యవాక్కును మాత్రమే పలికేలా చేయమని నిన్ను అడుగుతున్నాను. పేదరికంలోనూ మరియు సిరిసంపదలలోనూ మితంగా (సమతుల్యంగా) ఉండే గుణాన్ని ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. ఎన్నటికీ తరిగిపోని అనుగ్రహాలను మరియు ఎన్నటికీ ముగియని కనుల చలువను (అనంతమైన ఆనందాన్ని) అడుగుతున్నాను. నీ విధి నిర్ణయం పట్ల సంతృప్తి చెందే మనస్సును, మరణానంతరం ప్రశాంతమైన జీవితాన్ని అడుగుతున్నాను. ఎలాంటి హానికరమైన ఆపదలు లేకుండా మరియు దారితప్పించే ఫిత్రాలు (పరీక్షలు) లేకుండా నీ దర్శన భాగ్యం యొక్క మాధుర్యాన్ని మరియు నిన్ను కలుసుకోవాలనే తీవ్రమైన కోరికను అడుగుతున్నాను. ఓ అల్లాహ్! మమ్మల్ని ఈమాన్ (విశ్వాసం) అనే ఆభరణంతో అలంకరించు, మరియు మమ్మల్ని సన్మార్గం పొందినవారిగా, ఇతరులకు సన్మార్గం చూపే మార్గదర్శకులుగా చేయి.
సునన్ నసయీ (1305) హసన్ ఇస్నాద్ (మంచి చైన్) తో. హదీసు ఉల్లేఖకులు: అమ్మార్ బిన్ యాసిర్ (రజియల్లాహు అన్హు)
< 22 >
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ العَفْوَ وَالْعَافِيَةَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي دِينِي وَدُنْيَايَ وَأَهْلِي وَمَالِي، اللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِي وَآمِنْ رَوْعَاتِي، وَاحْفَظْنِي مِنْ بَيْنِ يَدَيَّ وَمِنْ خَلْفِي وَعَنْ يَمِينِي وَعَنْ شِمَالِي وَمِنْ فَوْقِي، وَأَعُوذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِي
అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుకల్-అఫ్వ వల్-ఆఫియత ఫిద్-దున్యా వల్-ఆఖిరతి. అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుకల్-అఫ్వ వల్-ఆఫియత ఫీ దీనీ, వ దున్-యాయ, వ అహ్లీ, వ మాలీ. అల్లాహుమ్మస్-తుర్ ఔరాతీ, వ ఆమిన్ రౌఆతీ. వహ్-ఫజ్-నీ మిన్ బైన యదయ్య, వ మిన్ ఖల్ఫీ, వ అన్ యమీనీ, వ అన్ షిమాలీ, వ మిన్ ఫౌఖీ. వ అఊదు బిఅజమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్-తీ.
ఓ అల్లాహ్! నేను ఇహలోకంలో మరియు పరలోకంలో నీ క్షమాపణను మరియు ఆఫియత్ ను (క్షేమాన్ని / భద్రతను / ఆరోగ్యాన్ని) కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా ధర్మం (దీన్), నా ఇహలోకం (దునియా), నా కుటుంబం మరియు నా సంపద విషయాలలో నీ క్షమాపణను మరియు ఆఫియత్ ను కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా లోపాలను (తప్పులను / రహస్యాలను) కప్పి ఉంచు మరియు నా భయాలను పోగొట్టి నాకు భద్రత (శాంతి) ప్రసాదించు. నన్ను నా ముందు వైపు నుండి, నా వెనుక వైపు నుండి, నా కుడి వైపు నుండి, నా ఎడమ వైపు నుండి, మరియు నా పై వైపు నుండి రక్షించు. మరియు నా కింద వైపు నుండి నేను అకస్మాత్తుగా నాశనం చేయబడకుండా (భూమిలోనికి కుంగిపోకుండా) నీ ఔన్నత్యం (గొప్పతనం) ద్వారా నేను నీ శరణు కోరుతున్నాను.
సునన్ అబూ దావూద్ (5074) మరియు ఇతరులు, సహీహ్ ఇస్నాద్ తో. హదీసు ఉల్లేఖకులు: ఇబ్న్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా).
< 23 >
اللَّهُمَّ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ، فَاطِرَ السَّمَوَاتِ وَالْأَرْضِ، رَبَّ كُلِّ شَيْءٍ وَمَلِيكَهُ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ
అల్లాహుమ్మ ఆలిమల్-గైబి వష్-షహాదతి, ఫాతిరస్-సమావాతి వల్-అర్ది, రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు, అష్-హదు అన్ లా ఇలాహ ఇల్లా అన్త, అఊదు బిక మిన్ షర్రి నఫ్సీ, వ షర్రిష్-షైతాని వ షిర్కిహి.
ఓ అల్లాహ్! అగోచర (కనిపించని/దాగి ఉన్న) మరియు గోచర (కనిపించే/బహిర్గతమైన) విషయాలను ఎరిగినవాడా! ఆకాశాలను మరియు భూమిని సృష్టించినవాడా! ప్రతిదానికీ ప్రభువా మరియు యజమానీ! నీవు తప్ప ఆరాధనకు అర్హుడైన నిజమైన దేవుడు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. నా స్వంత ఆత్మ (నఫ్స్) కీడు (చెడు కోరికల) నుండి నేను నీ శరణు కోరుతున్నాను. మరియు షైతాన్ కీడు నుండి, మరియు వాడు (నీకు భాగస్వాములను కల్పించమని చేసే) షిర్క్ (బహుదైవారాధన) ఉదంతాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను.
జామి అత్-తిర్మిజీ (3392) మరియు ఇతరులు, సహీహ్ ఇస్నాద్ తో. హదీసు ఉల్లేఖకులు: అబూ హురైరా (రజియల్లాహు అన్హు).
< 24 >
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الثَّبَاتَ فِي الأَمْرِ، وَالْعَزِيمَةَ عَلَى الرُّشْدِ، وَأَسْأَلُكَ مُوجِبَاتِ رَحْمَتِكَ، وَعَزَائِمَ مَغْفِرَتِكَ، وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ، وَحُسْنَ عِبَادَتِكَ، وَأَسْأَلُكَ قَلْبًا سَلِيمًا، وَلِسَانًا صَادِقًا، وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ لِمَا تَعْلَمُ، إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుకస్-సబాత ఫిల్-అమ్రి,
వల్-అజీమత అలర్-రుష్ది,
వ అస్-అలుక మూజిబాతి రహ్మతిక, వ అజాయిమ మగ్ఫిరతిక,
వ అస్-అలుక షుక్ర నిఅమతిక, వ హుస్న ఇబాదతిక,
వ అస్-అలుక ఖల్బన్ సలీమన్, వ లిసానన్ సాదిఖన్,
వ అస్-అలుక మిన్ ఖైరి మా తఅలము,
వ అఊదు బిక మిన్ షర్రి మా తఅలము,
వ అస్తగ్ఫిరుక లిమా తఅలము,
ఇన్నక అన్త అల్లాముల్-గుయూబ్.
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకస్సబాత ఫిల్ అమ్ర్ – ఓ అల్లాహ్! నాకు ధర్మంపై నిలకడ
వల్ అజీమత అలర్రుష్ద్ – మరియు విధేయేతలో దృఢత్వం ప్రసాదించమని కోరుతున్నాను
వఅస్అలుక మూజిబాతి రహ్మతిక్ – నీ కారుణ్యం తప్పనిసరిగా ప్రాప్తించే సత్కార్యాలు
వఅజాఇమ మగ్ ఫిరతిక్ – నీ క్షమాభిక్ష కూడా తప్పనిసరిగా ప్రాప్తించాలని వేడుకుంటున్నాను
వఅస్అలుక షుక్ర నిఅ మతిక్ – నేను అర్థిస్తున్నాను నీ అనుగ్రహాల కృతజ్ఞత భాగ్యం మరియు
వహుస్న ఇబాదతిక్ – నీ ఆరాధన ఉత్తమ రీతిలో చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించమని
వఅస్అలుక ఖల్బన్ సలీమా – నిష్కల్మషమైన మనస్సు ప్రసాదించమని
వలిసానన్ సాదిఖా – సత్యం పలికే నాలుక ప్రసాదించమని వేడుకుంటున్నాను
వఅస్అలుక మిన్ ఖైరి మా తఅ లమ్ – నీకు తెలిసి ఉన్న ప్రతి మేలు నీతో కోరుతున్నాను
వఅఊజు బిక మిన్ షర్రి మా తఅ లమ్ – నీకు తెలిసి ఉన్న ప్రతి కీడు నుండి శరణు ప్రసాదించు
వ అస్తగ్ ఫిరుక లిమా తఅ లమ్, – నీకు తెలిసి ఉన్న నా పాపాలన్నీ క్షమించుమని కోరుతున్నాను
ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్ – నిశ్చయంగా నీవు అగోచరాల పరిపూర్ణ జ్ఞానం గలవాడివి
తబరానీ ‘అల్-కబీర్’ (7135) లో, హసన్ ఇస్నాద్ తో. హదీసు ఉల్లేఖకులు: షద్దాద్ బిన్ ఔస్ (రజియల్లాహు అన్హు). (షేఖ్ అల్-అల్బానీ ‘సిల్సిలా అస్-సహీహా’ 3228).
< 25 >
اللَّهُمَّ اكْفِنِي بِحَلَالِكَ عَنْ حَرَامِكَ وَأَغْنِنِي بِفَضْلِكَ عَمَّنْ سِوَاكَ
అల్లాహుమ్మఅక్ఫీనీ బి హలాలిక అన్ హరామిక, వ అగ్ నినీ బి ఫద్ లిక అమ్మన్ సివాక
ఓ అల్లాహ్! నా ఆవసరాలకు చాలినంతగా నాకు ధర్మసమ్మతమైన జీవనోపాధినే ప్రసాదించు గానీ, అధర్మమైంది కాదు. ఇతరుల నుండి అడుక్కునే గత్యంతరం రానీయకుండా, నీ ఆనుగ్రహాల ద్వారా నన్ను సంతృప్తి పరుచు.
జామి అత్-తిర్మిజీ (3563) హసన్ ఇస్నాద్ తో. హదీసు ఉల్లేఖకులు: హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు). (షేఖ్ అల్-అల్బానీ ‘సిల్సిలా అస్-సహీహా’ 266).
< 26 >
اللَّهُمَّ عَافِنِي فِي بَدَنِي، اللَّهُمَّ عَافِنِي فِي سَمْعِي، اللَّهُمَّ عَافِنِي فِي بَصَرِي، لَا إِلَهَ إِلَّا أَنْتَ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْكُفْرِ وَالْفَقْرِ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، لَا إِلَهَ إِلَّا أَنْتَ
అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బదనీ అల్లాహుమ్మ ఆఫినీ ఫీ సమ్ఈ అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బసరీ లాఇలాహ ఇల్లా అంత, అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ కుఫ్రి వల్ ఫక్రి వ అఊజు బిక మిన్ అజాబిల్ కబ్రి లాఇలాహ ఇల్లా అంత.
ఓ అల్లాహ్! నా శరీరంలో స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా చెవిలో స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా దృష్టిలో స్వస్థత ప్రసాదించు, నీవు తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఓ అల్లాహ్! సత్యతిరస్కారం మరియు బీదరికం నుండి నీ శరణు వేడుకుంటున్నాను , ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాను. నీవు తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు.
సునన్ అబూ దావూద్ (5090) హసన్ ఇస్నాద్ తో. హదీసు ఉల్లేఖకులు: అబూ బక్రా (రజియల్లాహు అన్హు).
< 27 >
رَبِّ أَعِنِّي وَلَا تُعِنْ عَلَيَّ، وَانْصُرْنِي وَلَا تَنْصُرْ عَلَيَّ، وَامْكُرْ لِي وَلَا تَمْكُرْ عَلَيَّ، وَاهْدِنِي وَيَسِّرِ الْهُدَى لِي، وَانْصُرْنِي عَلَى مَنْ بَغَى عَلَيَّ، رَبِّ اجْعَلْنِي لَكَ شَكَّارًا، لَكَ ذَكَّارًا، لَكَ رَهَّابًا، لَكَ مِطْوَاعًا، لَكَ مُخْبِتًا إِلَيْكَ أَوَّاهًا مُنِيبًا، رَبِّ تَقَبَّلْ تَوْبَتِي وَاغْسِلْ حَوْبَتِي وَأَجِبْ دَعْوَتِي وَثَبِّتْ حُجَّتِي وَسَدِّدْ لِسَانِي وَاهْدِ قَلْبِي وَاسْلُلْ سَخِيمَةَ صَدْرِي
రబ్బి అఇన్నీ వలా తుఇన్ అలయ్య,
వన్-సుర్నీ వలా తన్-సుర్ అలయ్య,
వమ్-కుర్ లీ వలా తమ్-కుర్ అలయ్య,
వహ్-దినీ వ యస్సిరిల్-హుదా లీ,
వన్-సుర్నీ అలా మన్ బగా అలయ్య.
రబ్బిజ్-అల్నీ లక షక్కారన్, లక దక్కారన్, లక రహ్హాబన్,
లక మిత్వాఅన్, లక ముఖ్-బితన్, ఇలైక అవ్వాహన్ మునీబన్.
రబ్బి తఖబ్బల్ తౌబతీ, వగ్-సిల్ హౌబతీ,
వ అజిబ్ దఅవతీ, వ సబ్బిత్ హుజ్జతీ,
వ సద్దిద్ లిసానీ, వహ్-ది ఖల్బీ,
వస్-లుల్ సఖీమత సద్రీ.
ఓ నా ప్రభువా! నాకు సహాయం చేయి, నాకు వ్యతిరేకంగా (నా శత్రువులకు) సహాయం చేయకు.
నాకు విజయం ప్రసాదించు, నాకు వ్యతిరేకంగా (ఎవరికీ) విజయం ఇవ్వకు.
నాకు అనుకూలంగా ప్రణాళిక (ఉపాయం) వేయు, నాకు వ్యతిరేకంగా కాదు.
నాకు సన్మార్గం (రుజుమార్గం) చూపు, ఆ సన్మార్గాన్ని నాకు సులభతరం చేయి.
నాపై దౌర్జన్యం (అన్యాయం) చేసే వారిపై నాకు విజయం ప్రసాదించు.
ఓ నా ప్రభువా! నన్ను నీకు అత్యధికంగా కృతజ్ఞతలు తెలిపేవాడిగా,
నిన్ను అత్యధికంగా స్మరించేవాడిగా (జిక్ర్ చేసేవాడిగా),
నీ పట్ల తీవ్రమైన భయభక్తులు గలవాడిగా,
నీకు పూర్తిగా విధేయత చూపేవాడిగా,
నీ పట్ల అత్యంత వినయంగా ఉండేవాడిగా,
నీ వైపుకే (పశ్చాత్తాపంతో, కన్నీటితో) మరలేవాడిగా, వేడుకునేవాడిగా నన్ను మార్చు.
ఓ నా ప్రభువా! నా పశ్చాత్తాపాన్ని (తౌబాను) స్వీకరించు.
నా పాపాలను కడిగివేయు.
నా ప్రార్థనను (దుఆను) ఆమోదించు.
(సత్యం విషయంలో) నా వాదనను స్థిరపరచు (గట్టిగా నిలబెట్టు).
నా నాలుకను సరైన మరియు సత్యమైన మాటల మీద ఉంచు.
నా హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదించు.
మరియు నా గుండెలోని ద్వేషాన్ని, అసూయను, మాలిన్యాన్ని (చీకటిని) లాగివేయు (తొలగించు).
జామి అత్-తిర్మిజీ (3551) మరియు ఇతరులు, సహీహ్ ఇస్నాద్ తో. హదీసు ఉల్లేఖకులు: ఇబ్న్ అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా).
< 28 >
اللَّهُمَّ لَكَ الْحَمْدُ كُلُّهُ، اللَّهُمَّ لَا قَابِضَ لِمَا بَسَطْتَ، وَلَا بَاسِطَ لِمَا قَبَضْتَ، وَلَا هَادِيَ لِمَا أَضْلَلْت، وَلَا مُضِلَّ لِمَنْ هَدَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُقَرِّبَ لِمَا بَاعَدْتَ، وَلَا مُبَاعِدَ لِمَا قَرَّبْتَ، اللَّهُمَّ ابْسُطْ عَلَيْنَا مِنْ بَرَكَاتِكَ وَرَحْمَتِكَ وَفَضْلِكَ وَرِزْقِكَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لَا يَحُولُ وَلَا يَزُولُ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ النَّعِيمَ يَوْمَ الْعَيْلَةِ، وَالْأَمْنَ يَوْمَ الْخَوْفِ، اللَّهُمَّ إِنِّي عَائِذٌ بِكَ مِنْ شَرِّ مَا أَعْطَيْتَنَا وَشَرِّ مَا مَنَعْتَ، اللَّهُمَّ حَبِّبْ إِلَيْنَا الْإِيمَانَ وَزَيِّنْهُ فِي قُلُوبِنَا، وَكَرِّهْ إِلَيْنَا الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ، وَاجْعَلْنَا مِنَ الرَّاشِدِينَ، اللَّهُمَّ تَوَفَّنَا مُسْلِمِينَ، وَأَحْيِنَا مُسْلِمِينَ، وَأَلْحِقْنَا بِالصَّالِحِينَ غَيْرَ خَزَايَا وَلَا مَفْتُونِينَ، اللَّهُمَّ قَاتِلْ الْكَفَرَةَ الَّذِينَ يُكَذِّبُونَ رُسُلَكَ، وَيَصُدُّونَ عَنْ سَبِيلِكَ، وَاجْعَلْ عَلَيْهِمْ رِجْزَكَ وَعَذَابَكَ، اللَّهُمَّ قَاتِلْ الْكَفَرَةَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَهَ الْحَقِّ
అల్లాహుమ్మ లకల్-హమ్దు కుల్-లుహ్,
అల్లాహుమ్మ లా ఖాబిద లిమా బసత్-త, వలా బాసిత లిమా ఖబద్-త,
వలా హాదియ లిమా అద్-లల్-త, వలా ముదిల్ల లిమన్ హదైత,
వలా ముఅతియ లిమా మనాఅత, వలా మానిఅ లిమా అఅతైత,
వలా ముఖర్రిబ లిమా బాఅద్-త, వలా ముబాఇద లిమా ఖర్రబ్-త.
అల్లాహుమ్మబ్-సుత్ అలైయ్-నా మిన్ బరకాతిక వ రహ్మతిక వ ఫద్లిక వ రిజ్ఖిక.
అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుకన్ నయీమల్ ముఖీమల్-లజీ లా యహూలు వలా యజూలు.
అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుకన్ నయీమ యౌమల్ ఐలతి, వల్-అమ్న యౌమల్ ఖౌఫ్.
అల్లాహుమ్మ ఇన్నీ ఆయిజున్ బిక మిన్ షర్రి మా అఅతైతనా వ షర్రి మా మనాఅత.
అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ ఈమాన వ జైయ్-యిన్-హు ఫీ ఖులూబినా,
వ కర్రిహ్ ఇలైనల్ కుఫ్ర వల్ ఫుసూఖ వల్ ఇస్-యాన, వజ్-అల్-నా మినర్-రాషిదీన్.
అల్లాహుమ్మ తవఫ్ఫనా ముస్లిమీన, వ అహ్యినా ముస్లిమీన,
వ అల్హిక్-నా బిస్-సాలిహీన గైర ఖజాయా వలా మఫ్తూనీన్.
అల్లాహుమ్మ ఖాతిలిల్ కఫరతల్-లజీన యుకజ్జిబూన రుసులక, వ యసుద్దూన అన్ సబీలిక, వజ్-అల్ అలైహిమ్ రిజ్-జక వ అజాబక.
అల్లాహుమ్మ ఖాతిలిల్ కఫరతల్-లజీన ఊతుల్ కితాబ ఇలాహల్ హఖ్.
ఓ అల్లాహ్! సర్వ స్తోత్రాలు (పొగడ్తలు) నీకే చెందుతాయి. ఓ అల్లాహ్! నీవు విస్తరించిన (ప్రసాదించిన) దానిని నిరోధించేవాడు ఎవరూ లేరు, మరియు నీవు నిరోధించిన (ఆపివేసిన) దానిని విస్తరించేవాడు ఎవరూ లేరు. నీవు దారి తప్పించిన వాడికి సన్మార్గం చూపేవాడు ఎవరూ లేరు, నీవు సన్మార్గం చూపిన వాడిని దారి తప్పించేవాడు ఎవరూ లేరు. నీవు నిరాకరించిన (ఆపివేసిన) దానిని ఇచ్చేవాడు ఎవరూ లేరు, నీవు ప్రసాదించిన (ఇచ్చిన) దానిని ఆపేవాడు ఎవరూ లేరు.నీవు దూరం చేసిన దానిని దగ్గరకు తెచ్చేవాడు ఎవరూ లేరు, నీవు దగ్గరకు తెచ్చిన దానిని దూరం చేసేవాడు ఎవరూ లేరు.
ఓ అల్లాహ్! నీ శుభాలను, కారుణ్యాన్ని, అనుగ్రహాన్ని మరియు ఉపాధిని మాపై విస్తరింపజేయుము (సమృద్ధిగా ప్రసాదించుము). ఓ అల్లాహ్! ఎన్నటికీ మారని మరియు అంతరించిపోని శాశ్వతమైన ఆనందాన్ని (వరాలను) నేను నిన్ను వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! పేదరికపు రోజున (లేమిలో) నాకు వరాలు (సమృద్ధి) ప్రసాదించమని, మరియు భయానకమైన రోజున భద్రతను ఇవ్వమని నిన్ను అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నీవు మాకు ప్రసాదించిన వాటిలోని కీడు నుండి, మరియు నీవు ఇవ్వని (నిరోధించిన) వాటిలోని కీడు నుండి నేను నీ శరణు కోరుతున్నాను.
ఓ అల్లాహ్! విశ్వాసాన్ని (ఈమాన్ ను) మాకు ప్రియమైనదిగా చేయుము మరియు దానిని మా హృదయాలలో అందంగా అలంకరించుము.మరియు అవిశ్వాసం (కుఫ్ర), పాపకార్యాలు (ఫుసూఖ్) మరియు అవిధేయత (ఇస్యాన్) ల పట్ల మాకు ద్వేషం కలిగించు, మరియు మమ్మల్ని సన్మార్గం పొందిన వివేకవంతులలో చేర్చుము.
ఓ అల్లాహ్! మమ్మల్ని ముస్లింలుగా జీవింపజేయుము, మరియు మమ్మల్ని ముస్లింలుగానే మరణింపజేయుము. మరియు మమ్మల్ని ఎలాంటి అవమానాలకు గురికాకుండా, ఎలాంటి పరీక్షల (ఫిత్నా)లో పడకుండా పుణ్యాత్ములతో (సజ్జనులతో) కలుపుము.
ఓ అల్లాహ్! నీ ప్రవక్తలను తిరస్కరించి, (ప్రజలను) నీ మార్గం నుండి అడ్డుకునే అవిశ్వాసులను నాశనం చేయుము. వారిపై నీ శిక్షను మరియు తీవ్రమైన యాతనను విధించుము.ఓ సత్య దేవుడా (అల్లాహ్)! గ్రంథం ఇవ్వబడి కూడా దాన్ని తిరస్కరించిన (అవిశ్వాసులైన) వారిని శిక్షించుము.
ఇమామ్ అహ్మద్ (15492) సహీహ్ ఇస్నాద్ తో. హదీసు ఉల్లేఖకులు: రిఫాఅ అజ్-జురఖీ (రజియల్లాహు అన్హు).
< 29 >
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللّٰهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రా హీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మ్మజీద్.
ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి.
సహీహ్ బుఖారీ (3370) మరియు సహీహ్ ముస్లిం (908). హదీసు ఉల్లేఖకులు: కఅబ్ బిన్ ఉజ్రా (రజియల్లాహు అన్హు). (ఇది దురూద్-ఎ-ఇబ్రాహీమ్).
—
పైన పొందుపరిచిన దుఆలు క్రింది వెబ్సైటు నుండి తీసుకొన్నాము:
https://nuqayah.com/f/dua-abbad.html
ఈ దుఆల ఆడియో వినండి/డౌన్లొడ్ క్రింద: