అల్లాహ్ యొక్క గొప్ప పేరుతో దుఆ చేయడం

[మొదటి దుఆ]

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం, మేము ప్రవక్త ముహమ్మద్ ﷺ వారితో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చి నమాజు చేసి దువా చేశాడు. అది చూసి ప్రవక్త ముహమ్మద్ ﷺ వారు ఇలా అన్నారు:

” لَقَدْ دَعَا اللَّهَ بِاسْمِهِ الْعَظِيمِ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ، وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى”.

“లఖద్ దఆల్లాహ బిఇస్మిహిల్ అజీమిల్ లజీ ఇజా దుఇయా బిహి అజబ వ ఇజా సుఇల బిహి అతా”

ఇతను అల్లాహ్ యొక్క గొప్ప పేరుతో ప్రార్థించాడు, ఎవడైతే ఈ విధంగా అల్లాహ్ ను వేడుకుంటాడో అతని వేడుక తప్పక స్వీకరించబడుతుంది. అతను కొనుకున్నది ప్రతిదీ ప్రసాదించబడుతుంది.

ఆ దువా ఈ విధంగా ఉంది:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّ لَكَ الْحَمْدُ، لَا إِلَهَ إِلَّا أَنْتَ الْمَنَّانُ بَدِيعُ السَّمَوَاتِ وَالْأَرْضِ، يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ، يَا حَيُّ يَا قَيُّومُ

“అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బి అన్న లకల్ హమ్దు లా ఇలాహా ఇల్లా అంతల్ మన్నాను బదీ ఉస్సమావాతి వల్ అర్ది యా జల్ జలాలి వల్ ఇక్రామి యా హయ్యు యా ఖయ్యూమ్”

ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ నీకే వర్తిస్తాయి, నీ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు, నువ్వే ఉపకారం చేసేవాడివి, భూమ్యాకాశాలకు సృష్టికర్తవి, ఘనత గౌరవాలు కలిగిన వాడివి, సజీవుడువి, అన్నిటికీ మూలాధారం నువ్వే (ఇప్పుడు మీకు ఇష్టమైన దువా కోరుకోండి)

(సునన్ అబూ దావూద్ 1495, సునన్ ఇబ్ను మాజః 3858, సునన్ తిర్మిజి 3544, సునన్ నసాయి 1301) (అల్బానీ సహీ అన్నారు)

حَدَّثَنَا عَبْدُ الرَّحْمَنِ بْنُ عُبَيْدِ اللَّهِ الْحَلَبِيُّ، حَدَّثَنَا خَلَفُ بْنُ خَلِيفَةَ، عَنْ حَفْصٍ، – يَعْنِي ابْنَ أَخِي أَنَسٍ – عَنْ أَنَسٍ، أَنَّهُ كَانَ مَعَ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم جَالِسًا وَرَجُلٌ يُصَلِّي ثُمَّ دَعَا اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّ لَكَ الْحَمْدَ لاَ إِلَهَ إِلاَّ أَنْتَ الْمَنَّانُ بَدِيعُ السَّمَوَاتِ وَالأَرْضِ يَا ذَا الْجَلاَلِ وَالإِكْرَامِ يَا حَىُّ يَا قَيُّومُ ‏.‏ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لَقَدْ دَعَا اللَّهَ بِاسْمِهِ الْعَظِيمِ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى ‏”‏ ‏.‏

Narrated Anas ibn Malik:

I was sitting with the Messenger of Allah (ﷺ) and a man was offering prayer. He then made supplication: O Allah, I ask Thee by virtue of the fact that praise is due to Thee, there is no deity but Thou, Who showest favour and beneficence, the Originator of the Heavens and the earth, O Lord of Majesty and Splendour, O Living One, O Eternal One.

The Prophet (ﷺ) then said: He has supplicated Allah using His Greatest Name, when supplicated by this name, He answers, and when asked by this name He gives.

[రెండవ దుఆ]

అబ్దుల్లాహ్ అస్లమీ వారు తన తండ్రి మహానియ! బురైద అస్లమీ రదియల్లాహు తాలా ఆన్హు వారు అన్నారు అని ఉల్లేఖిస్తున్నారు.. :-

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి ని అల్లాహ్ తో ఈ పదాలతో వేడుకుంటుండగా విన్నారు:-

 “اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنِّي أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ، الأَحَدُ الصَّمَدُ، الَّذِي لَمْ يَلِدْ، وَلَمْ يُولَدْ، وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ”،

అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక్ .. బిఅన్నీ అష్ హదు అన్నక అన్తల్లాహ్.. లాఇలాహ ఇల్లా అన్త్. అల్ అహద్.. అస్ సమద్ ..అల్లజీ లమ్ యలిద్ వలమ్ యూలద్ ..వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.

అర్థం:- ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో వేడుకుంటున్నాను నేను సాక్ష్యం ఇస్తున్నాను నిశ్చయంగా నీవు మాత్రమే అల్లాహ్ నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు నీవు అద్వితీయుడవు నీవు నిరపేక్షపరుడివి నీవు ఎవరిని కనలేదు నిన్ను ఎవరు కనలేదు నీతో సరి సమానమైన వాడు ఎవ్వడూ లేడు.

అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు

: ” وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَقَدْ سَأَلَ اللَّهَ بِاسْمِهِ الْأَعْظَمِ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ، وَإِذَا سُئِلَ بِهِ أَعْطَىٰ “

ఎవరి చేతిలో నా ప్రాణం ఉన్నదో అతని సాక్షిగా చెబుతున్నాను ..వాస్తవంగా అతడు అల్లాహ్ యొక్క మహత్తుగల నామం ..(ఇస్మే అజం) ద్వారా వేడుకున్నాడు ఎవరైనా దాని ద్వారా ఏదైన దుఆ చేయబడితే అతను స్వీకరిస్తాడు.. మరియు ఎప్పుడైనా దాని ద్వారా ఏదైనా అడగబడితే అది అతనికి ప్రసాదిస్తాడు

[తిర్మీజీ 3475]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s