జబహ్ చేసే ముందు చదివే దుఆ
సంకలనం & అనువాదం: ముహమ్మద్ అబ్దుల్ బాఖీ ఫారూఖీ
[డౌన్లోడ్ ఖుర్బానీ దుఆ]
[1.4 MB] [PDF] [4 పేజీలు]
بسم الله الرحمن الرحيم
ౙబహ్ చేసే ముందు చదివే దుఆ
بِسْمِ اللهِ وَ اللهُ أَكْبَرُ
“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు”. (సహీహ్ ముస్లిం 1966)
కేవలం తన తరపున ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి స్వయంగా ౙబహ్ చేస్తే:
بِسْمِ اللهِ ، اللَّهُمَّ تَقَبَّلُ مِنِّي “
“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)
(లేదా)
بِسْمِ اللهِ وَ اللهُ أَكْبَرُ هَذَا عَنِّي“
“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ హాజా అన్నీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్ప వాడు, ఇది (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి (స్వీకరించు)”. (అబూదావూద్ 2810; హసన్)
కేవలం తన తరపున, తన ఇంటి వారి తరపున స్వయంగా ఖుర్బానీ చేస్తే:
” بِسْمِ اللهِ اللَّهُمَّ تَقَبَّلُ مِنِّي وَمِنْ آلِ بَيْتِي“
“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ వ మిన్ ఆలి బైతీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)
(లేదా)
“بِسْمِ اللهِ وَاللَّهُ أَكْبَرُ ، هَذَا عَنِّي وَعَنْ أَهْلِ بَيْتِي“
“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, హాజా అన్నీ వ అన్ అహ్లి బైతీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు.ఇది (ఈ ఖుర్బానీ ను) నా తరపు నుండి నా ఇంటి వారి తరపు నుండి (స్వీకరించు)”. (అబూదావూద్ 2810)
(లేదా)
بِسْمِ اللَّهِ ، اللَّهُمَّ تَقَبَّلْ مِنِّي وَأَهْلِي“
“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ వ అహ్లి”
“అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్ ! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)
(లేదా)
بِسْمِ اللهِ وَاللَّهُ أَكْبَرُ، اللَّهُمَّ هَذَا مِنْكَ وَلَكَ اللَّهُمَّ هَذِهِ عَنِّي وَعَنْ أَهْلِ بَيْتِي”
బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమ్మ హాజా మిన్క వ లక అల్లాహుమ్మ హా‘జిహి అన్నీ వ అన్ అహ్లి బైతీ”
“అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు. ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్బానీ జంతువు) నీవు ప్రసాదించినదే మరియు నీ ప్రసన్నత కోసమే (ౙబహ్ చేస్తున్నాను). ఓ అల్లాహ్! దీనిని (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి (స్వీకరించు)”.
(మజ్మూ అల్ ఫతావా ఇబ్నె ఉసైమీన్ రహిమహుల్లాహ్ భాగం 25, పేజి 55)
ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ౙబహ్ చేయమని ఇతరులతో ౙబహ్ చేయిస్తే:
“بِسْمِ اللهِ ، اللَّهُمَّ تَقَبَّلُ مِنْ —— وَمِنْ آلِ بَيْتِهِ
“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్……వ మిన్ ఆలి బైతిహి’
“అల్లాహ్ పేరుతో (జబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్ ! (ఈ ఖుర్బానీ ను)……తరపు నుండి మరియు అతని ఇంటి వారి తరపు నుండి(స్వీకరించు)”. (సహీహ్ ముస్లిం 1967)
నోట్: గీత …. ఉన్న భాగంలో ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారి పేరు చదవవలెను.

