షహాదత్ & మదీనాలో మరణం కోరుతూ దుఆ

మీరు కూడా ఈ మంచి దుఆ నేర్చుకోండి :

హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా దుఆ చేసేవారు,

اَللّٰهُمَّ ارْزُقْنِيْ شَهَادَةً فِيْ سَبِيْلِكَ، وَاجْعَلْ مَوْتِيْ فِيْ بَلَدِ رَسُوْلِكَ
(అల్లాహుమ్మర్ జుఖ్నీ షహాదతన్ ఫీ సబీలిక్, వజ్’అల్ మౌతీ ఫీ బలది రసూలిక్)

“ఓ అల్లాహ్! నీ మార్గంలో నాకు షహాదత్ (అమరవీరత్వం) ప్రసాదించు మరియు నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నగరంలో నాకు మరణం ప్రసాదించు.” (సహీ బుఖారీ: 1890).


హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర – షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ [ఆడియో & టెక్స్ట్]
https://teluguislam.net/2025/11/09/brief-history-of-hazrat-umar/

ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి? [ఆడియో, టెక్స్ట్]

ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి
https://youtu.be/dy6dlz_jG4g ⏰ 03:20 నిమిషాలు
🎤 నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రతి ముస్లిం రోజూ సూరా అల్-ఇఖ్లాస్, సూరా అల్-ఫలఖ్, మరియు సూరా అన్-నాస్‌లను ఎప్పుడు, ఎన్నిసార్లు పఠించాలో వివరించబడింది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒకసారి, ఉదయం (అద్కార్ అస్-సబాహ్) మరియు సాయంత్రం (అద్కార్ అల్-మసా) దుఆలలో మూడుసార్లు, మరియు నిద్రపోయే ముందు మూడుసార్లు అరచేతులలోకి ఊది శరీరంపై తుడుచుకుంటూ పఠించాలని చెప్పబడింది. ఈ విధంగా ప్రతి సూరాను రోజుకు 14 సార్లు పఠిస్తారని లెక్కించారు. ఒకవేళ ఉదయం మరియు సాయంత్రం అద్కార్లను ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్‌ల తర్వాత చేస్తే, ఆ మూడుసార్లు చేసే పఠనంలోనే నమాజ్ తర్వాత చేసే ఒకసారి పఠనం కూడా కలిసిపోతుందని, అప్పుడు మొత్తం సంఖ్య 12 అవుతుందని స్పష్టం చేశారు. ఈ సూరాల ఘనతను తెలుసుకొని, ఇతర సందర్భాలలో కూడా వాటిని పఠించాలని ప్రోత్సహించారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ప్రతి ముస్లిం, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)

సూరాలు చదవాలి. ఇవి ఐదుసార్లు అవుతాయి. మరియు ఉదయం అద్కార్, అద్కారుస్ సబాహ్ అని ఏవైతే అంటామో, morning supplications, వాటిలో కూడా ఈ మూడు సూరాలూ, సూరాలు మూడేసి సార్లు చదవాలి.

అలాగే అద్కారుల్ మసా, సాయంకాలం చదివే అద్కార్లలో కూడా ఈ మూడు సూరాలు, ఇఖ్లాస్, ఫలఖ్, నాస్ మూడేసి సార్లు చదవాలి. ఎన్ని అయినాయి? ఉదయం మూడు, సాయంకాలం మూడు, ఆరు. మరియు ప్రతీ ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి. ఐదు. పదకొండు అయినాయి.

మళ్లీ రాత్రి పడుకునే ముందు రెండు అరచేతులను కలిపి, అందులో ఊది, ఒక్కొక్కసారి ఈ సూరాలు చదివి, తలపై, ముఖముపై, శరీరం ముందు భాగం, మిగతా శరీర భాగములతో తుడుచుకోవాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఈ విధంగా మొత్తం 14 సార్లు అవుతుంది.

పఠనాల సంఖ్య మరియు ఒక ప్రత్యేక మినహాయింపు

అద్కారుస్ సబాహ్‌లో మూడు సార్లు, మూడు మూడు సార్లు, అద్కారుల్ మసాలో మూడు మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు, మూడు మూడు సార్లు, తొమ్మిది మరియు ఐదు పూటల ఫర్జ్ నమాజ్‌ల తర్వాత ఒక్కొక్కసారి, పద్నాలుగు.

కానీ శ్రద్ధ వహించండి ఇక్కడ. ఎవరైనా అద్కారుస్ సబాహ్ ఫజ్ర్ నమాజ్ తర్వాత చదువుతున్నారు మరియు అద్కారుల్ మసా మగ్రిబ్ నమాజ్ తర్వాత చదువుతున్నారు, అలాంటప్పుడు వారు

మూడుసార్లు

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్, ఏకైకుడు.” (112:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను వేకువ ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (113:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను మానవుల ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (114:1)

చదువుకున్నారంటే, ఫజ్ర్ తర్వాత ఒక్కొక్కసారి, మగ్రిబ్ తర్వాత ఒక్కొక్కసారి చదివేది ఏదైతే ఉందో అది ఇందులోనే, అంటే మూడుసార్లు చదివితే, ఇంక్లూడ్ (include) అయిపోతుంది. ఎందుకంటే ఫజ్ర్ తర్వాత అద్కారుస్ సబాహ్ ఉద్దేశంతో, మగ్రిబ్ తర్వాత అద్కారుల్ మసా ఉద్దేశంతో చదువుతున్నారు గనుక అని కొందరు ధర్మవేత్తలు చెబుతారు. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే, టోటల్ 12 సార్లు అవుతాయి.

ఇవే కాకుండా ఒక ముస్లిం ఈ సూరాల ఘనతను, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్, సూరతున్నాస్ ఘనతలను హదీథుల ఆధారంగా తెలుసుకోవాలి మరియు వేరు వేరు సందర్భాలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ సందర్భాల్లో చదవాలి. ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకోవడానికి మా క్లాసులో హాజరవుతూ ఉండండి.


లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ (لَا حَوٍلَ وَلَا قُوَّةَ إِلَّا باللهِ) – స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధి

బలం, శక్తి లేక సామర్ధ్యం – ఇవన్నీ కేవలం అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తాయి. మనిషి ఎంత పెద్ద శక్తిమంతుడైనా, ఎంతటి బలం బలగం, అందలం అధికారం కలవాడైనా అల్లాహ్ ముందు అతను ఒక బలహీనమైన ప్రాణి మాత్రమే. చిటికేసి యావత్ ప్రపంచ యంత్రాంగాన్ని నడిపించగల తోపు అయినా సరే అల్లాహ్ సహాయం, అల్లాహ్ సంకల్పం లేకుండా ఏమీ చేయలేడు. ఆఖరికి మనిషి మంచి పనులు చేయాలన్నా, చెడు పనుల నుంచి ఆగిపోవాలన్నా అల్లాహ్ బలమే కావాలి. అల్లాహ్ ప్రసాదించే శక్తిసామర్ధ్యాలే అతనిలో ఉండాలి.

జీవితంలో అడుగడుగునా మనకు అల్లాహ్ సహాయం కావాలి. అలాంటప్పుడు మనల్ని సృష్టించిన ఆ ఏకైక సృష్టికర్త అల్లాహ్ యొక్క సహాయం అడుక్కోవటానికి నామోషీ ఎందుకు?

అసలు ఆలోచిస్తే మనం అల్లాహ్ ను అంతకంటే ఎక్కువగా ప్రార్థించాలి. మన కష్టాల్ని ఆయనకు విన్నవించుకోవాలి. బాధలను తొలగించమని వేడుకోవాలి. కోరికలు తీర్చమని పదే పదే ప్రాధేయపడాలి. అది డబ్బు సమస్య అయినా, కుటుంబ సమస్యలు అయినా, మరేదైనా సరే. ఆ గడ్డు పరిస్థితిని దాటటానికి దివ్యమైన శక్తి కావాలి. అటు వంటి దివ్యమైన శక్తి లభించే ఏకైక ఆధారం అల్లాహ్!

జీవితంలో తట్టుకోలేని పెను ప్రమాదాలు ఎదురైనప్పుడు మనిషి నోటి నుండి వెలువడే – “అల్లాహ్ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము” – వంటి మాటలు అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవి. అటువంటి వారికి అల్లాహ్ సహాయం తప్పకుండా లభిస్తుంది.

అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో, “స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధిని గురించి నేను మీకు తెలుపనా?” అని అడిగారు. “తెలుపండి దైవప్రవక్తా!” అన్నాను నేను. దానికి ఆయన ఇలా పలకమని చెప్పారు:

لَا حَوٍلَ وَلَا قُوَّةَ إِلَّا باللهِ
“లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”
ఏ శక్తి అయినా, ఏ సామర్థ్యం అయినా అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుంది.
(బుఖారీ, మస్లిం గ్రంథాలు)

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
మహిమ గల 12 దుఆలు – శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ [PDF] [పాకెట్ సైజు ]
పై లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

స్వర్గపు నిధులలో ఒక గొప్ప నిధి – లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
https://youtu.be/h-81z8V7ecU [68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ౙబహ్ చేసే ముందు చదివే దుఆ – ఖుర్బానీ దుఆలు

ౙబహ్ చేసే ముందు చదివే దుఆ
ఖుర్బానీ దుఆ

జబహ్ చేసే ముందు చదివే దుఆ
సంకలనం & అనువాదం: ముహమ్మద్ అబ్దుల్ బాఖీ ఫారూఖీ

[డౌన్లోడ్ ఖుర్బానీ దుఆ]
[1.4 MB] [PDF] [4 పేజీలు]

بسم الله الرحمن الرحيم
ౙబహ్ చేసే ముందు చదివే దుఆ

بِسْمِ اللهِ وَ اللهُ أَكْبَرُ

“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు”.
(సహీహ్ ముస్లిం 1966)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)

(లేదా)

“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ హాజా అన్నీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్ప వాడు, ఇది (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి (స్వీకరించు)”.
(అబూదావూద్ 2810; హసన్)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ వ మిన్ ఆలి బైతీ”

”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)

(లేదా)

“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, హాజా అన్నీ వ అన్ అహ్లి బైతీ”

”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు.ఇది (ఈ ఖుర్బానీ ను) నా తరపు నుండి నా ఇంటి వారి తరపు నుండి (స్వీకరించు)”. (అబూదావూద్ 2810)

(లేదా)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ వ అహ్లి”

“అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్ ! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)

(లేదా)

బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమ్మ హాజా మిన్క వ లక అల్లాహుమ్మ హా‘జిహి అన్నీ వ అన్ అహ్లి బైతీ”

“అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు. ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్బానీ జంతువు) నీవు ప్రసాదించినదే మరియు నీ ప్రసన్నత కోసమే (ౙబహ్ చేస్తున్నాను). ఓ అల్లాహ్! దీనిని (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి (స్వీకరించు)”.

(మజ్మూ అల్ ఫతావా ఇబ్నె ఉసైమీన్ రహిమహుల్లాహ్ భాగం 25, పేజి 55)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్……వ మిన్ ఆలి బైతిహి’

“అల్లాహ్ పేరుతో (జబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్ ! (ఈ ఖుర్బానీ ను)……తరపు నుండి మరియు అతని ఇంటి వారి తరపు నుండి(స్వీకరించు)”. (సహీహ్ ముస్లిం 1967)

నోట్: గీత …. ఉన్న భాగంలో ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారి పేరు చదవవలెను.

షిర్క్ నుండి రక్షణ కోసం దుఆ

సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఘనతలు – తప్పక వినండి

సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఘనతలు – తప్పక వినండి , కేవలం 5 నిముషాలు
https://youtu.be/CvXZ0XJRynE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్హందులిల్లాహ్. ప్రియులారా! సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ యొక్క ఘనతలో ఈ కొన్ని హదీసులను శ్రద్ధగా వినండి. మరియు అధికంగా ఈ యొక్క జిక్ర్ చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి. అల్లాహ్ నాకు మీకు మనందరికీ ఈ యొక్క జిక్ర్ అధికంగా చేసేటటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

మొదటి హదీస్ షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహలో ప్రస్తావించారు.నూహ్ అలైహిస్సలాం మరణం సమీపించినప్పుడు తన కొడుకును దగ్గరకు పిలుచుకొని, నాన్నా నా కుమారుడా! నేను నీకు రెండు విషయాల గురించి వాంగ్మూలం (వసియత్) చేస్తున్నాను. నేను రెండు విషయాల గురించి ఆదేశిస్తున్నాను, శ్రద్ధగా వాటిని నీవు పాటించు. ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనిపై చాలా స్థిరంగా ఉండు. ఎందుకంటే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత ఎంత గొప్పదంటే మొత్తం భూమ్యాకాశాలు ఈ విశ్వమంతా కూడా ఒక రింగు మాదిరిగా చేసేస్తే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆ రింగును విరగ్గొట్టే అంతటి శక్తి గలది. మరియు అధికంగా సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలుకుతూ ఉండు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి యొక్క ఆరాధన అదే. దాని ద్వారానే వాటికి ఉపాధి లభిస్తుంది.

రెండవ హదీస్ సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లో వచ్చినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అని ఎవరైతే ఒక రోజులో 100 సార్లు పలుకుతారో వారి పాపాలు మన్నించబడతాయి. వారి పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. ఒకవేళ అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే.

మూడవ హదీస్ షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహ్ అత్ తర్గీబ్ లో ప్రస్తావించారు. ఎవరైతే సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఒక్కసారి పలుకుతారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది.

నాలుగవ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లోనిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. నిశ్చయంగా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన పలుకుల్లో ఒకటి సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ.

ఐదవ హదీస్ షేక్ అల్బాని రహమహుల్లాహ్ సహీహ్ అత్ తర్గీబ్ లో ప్రస్తావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రాత్రి మేల్కొని నిలబడి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం, నమాజ్ లో తిలావత్ (ఖురాన్ పారాయణం చేయడం) చాలా కష్టతరంగా అవుతుందో, చేయలేకపోతున్నారో, అలాగే ఎవరి వద్దనైతే డబ్బు ధనము ఉండి ఖర్చు చేయలేకపోతున్నారో, పిసినారితనం వహిస్తున్నారో, లేదా శత్రువు ముందుకు వచ్చినా అతనితో పోరాడే అటువంటి శక్తి లేక పిరికితనం వహిస్తున్నాడో, ప్రత్యేకంగా ఇలాంటి వారు అధికంగా సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అని పలుకుతూ ఉండాలి, ఎందుకంటే, ఈ సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలకడం వారు, బంగారపు పర్వతాలు, మరియు వెండి పర్వతాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా అల్లాహ్ కి చాలా ప్రియమైనది అల్లాహు అక్బర్.

ఆరవ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో రుజువైనది, సహీహ్ ముస్లిం లోని హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అల్లాహు తాలా తన దైవదూతల కొరకు మరియు తన యొక్క దాసుల కొరకు ఇష్టపడిన, ఎన్నుకున్న, ఛాయిస్ చేసినటువంటి పదాలలో ఒకటి చాలా ముఖ్యమైనది సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ.

అల్లాహు తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక!

ఇస్తిగ్ఫార్ సమయ సందర్భాలు [ఆడియో]

ఇస్తిగ్ఫార్ సమయ సందర్భాలు [ఆడియో]
https://youtu.be/g0VXsPG6NTc [6 నిముషాలు]

చాలా ముఖ్యమైన కేవలం 6 నిమిషాల ఈ అమూల్యమైన అంశం తప్పక వినండి
ఆచరించి పాపాలన్నీ క్షమించబడ్డాయన్న శుభవార్త పొందండి
📝 ఇస్తిగ్ఫార్ సమయ సందర్భాలు (పాపాల క్షమాభిక్ష ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కోరాలి)
🎤 #నసీరుద్దీన్_జామిఈ

సమస్యల నుండి విముక్తి కొరకు దుఆ

సమస్యల నుండి విముక్తి కొరకు దుఆ
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْــهَمِّ، وَالْحَزَنِ، وَالْعَجْزِ، وَالْكَسَلِ، وَالْجُبْنِ، وَالْبُخْلِ، وَضَلَعِ الدَّيْنِ، وَغَلَبَةِ الرِّجَالِ
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక 
మినల్ హమ్మి వల్ హజని 
వల్ అజ్ జి వల్ కసలి 
వల్ జుబ్ని వల్ బుఖ్ లి 
వ జలఇద్దైని వ గలబతిర్రిజాల్
ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుతున్నాను, 
ఆందోళన, దుఃఖం, 
బలహీనత, సోమరితనం, 
పిరికితనం, పిసినారితనము, 
అప్పుల భారం మరియు మనుష్యులచే ఆక్రమించబడడం నుండి.
 (సహీహ్ బుఖారీ:6369)

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْــهَمِّ، وَالْحَزَنِ، وَالْعَجْزِ، وَالْكَسَلِ، وَالْجُبْنِ، وَالْبُخْلِ، وَضَلَعِ الدَّيْنِ، وَغَلَبَةِ الرِّجَالِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక
మినల్ హమ్మి వల్ హజని
వల్ అజ్ జి వల్ కసలి
వల్ జుబ్ని వల్ బుఖ్ లి
వ జలఇద్దైని వ గలబతిర్రిజాల్

ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుతున్నాను,
ఆందోళన, దుఃఖం,
బలహీనత, సోమరితనం,
పిరికితనం, పిసినారితనము,
అప్పుల భారం మరియు మనుష్యులచే ఆక్రమించబడడం నుండి.

(సహీహ్ బుఖారీ:6369)

చెడుల నుండి అల్లాహ్ రక్షణ కోరుతూ ఉండే దుఆ

ఉఖ్ బహ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్ హు) వారి కథనం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ దువా చేసేవారు:

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ يَوْمِ السُّوءِ , وَمِنْ لَيْلَةِ السُّوءِ , وَمِنْ سَاعَةِ السُّوءِ , وَمِنْ صَاحِبِ السُّوءِ , وَمِنْ جَارِ السُّوءِ فِي دَارِ الْمُقَامَةِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ యౌమిస్సూఇ, వ మిన్ లైలతిస్సూఇ, మిన్ సాఅతిస్సూఇ, వ మిన్ సాహిబిస్సూఇ, వ మిన్ జారిస్సూఇ ఫీ దారిల్ ముఖామతి

“ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుచున్నాను, చెడు పగలు నుండి, చెడు రాత్రి నుండి, చెడు సమయం నుండి, చెడు సోదరుడి నుండి, ఎప్పటికీ తోడుగా ఉండే చెడు ఇరుగు పొరుగువారి నుండి.”

{తబ్రాని ముఅజ్జమ్ అల్ కబీర్ 17/294, 810, దైల్మి 1/461,1873, అల్లామా అల్బానీ వారు సహీహుల్ జామి 1299లో సహీహ్ ఖరారు చేసారు}

నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైన రెండు వాక్యాలు [ఆడియో]

నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైన రెండు వాక్యాలు
https://youtu.be/SdPO0cnevo8 [1:17 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[1:17 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 29
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ, త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి ?

సుబ్ హానల్లాహి వబిహందిహి సుబ్ హానల్లాహిల్ అజీమ్

సహీ బుఖారీలోని చివరి హదీసు, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ

“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).

అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత దారుణంॽॽॽ).

వఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్

Narrated Abu Huraira radhiyAllahu anhu:

The Prophet (ﷺ) said, “(There are) two words which are dear to the Beneficent (Allah) and very light (easy) for the tongue (to say), but very heavy in weight in the balance. They are: ”Subhan Allah wa-bi hamdihi” and ”Subhan Allah Al-`Azim.”

‘ముఫర్రిదూన్’ ముందుకు వెళ్లిపోయారు

అల్లాహ్ స్మరణ మహత్త్వం
كثرة ذكر الله: عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله : (سَبَقَ الْـمُفَرِّدُونَ) قَالُوا: وَمَا الْـمُفَرِّدُونَ يَا رَسُولَ الله؟ قَالَ: (الذَّاكِرُونَ اللهَ كَثِيرًا وَالذَّاكِرَاتُ).
11- అల్లాహ్ యొక్క అధిక స్మరణ: ప్రవక్త  ఇలా చెప్పారని అబూ హురైరా  ఉల్లేఖించారరు: "'ముఫర్రిదూన్' ముందుకు వెళ్ళారు. 'ముఫర్రిదూన్' ఎవరు ప్రవక్తా! అని అడిగారు సహచరులు. అప్పుడు ప్రవక్త  చెప్పారుః "అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేసే పురుషులు మరియు స్త్రీలు". (ముస్లిం 2676).

పై హదీసు క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది
పుణ్యఫలాలు (Doors to Great Rewards)
ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

وعنه قال‏:‏ قال رسول الله صلى الله عليه وسلم‏:‏ ‏”‏سبق المفردون‏”‏ قالوا‏:‏ وما المفردون يا رسول الله‏؟‏ قال‏:‏ ‏”‏الذاكرون الله كثيرًا والذكرات‏”‏
‏(‏‏‏رواه مسلم‏)‏‏‏‏.‏

Abu Hurairah (May Allah be pleased with him) reported: The Messenger of Allahﷺ  said: “The Mufarridoon have gone ahead.” He was asked, “Who are the Mufarridoon?” He ﷺ replied, “Those men and women who remember Allaah much.“

Sahih Muslim. Arabic/English book reference : Book 16, Hadith 1436

ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతిని నమాజును స్థాపించేవారిగా చెయ్యి

رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ

రబ్బిజ్ అల్ నీ ముకీమస్ సలాతి వ మిన్ జుర్రియ్యతీ రబ్బనా వత కబ్బల్ దుఆ

నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు. (14 : 40)

رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ

రబ్బిజ్ అల్ నీ ముకీమస్ సలాతి వ మిన్ జుర్రియ్యతీ రబ్బనా వత కబ్బల్ దుఆ

నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు. 
(14 : 40)

ఖురాన్ లోని రబ్బనా దుఆలు:
https://telugudua.net/rabbana-dua