العاشر: عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : ”من قال-يعني إذا خرج من بيته-:
بسم الله توكلت على الله، ولا حول ولا قوة إلا بالله ، يقال له: هديت وكفيت ووقيت، وتنحى عنه الشيطان“.
رواه أبو داود والترمذي، والنسائي وغيرهم. وقال الترمذي: حديث حسن، زاد أبو داود:
”فيقول : -يعني الشيطان-لشيطان آخر: كيف لك برجل قد هدي وكفي ووقيّ ؟
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలియ జేశారు:
ఇంటినుండి బయలుదేరే వ్యక్తి “బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, వలా హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి” (అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. నేను ఆయన్నే నమ్ముకున్నాను. పాపాల నుండి మరలి పోవాలన్నా, మంచి పనులు చేయాలన్నా ఆయన శక్తివల్లనే సాధ్యమవుతుంది) అని పఠించి బయలు దేరినప్పుడు ఆ వ్యక్తితో “నీవు సన్మార్గం పొందావు, నీకు సహాయం కల్పించబడింది, నీవు రక్షించబడ్డావు“ అని అదృశ్యవాణి ఎవరికీ వినపడని విధంగా పలుకుతుంది. అంతేకాదు షైతాన్ కూడా అలాంటి వ్యక్తినుండి దూరంగా పారిపోతాడు.
అబూదావూద్, తిర్మిజీ, నసాయి తదితరులు దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా పేర్కొన్నారు.
అబూదావూద్ లో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి : అప్పుడు ఒక షైతాన్ తోటి షైతాన్ తో “ఈ వ్యక్తికి సన్మార్గం లభించింది, సహాయం అందింది, రక్షణ కల్పించబడింది. ఇక నువ్వు అతనిపై పట్టు ఎలా సాధిస్తావు?” అని అంటాడు
(సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలోనూ, సుననె అబూదావూద్ లోని సంస్కార ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)
ముఖ్యాంశాలు:
పైన పేర్కొనబడిన ప్రార్థనలు మనిషికి అల్లాహ్ పై ఉండవలసిన నమ్మకం, విశ్వాసాలను విశదపరచాయి. ఇంకా ఈ వేడుకోలు వచనాలలో షైతాన్ యొక్క కుయుక్తులు, కుశంకల నుండి కూడా శరణు కోరుకోబడింది. కనుక విశ్వాసులు ఈ వేడుకోలు వచనాలను పఠించటం అలవాటు చేసుకోవాలి
[రిఫరెన్స్: రియాదుస్సాలిహీన్ – హదీసు: 82]
దుఆ విని నేర్చుకోండి:
بسم الله توكلت على الله، ولا حول ولا قوة إلا بالله
బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, వలా హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి
అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. నేను ఆయన్నే నమ్ముకున్నాను. పాపాల నుండి మరలి పోవాలన్నా, మంచి పనులు చేయాలన్నా ఆయన శక్తివల్లనే సాధ్యమవుతుంది
షైతాన్ నుండి రక్షణకై మిగతా దుఆలు క్రింది లింక్ నొక్కి నేర్చుకోండి: