నిద్రకు సంబంధించిన దుఆలు

పడుకునే ముందు ఈ చిన్న జిక్ర్ చేస్తే సముద్రపు నురుగంత పాపాలు కూడా మన్నించబడతాయి

[1:39 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో లో చెప్పబడిన దుఆ నేర్చుకోండి:

లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. సుబ్ హానల్లాహ్ వల్ హందు లిల్లాహ్ వ లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ سُبْحَانَ الله وَ الْحَمْدُ لِلهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ

పడుకునే ముందు

[1] ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మరియు ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్

రెండు అరచేతులు కలిపి, పై మూడు సూరాలు చదివి, అందులో ఊదుకొని ముఖము, శరీర ముందు భాగం ఇంకా సాధ్యమైనంత వరకు మిగిత భాగంలో తుడుచు కోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి. (బుఖారి 5018).

[2] ఆయతుల్ కుర్సీ

పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).

[3] ఆమనర్రసూలు బిమా ఉంజిల ఇలైహి మిర్ రబ్బిహీ వల్ ముఅమినూన్, కుల్లున్ ఆమన బిల్లాహి వమలాఇకతిహీ వకుతుబిహీ వ రుసులిహీ లా నుఫర్రిఖు బైన అహదిమ్ మిర్రుసులిహ్, వ ఖాలూ సమిఅనా వ అతఅనా గుఫ్రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా లహా మా కసబత్ వఅలైహా మక్తసబత్ రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్నసీనా ఔ అఖ్ తఅనా రబ్బనా వలా తహ్ మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహూ అలల్లజీన మిన్ ఖబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మాలా తాఖత లనా బిహీ వఅఫు అన్నా వగ్ఫిర్ లనా వర్ హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్.

ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి అవతరించిన దానిని విశ్వసించాడు, విశ్వాసులు కూడా దానిని విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారంటారుః మేము అల్లాహ్ ప్రవక్తలలో ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము, నీ క్షమాభిక్షకై అర్థిస్తున్నాము ఓ మా ప్రభువా! గమ్యస్థానం నీ వైపుకే ఉంది. అల్లాహ్ ఏ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు, తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితం, తాను చేసిన పాపానికి దుష్ఫలితం ప్రతివ్యక్తి అనుభవిస్తాడు. (మీరు ఇలా వేడుకోండిః) ఓ మా ప్రభువా! మేము మరచినా, లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు. ఓ మా ప్రభువా! పూర్వం వారిపై మోపినటువంటి భారం మాపై మోపకు. ఓ మా ప్రభువా! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు సహాయం నొసంగు).

పై ఆయతులు రాత్రి పడుకునే ముందు చదువు కునే వారికి అవి సరిపోతాయి
. (బుఖారి 5040, ముస్లిం 807).

4- నిద్రించుటకు వెళ్ళినపుడు పడక బట్టల్ని బాగా దులుపుకోవాలి, అతను దాని నుండి దూరంగా ఉన్నపుడు అందులో ఏమి వచ్చి పడిందో అతనికి తెలియదు గనక, ఆ తర్వాత ఈ దుఆ చదవాలిః

బిస్మిక రబ్బీ వజఅతు జంబీ వ బిక అర్ఫఉహూ ఇన్ అమ్సక్ త నఫ్సీ ఫర్హమ్ హా వఇన్ అర్సల్ తహా ఫహ్ఫజ్ హా బిమా తహ్ఫజు బిహీ ఇబాదకస్సాలిహీన్. (బుఖారి 6320).

بِاسْمِكَ رَبِّ وَضَعْتُ جَنْبِي وَبِكَ أَرْفَعُهُ إِنْ أَمْسَكْتَ نَفْسِي فَارْحَمْهَا وَإِنْ أَرْسَلْتَهَا فَاحْفَظْهَا بِمَا تَحْفَظُ بِهِ عِبَادَكَ الصَّالِحِينَ

నా ప్రభూ! నీ పేరుతో (పడకపై) మేను వాల్చాను, తిరిగి నీ పేరుతోనే మేల్కొంటాను. (ఈ మధ్యలో) నీవు నా ప్రాణాన్ని (నీ వద్ద) ఆపుకుంటే దానిని క్షమించి కరుణించు. ఒకవేళ దానిని తిరిగి (నా శరీరంలో) విడిచిపెడితే సజ్జనులైన నీ దాసుల్ని రక్షించినట్లు దానిని రక్షించు.

5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పడుకోవాలని ఉద్దేశించినప్పుడు తమ కుడి చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని ఈ దుఆ 3 సార్లు చదివేవారు:

اللَّهُمَّ قِنِي عَذَابَكَ يَوْمَ تَبْعَثُ عِبَادَكَ

అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక.

అల్లాహ్! నీవు నీ దాసుల్ని మరణించిన తర్వాత తిరిగి బ్రతికించే రోజున నన్ను నీ శిక్ష నుండి కాపాడు.

(అబూ దావూద్ 5045).

6- ప్రవక్త పడకపై వచ్చి తమ చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని ఇలా చదివేవారు:

اللَّهُمَّ بِاسْمِكَ أَمُوتُ وَأَحْيَا

అల్లాహుమ్మ బిస్మిక అమూతు వ అహ్ యా

అల్లాహ్! నీ పేరుతోనే మృత్యు ఒడిలోకి పోతున్నాను మళ్ళీ నీ పేరుతోనే బ్రతుకుతున్నాను.


(బుఖారి 6314).


[7] మీరు మీ పడకపై వచ్చి నిద్రపోయే ముందు అల్లాహు అక్బర్ 34 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, సుబ్ హానల్లాహ్ 33 సార్లు చదవండి. ఇది మీ కొరకు బానిస కంటే ఎంతో ఉత్తమం. (బుఖారి 3113).

[8] ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అఅబుదు మా తఅ’బుదూన్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుద్. వలా అనా ఆబిదుమ్ మాఅబత్తుమ్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుద్, లకుమ్ దీనుకుమ్ వలియ దీన్.

ఇలా అనుః ఓ సత్యతిరస్కారులారా! మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను. నేను ఆరాధించే ఆయన(అల్లాహ్) ను మీరు ఆరాధించేవారు కారు. మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను. నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు. మీ ధర్మం మీకు, నా ధర్మం నాకు.

పై సూరా పఠించి వెంటనే పడుకో, నీవు షిర్క్ నుండి దూరంగా ఉన్నావని ఇది ఒక నిరూపణ
. (అబూ దావూద్ 5055).

[9] నీవు నీ పడకపై వచ్చే ముందు నమాజు కొరకు చేసిన విధంగా వుజూ చేసి నీ కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదువుః

అల్లాహుమ్మ అస్లమ్ తు వజ్ హీ ఇలైక వ ఫవ్వజ్ తు అమ్రీ ఇలైక వ అల్ జఅతు జహ్రీ ఇలైక రగ్బతౌఁ రహ్బతన్ ఇలైక లా మల్ జఅ వలా మంజా మిన్క ఇల్లా ఇలైక అల్లాహుమ్మ ఆమన్తు బికితాబికల్లజీ అంజల్త వ బినబియ్యికల్లజీ అర్సల్త.

اللَّهُمَّ أَسْلَمْتُ وَجْهِي إِلَيْكَ وَفَوَّضْتُ أَمْرِي إِلَيْكَ وَأَلْجَأْتُ ظَهْرِي إِلَيْكَ رَغْبَةً وَرَهْبَةً إِلَيْكَ لَا مَلْجَأَ وَلَا مَنْجَا مِنْكَ إِلَّا إِلَيْكَ اللَّهُمَّ آمَنْتُ بِكِتَابِكَ الَّذِي أَنْزَلْتَ وَبِنَبِيِّكَ الَّذِي أَرْسَلْتَ

ఓ అల్లాహ్ నీ సమక్షంలో నన్ను నేను సమర్పించు- కున్నాను. నా వ్యవహారాలన్నీ నీకు అప్పగించాను. ఇక నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ అనుగ్రహ భాగ్యం పొందే ఆరాటంతో, నీ ఆగ్రహ భయంతో నీ సన్నిధిలో హాజరయ్యాను. నీ నుండి పారిపోయి నేనెక్కడా రక్షణ పొందలేను. నీ సన్నిధిలో తప్ప నాకు మరెక్కడా ఆశ్రయం లేదు. అల్లాహ్! నీవు అవతరింప జేసిన నీ (ఖుర్ఆను) గ్రంథాన్ని, నీవు ప్రభవింపజేసిన నీ ప్రవక్తను (మనస్ఫూర్తిగా) విశ్వసించాను. (బుఖారి 247).

ఇదే రాత్రి నీవు చనిపోయావంటే ఇస్లాం ధర్మంపై నీవు చనిపోతావు. ఈ దుఆ నీ తుది పలుకులు కావాలి. (అంటే ఈ దుఆ తర్వాత నీ నోట ఎలాంటి ప్రాపంచిక విషయాలు వెలువడ కూడదు).

[10] అల్లాహుమ్మ రబ్బస్సమావాతి వ రబ్బల్ అర్జి వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బనా వ రబ్బ కుల్లి షైఇన్ ఫాలిఖిల్ హబ్బి వన్నవా వ ముంజిలత్ తౌరాతి వల్ ఇంజీలి వల్ ఫుర్కాని అఊజు బిక మిన్ షర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిజుమ్ బినాసియతిహీ, అల్లాహుమ్మ అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్ వ అంతల్ ఆఖిరు ఫలైస బఅదక షైఉన్ వ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్ వ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్ ఇఖ్ జి అన్నద్దైన వ అగ్నినా మినల్ ఫఖ్ర్.

اللَّهُمَّ رَبَّ السَّمَاوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ فَالِقَ الْحَبِّ وَالنَّوَى وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ اللَّهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ اقْضِ عَنَّا الدَّيْنَ وَأَغْنِنَا مِنْ الْفَقْرِ

భూమ్యాకాశాలకు, గొప్ప సింహాసనానికి ప్రభువైన అల్లాహ్! మాకు మరియు ప్రతీదానికి ప్రభువైన ఓ ప్రభువా! బీజాన్ని, విత్తనాన్ని చీల్చువాడా! తౌరాత్, ఇంజీల్ మరియు ఫుర్కాన్ (ఖుర్ఆన్) అవతరింప జేసినవాడా! నేను ప్రతీ కీడు నుండి నీ శరణులో వచ్చాను, దాని జుట్టు నీ చేతిలోనే ఉంది. ఓ అల్లాహ్! నీవే అందరికీ ప్రథమం, నీకంటే ముందు ఎవడూ లేడు, నీవే అంతం, నీ తర్వాత ఎవడూ లేడు, నీవే అందరిపై ఆధిపత్యం గలవానివి, నీపై ఎవరి ఆధిపత్యం చెల్లదు, నీవే అందరికీ పరోక్షంగా ఉన్నవానివి, నీకంటే మరుగగా ఎవడూ లేడు, మాపై ఉన్న అప్పును తేర్చు, బీదరికం నుండి బైటికి తీసి మమ్మల్ని సరిసంపదలు గలవానివిగా చేయు

(ముస్లిం 2713).

[11] అల్ హందులిల్లాహిల్లజీ అత్అమనా వ సఖానా వ కఫానా వ ఆవానా ఫకమ్ మిమ్మల్ లా కాఫియ లహూ వలా ముఅవియ.

الْحَمْدُ لِله الَّذِي أَطْعَمَنَا وَسَقَانَا وَكَفَانَا وَآوَانَا فَكَمْ مِمَّنْ لَا كَافِيَ لَهُ وَلَا مُؤْوِي

సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే! ఆయనే మాకు తినిపించాడు, త్రాగించాడు, సరిపోయాడు, నివాసమిచ్చాడు. లేకుంటే ఎంతో మందికి సరిపడు వాడు మరియు నివాసమిచ్చువాడు ఎవడూ లేడు.


(ముస్లిం 2715).

[12] అల్లాహుమ్మ ఫాతిరిస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రుహూ ఇలా ముస్లిమ్.

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرُّهُ إِلَى مُسْلِمٍ

ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతి వస్తువు యొక్క ప్రభువా! మరియు వాటి యజమానీ! నీ తప్ప ఎవ్వరూ సత్య ఆరాధ్యుడు లేడు అని నేను సాక్ష్యమిచ్చు చున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్లగాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.


(అబూదావూద్ 5083).

13- పడుకునే ముందు ఖుర్ఆనులోని సూర (32) అలిఫ్ లామ్ మీమ్ అస్సజ్దా మరియు సూర (67) ముల్క్ చదవాలి. (తిర్మిజి 3404).

రాత్రివేళ ప్రక్క మారుస్తూ

లాఇలాహ ఇల్లల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్, రబ్బుస్సమావాతి వల్ అర్జి వమా బైనహుమల్ అజీజుల్ గఫ్ఫార్. (హాకిం, సహీహుల్ జామి 4693).

لاَ إِلَهَ إِلاَّ اللهُ الوَاحِدُ القَهَّارُ رَبُّ السَّمَاوَاتِ وَالأَرضِ وَمَا بَينَهُمَا العَزِيزُ الغَفَّار

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు, సర్వాధికారుడు, భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు).

నిద్రలో భయాందోళన కలిగినప్పుడు


అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ గజబిహీ వ ఇఖాబిహీ వ షర్రి ఇబాదిహీ వ మిన్ హమజాతిష్ షయాతీని వ అఐఁ యహ్ జురూన్. (తిర్మిజి 3528).

أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ غَضَبِهِ وَعِقَابِهِ وَشَرِّ عِبَادِهِ وَمِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ وَأَنْ يَحْضُرُونِ

(అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల రక్షణలో వస్తున్నాను; ఆయన ఆగ్రహం నుండి, శిక్ష నుండి, ఆయన దాసుల కీడు నుండి మరియు షైతానుల ప్రేరేపణల నుండి ఇంకా అవి స్వయంగా దగ్గరకు రావడం నుండి).

చెడు కల చూస్తే ఏం చేయాలి?

* ముడూ సార్లు తన ఎడమ ప్రక్కలో ఉమ్మి వేయాలి.
* ఆ చెడు కల మరియు షైతాన్ నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి.
* ప్రక్క మార్చాలి.
* ఆ కల గురించి ఎవరికీ తెలుపకూడదు.
* లేచి నమాజు చేసుకున్నా మంచిదే.

పై పనులు చేసినవానికి ఆ కల ద్వారా ఏ హానీ, అపాయం కలుగదు ఇన్షాఅల్లాహ్.


(ముస్లిం 2261-2263).

నిద్ర నుండి మేల్కొన్న తర్వాత

అల్ హందులిల్లాహిల్లజీ అహ్ యానా బఅద మా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. (బుఖారి 6312).
الْـحَمْدُ لِلهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُورُ
(అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే మమ్మల్ని మరణింప- జేసిన తర్వాత తిరిగి బ్రతికించాడు. మళ్ళీ ఆయన వైపునకే మరలిపోవలసి ఉన్నది).

అల్ హందులిల్లాహిల్లజీ ఆఫానీ ఫీ జసదీ వరద్ద అలయ్య రూహీ వ అజినలీ బిజిక్రిహీ. (తిర్మిజి 3401).
الْـحَمْدُ لِله الَّذِي عَافَانِي فِي جَسَدِي وَرَدَّ عَلَيَّ رُوحِي وَأَذِنَ لِي بِذِكْرِهِ
(అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే నా శరీరం లో క్షేమాన్ని ప్రసాదించాడు. నా ఆత్మను తిరిగి పంపాడు, అయన్ను స్మరించే అనుమతి (భాగ్యం) ప్రసాదించాడు).

ఎవరైనా రాత్రి వేళ మేల్కుంటే చదవాలి

లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్ హందు లిల్లాహ్ వ సుబ్ హానల్లాహ్ వ లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ الْحَمْدُ لِلهِ وَسُبْحَانَ الله وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ

ఈ దుఆ చదివిన వెంటనే ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని లేదా మరేదైనా దుఆ చేస్తే స్వీకరించ బడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజు చేస్తే అదీ అంగీకరింపబడుతుంది. (బుఖారి 1154)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి మేల్కొన్నప్పుడు సూర ఆలె ఇమ్రాన్ యొక్క చివరి పది ఆయతులు (3: 190-200) పారాయణం చేసేవారు. (ముస్లిం 763, బుఖారి 183).

3:190 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ల రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.

3:191 الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ
వారు నిల్చుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్‌ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు : ”మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు.”

3:192 رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
”ఓ మా పోషకుడా! నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. యదార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు.”

3:193 رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ
”మా ప్రభూ! పిలిచేవాడొకడు విశ్వాసం (ఈమాన్‌) వైపుకు పిలవటం, ‘ప్రజలారా! మీ ప్రభువును విశ్వసించండి’ అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసించాము. కనుక ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.”

3:194 رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ
”మా ప్రభూ! నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయదినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితిలోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు.”

3:195 فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّي لَا أُضِيعُ عَمَلَ عَامِلٍ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّن بَعْضٍ ۖ فَالَّذِينَ هَاجَرُوا وَأُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأُوذُوا فِي سَبِيلِي وَقَاتَلُوا وَقُتِلُوا لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ثَوَابًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَاللَّهُ عِندَهُ حُسْنُ الثَّوَابِ

వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు: ”మీలో పని చేసేవారి పనిని – వారు పురుషులైనా సరే, స్త్రీలయినాసరే – నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు. కాబట్టి తమ స్వస్థలం వదలి వలస వెళ్ళినవారు (హిజ్రత్‌ చేసినవారు), తమ ఇళ్ళనుంచి వెళ్లగొట్ట బడినవారు, నా మార్గంలో వేధింపులకు గురైనవారు, నా మార్గంలో పోరాడి చంపబడినవారు – అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇదీ అల్లాహ్‌ తరఫున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్‌ వద్దనే అత్యుత్తమమయిన పుణ్యఫలం ఉంది” అని సెలవిచ్చాడు.

3:196 لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِينَ كَفَرُوا فِي الْبِلَادِ
(ఓ ప్రవక్తా!) నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు.

3:197 مَتَاعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَاهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمِهَادُ
ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం.

3:198 لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا نُزُلًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ لِّلْأَبْرَارِ
కాని తమ ప్రభువుకు భయపడుతూ మసలుకునేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదీ అల్లాహ్‌ వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తనుల కోసం అల్లాహ్‌ వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్ఠమైనది.

3:199 وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ وَمَا أُنزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۗ أُولَٰئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
గ్రంథవహులలో కొందరున్నారు – వారు అల్లాహ్‌ను, మీపై అవతరించిన దానినీ, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారు. అల్లాహ్‌ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటివారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా అల్లాహ్‌ వేగంగా లెక్క తీసుకుంటాడు.

3:200 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا وَرَابِطُوا وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! మీరు సహనస్థయిర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ, (అల్లాహ్‌ మార్గంలో పోరుకు) సమాయత్తమై ఉండండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.