ఎవరైతే ఫజ్ర్ నమాజ్ మరియు అస్ర్ లేదా మగ్రిబ్ తర్వాత ఈ జిక్ర్ 10 సార్లు చదువుతారో

ఎవరైతే ఫజ్ర్ నమాజ్ మరియు అస్ర్ లేదా మగ్రిబ్ తర్వాత ఈ జిక్ర్ 10 సార్లు చదువుతారో వారికి 9 రకాల లాభాలున్నాయి.
{ లా ఇలాహ ఇల్లాల్లహు వహదహ్ లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యూ వ యుమీతు వహువా అలా కుల్లి షైఇన్ ఖదీర్ } 
  
1.  పది విశ్వాస బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది,
2. అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో చేర్పించే 10 పుణ్యాలను రాస్తాడు,
3. అల్లాహ్, నరకంలో చేర్పించే అతని 10 పాపాలను మన్నిస్తాడు,
4. అల్లాహ్ అతని 10 స్థానాలను పెంచుతాడు,
5. ఉదయం చదివితే సాయంత్రం వరకు, సాయంత్రం చదివితే ఉదయం వరకు షైతాను నుండి రక్షించబడతారు,
6. అసహ్యకరమైన, అవాంఛనీయమైన వాటి నుండి కాపాడబడతాడు,
7. ఆ రోజు షిర్క్ తప్ప అతని ఏ పాపం అతనికి నష్టం చేకూర్చదు (పాపం చేయవచ్చని భావం ఎంత మాత్రం కాదు సుమా),
8. సాయంత్రం చదివితే ఉదయం వరకు ఆయుధం ధరించి ఉన్న దైవదూతలను అల్లాహ్ అతని రక్షణ కొరకు పంపిస్తాడు,
9. ఆ రోజు అతని ఆచరణ కంటే ఉత్తమమైన ఆచరణ మరెవరిదీ ఉండదు, అతని మాదిరిగా చదివిన వ్యక్తి లేదా అతని కంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప.

(షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారి సహీ తర్గీబ్ లోని #472 నుండి #477 వరకు హదీసుల సారాంశం).
ఎవరైతే ఫజ్ర్ నమాజ్ మరియు అస్ర్ లేదా మగ్రిబ్ తర్వాత ఈ జిక్ర్ 10 సార్లు చదువుతారో..
https://youtu.be/AKogpe8cQN8 [4 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

Leave a comment