ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి? [ఆడియో, టెక్స్ట్]

ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి
https://youtu.be/dy6dlz_jG4g ⏰ 03:20 నిమిషాలు
🎤 నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రతి ముస్లిం రోజూ సూరా అల్-ఇఖ్లాస్, సూరా అల్-ఫలఖ్, మరియు సూరా అన్-నాస్‌లను ఎప్పుడు, ఎన్నిసార్లు పఠించాలో వివరించబడింది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒకసారి, ఉదయం (అద్కార్ అస్-సబాహ్) మరియు సాయంత్రం (అద్కార్ అల్-మసా) దుఆలలో మూడుసార్లు, మరియు నిద్రపోయే ముందు మూడుసార్లు అరచేతులలోకి ఊది శరీరంపై తుడుచుకుంటూ పఠించాలని చెప్పబడింది. ఈ విధంగా ప్రతి సూరాను రోజుకు 14 సార్లు పఠిస్తారని లెక్కించారు. ఒకవేళ ఉదయం మరియు సాయంత్రం అద్కార్లను ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్‌ల తర్వాత చేస్తే, ఆ మూడుసార్లు చేసే పఠనంలోనే నమాజ్ తర్వాత చేసే ఒకసారి పఠనం కూడా కలిసిపోతుందని, అప్పుడు మొత్తం సంఖ్య 12 అవుతుందని స్పష్టం చేశారు. ఈ సూరాల ఘనతను తెలుసుకొని, ఇతర సందర్భాలలో కూడా వాటిని పఠించాలని ప్రోత్సహించారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ప్రతి ముస్లిం, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)

సూరాలు చదవాలి. ఇవి ఐదుసార్లు అవుతాయి. మరియు ఉదయం అద్కార్, అద్కారుస్ సబాహ్ అని ఏవైతే అంటామో, morning supplications, వాటిలో కూడా ఈ మూడు సూరాలూ, సూరాలు మూడేసి సార్లు చదవాలి.

అలాగే అద్కారుల్ మసా, సాయంకాలం చదివే అద్కార్లలో కూడా ఈ మూడు సూరాలు, ఇఖ్లాస్, ఫలఖ్, నాస్ మూడేసి సార్లు చదవాలి. ఎన్ని అయినాయి? ఉదయం మూడు, సాయంకాలం మూడు, ఆరు. మరియు ప్రతీ ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి. ఐదు. పదకొండు అయినాయి.

మళ్లీ రాత్రి పడుకునే ముందు రెండు అరచేతులను కలిపి, అందులో ఊది, ఒక్కొక్కసారి ఈ సూరాలు చదివి, తలపై, ముఖముపై, శరీరం ముందు భాగం, మిగతా శరీర భాగములతో తుడుచుకోవాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఈ విధంగా మొత్తం 14 సార్లు అవుతుంది.

పఠనాల సంఖ్య మరియు ఒక ప్రత్యేక మినహాయింపు

అద్కారుస్ సబాహ్‌లో మూడు సార్లు, మూడు మూడు సార్లు, అద్కారుల్ మసాలో మూడు మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు, మూడు మూడు సార్లు, తొమ్మిది మరియు ఐదు పూటల ఫర్జ్ నమాజ్‌ల తర్వాత ఒక్కొక్కసారి, పద్నాలుగు.

కానీ శ్రద్ధ వహించండి ఇక్కడ. ఎవరైనా అద్కారుస్ సబాహ్ ఫజ్ర్ నమాజ్ తర్వాత చదువుతున్నారు మరియు అద్కారుల్ మసా మగ్రిబ్ నమాజ్ తర్వాత చదువుతున్నారు, అలాంటప్పుడు వారు

మూడుసార్లు

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్, ఏకైకుడు.” (112:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను వేకువ ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (113:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను మానవుల ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (114:1)

చదువుకున్నారంటే, ఫజ్ర్ తర్వాత ఒక్కొక్కసారి, మగ్రిబ్ తర్వాత ఒక్కొక్కసారి చదివేది ఏదైతే ఉందో అది ఇందులోనే, అంటే మూడుసార్లు చదివితే, ఇంక్లూడ్ (include) అయిపోతుంది. ఎందుకంటే ఫజ్ర్ తర్వాత అద్కారుస్ సబాహ్ ఉద్దేశంతో, మగ్రిబ్ తర్వాత అద్కారుల్ మసా ఉద్దేశంతో చదువుతున్నారు గనుక అని కొందరు ధర్మవేత్తలు చెబుతారు. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే, టోటల్ 12 సార్లు అవుతాయి.

ఇవే కాకుండా ఒక ముస్లిం ఈ సూరాల ఘనతను, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్, సూరతున్నాస్ ఘనతలను హదీథుల ఆధారంగా తెలుసుకోవాలి మరియు వేరు వేరు సందర్భాలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ సందర్భాల్లో చదవాలి. ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకోవడానికి మా క్లాసులో హాజరవుతూ ఉండండి.


అన్ని రకాల మేళ్లను అడుగుతూ, అన్ని రకాల చెడుల నుండి రక్షణ కోరే సమగ్రమైన దుఆ

ఇమామ్ ఇబ్న్ మాజా -రహిమహుల్లాహ్ – తన ‘సునన్’ (ప్రార్థన పుస్తకం: అధ్యాయం [4] సమగ్ర దుఆ: నం. 3846) లో ఇలా నివేదించారు: “అబూ బకర్ ఇబ్న్ అబీ షైబా మాకు ఇలా ఉల్లేఖించారు: అఫ్ఫాన్ మాకు ఇలా ఉల్లేఖించారు: హమ్మాద్ ఇబ్న్ సలామా మాకు ఇలా ఉల్లేఖించారు: జబ్ర్ ఇబ్న్ హబీబ్ నాకు తెలియజేసారు: ఉమ్ కుల్తూమ్ బిన్త్ అబీ బకర్ నుండి:ఆయిషా నుండి: అల్లాహ్ యొక్క ప్రవక్త నాకు ఈ దుఆ నేర్పించాడు:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنَ الْخَيْرِ كُلِّهِ عَاجِلِهِ وَآجِلِهِ مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ وَأَعُوذُ بِكَ مِنَ الشَّرِّ كُلِّهِ عَاجِلِهِ وَآجِلِهِ مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ عَبْدُكَ وَنَبِيُّكَ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عَاذَ بِهِ عَبْدُكَ وَنَبِيُّكَ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْجَنَّةَ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ وَأَسْأَلُكَ أَنْ تَجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِي خَيْرًا ‏”


అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక మినల్ ఖైరి కుల్లిహీ ఆజిలిహీ వ ఆజిలిహీ మా అలిమ్ తు మిన్హు వ మాలమ్ అఅ్ లమ్, వ అఊజుబిక మినష్షర్రి కుల్లిహీ ఆజిలిహీ వ ఆజిలిహీ మా అలిమ్ తు మిన్హు వ మాలమ్ అఅ్ లమ్. అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక, వ అఊజుబిక మిన్ షర్రి మా ఆజ బిహీ అబ్దుక వ నబియ్యుక, అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ జన్నత వమా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔ అమలి, వ అఊజుబిక మినన్నారి వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔ అమలి, వ అస్ అలుక అన్త జ్ అల కుల్ల ఖదా ఇన్ ఖదైతహూ లీ ఖైరా

“ఓ అల్లాహ్! నేను త్వరగా చేకూరే లేదా ఆలస్యంగా చేకూరే, నాకు తెలిసిన లేదా నాకు తెలియని అన్ని రకాల మంచిని నీ నుంచి కోరుతున్నాను. అలాగే నేను త్వరగా జరిగే లేదా ఆలస్యంగా జరిగే, నాకు తెలిసిన లేదా నాకు తెలియని అన్ని రకాల చెడుగుల నుంచి నీ రక్షణ కోరుతున్నాను.

ఓ అల్లాహ్! నీ నుంచి నీ దాసుడు మరియు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోరిన ప్రతి మంచినీ కోరుతున్నాను. అలాగే నీ దాసుడు మరియు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోరినట్లుగానే ప్రతి చెడుగు నుంచి రక్షణ కోరుతున్నాను.

ఓ అల్లాహ్! నేను నీ నుంచి స్వర్గాన్ని కోరుతున్నాను. అలాగే స్వర్గానికి చేరువ చేసే వాక్కును, ఆచరణను కోరుతున్నాను. ఓ అల్లాహ్! నరకాగ్ని నుంచి నేను నీ రక్షణ కోరుతున్నాను. అలాగే నరకాగ్నికి చేరువ చేసే వాక్కు నుంచి మరియు ఆచరణ నుంచి నీ రక్షణ కోరుతున్నాను.

ఓ అల్లాహ్! నీవు నా కొరకు నిర్ణయించిన విధిని నా కొరకు ఉత్తమమైనదిగా మలచవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను”

(సహీహ్ సునన్ ఇబ్నె మాజహ్, లిల్ అల్బానీ, అల్ జుజి ఉస్సానీ, హదీస్ నెం : 3102)

ఈ దుఆ క్రింది పుస్తకంలో కూడా పొందు పరచబడింది :
ప్రవక్త ﷺ దుఆలు – షేఖ్ అబ్దుల్ ముహ్సిన్ అల్ అబ్బాద్

ఇంగ్లీష్ లింక్ :
https://authentic-dua.com/category/group/comprehensive-dua/

లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ (لَا حَوٍلَ وَلَا قُوَّةَ إِلَّا باللهِ) – స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధి

బలం, శక్తి లేక సామర్ధ్యం – ఇవన్నీ కేవలం అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తాయి. మనిషి ఎంత పెద్ద శక్తిమంతుడైనా, ఎంతటి బలం బలగం, అందలం అధికారం కలవాడైనా అల్లాహ్ ముందు అతను ఒక బలహీనమైన ప్రాణి మాత్రమే. చిటికేసి యావత్ ప్రపంచ యంత్రాంగాన్ని నడిపించగల తోపు అయినా సరే అల్లాహ్ సహాయం, అల్లాహ్ సంకల్పం లేకుండా ఏమీ చేయలేడు. ఆఖరికి మనిషి మంచి పనులు చేయాలన్నా, చెడు పనుల నుంచి ఆగిపోవాలన్నా అల్లాహ్ బలమే కావాలి. అల్లాహ్ ప్రసాదించే శక్తిసామర్ధ్యాలే అతనిలో ఉండాలి.

జీవితంలో అడుగడుగునా మనకు అల్లాహ్ సహాయం కావాలి. అలాంటప్పుడు మనల్ని సృష్టించిన ఆ ఏకైక సృష్టికర్త అల్లాహ్ యొక్క సహాయం అడుక్కోవటానికి నామోషీ ఎందుకు?

అసలు ఆలోచిస్తే మనం అల్లాహ్ ను అంతకంటే ఎక్కువగా ప్రార్థించాలి. మన కష్టాల్ని ఆయనకు విన్నవించుకోవాలి. బాధలను తొలగించమని వేడుకోవాలి. కోరికలు తీర్చమని పదే పదే ప్రాధేయపడాలి. అది డబ్బు సమస్య అయినా, కుటుంబ సమస్యలు అయినా, మరేదైనా సరే. ఆ గడ్డు పరిస్థితిని దాటటానికి దివ్యమైన శక్తి కావాలి. అటు వంటి దివ్యమైన శక్తి లభించే ఏకైక ఆధారం అల్లాహ్!

జీవితంలో తట్టుకోలేని పెను ప్రమాదాలు ఎదురైనప్పుడు మనిషి నోటి నుండి వెలువడే – “అల్లాహ్ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము” – వంటి మాటలు అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవి. అటువంటి వారికి అల్లాహ్ సహాయం తప్పకుండా లభిస్తుంది.

అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో, “స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధిని గురించి నేను మీకు తెలుపనా?” అని అడిగారు. “తెలుపండి దైవప్రవక్తా!” అన్నాను నేను. దానికి ఆయన ఇలా పలకమని చెప్పారు:

لَا حَوٍلَ وَلَا قُوَّةَ إِلَّا باللهِ
“లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”
ఏ శక్తి అయినా, ఏ సామర్థ్యం అయినా అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుంది.
(బుఖారీ, మస్లిం గ్రంథాలు)

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
మహిమ గల 12 దుఆలు – శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ [PDF] [పాకెట్ సైజు ]
పై లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

స్వర్గపు నిధులలో ఒక గొప్ప నిధి – లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
https://youtu.be/h-81z8V7ecU [68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

హస్బునల్లాహు వ నీమల్ వకీల్ – حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ

వాస్తవంలో మనలను కాపాడేదెవరు? అల్లాహ్ యే కదా! ఆయన మన వెంట ఉంటే ఇక ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయజాలదు. అల్లాహ్ మనతో ఉన్నాడన్న విశ్వాసం జీవితంలో మనల్ని ఏ సందర్భంలోనూ నిరాశా నిస్పృహలకు లోను కానివ్వదు. ఇతరుల దగ్గర మందీ మార్బలం ఉండవచ్చు. అందలం అధికారం ఉండవచ్చు. మారణాయుధాలు ఉండవచ్చు. అయితే వాటన్నిటి కంటే బలమైనది ఖుర్ఆన్ విశ్వాసులకు బోధిస్తున్న ఈ ప్రకటన వాక్యం:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
“హస్బునల్లాహు వ నీమల్ వకీల్”
మాకు అల్లాహ్ చాలు. ఆయన ఎంతో మంచి కార్యసాధకుడు (పనులు చక్కబెట్టేవాడు)
(ఖుర్ఆన్ 3:173)

మండే అగ్ని గుండం ఒక్కసారిగా చల్లారిపోవటాన్ని మీరు ఊహించగలరా! నిరంకుశ రాజు నమ్రూద్, అతని జాతివారు – ఏకదైవారాధనా నేరానికి – ఇబ్రాహీమ్ ప్రవక్తపై సజీవ దహన శిక్షను అమలు పరచాలని నిర్ణయిం చారు. భగభగ మండే అగ్ని గుండంలోకి ఆయనను విసిరేశారు. ఆ సమయంలో యువకుడైన ఇబ్రాహీమ్ ఏమాత్రం బెదర లేదు. భయపడలేదు. ఒకే ఒక్క అల్లాహ్ ఆరాధనపై ఆయనకు నమ్మకం మరింత బలపడింది. అల్లాహ్ పై అంతులేని విశ్వాసంతో ఆయన, “హస్బునల్లాహు వ నీమల్ వకీల్” అన్నారు. మండుతున్న అగ్ని గుండం ఒక్కసారిగా చల్లారిపోయింది.

“మక్కావారు ఒక పెద్ద సైన్యంతో మీపైకి దండెత్తి వస్తు న్నారు” అని ఒకసారి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అన్నప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన వెంట ఆయన సహచరులు బిగ్గరగా ఇలా ప్రకటించారు: “హస్బునల్లాహు వ నీమల్ వకీల్”

الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ

”అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి” అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ”మాకు అల్లాహ్‌ చాలు. ఆయన చాలా మంచి కార్యసాధకుడు” అని వారన్నారు. (సూరా ఆలి ఇమ్రాన్ 3:173)

ఖుర్ఆన్ ద్వారా లభించిన ఈ చిట్కా జీవితంలో ఎటువంటి ఆపదలు, ప్రమాదాలనైనా ఎదుర్కొవటానికి తోడ్పడుతుంది. అయితే అందుకు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉండాలి. మిగతా విషయాలన్ని అల్లాహ్ కు వదిలేయాలి. కేవలం అల్లాహ్ సహాయాన్ని, కరుణను మాత్రమే కోరుకోవాలి. అల్లాహ్ రాసిపెట్టిన విధివ్రాత ముందు తలవంచాలి. అల్లాహ్ కు ఆత్మసమర్పణ చేసుకొని జీవితాన్ని కొనసాగిం చాలి.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
మహిమ గల 12 దుఆలు – శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ [PDF] [పాకెట్ సైజు ]
పై లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి




ౙబహ్ చేసే ముందు చదివే దుఆ – ఖుర్బానీ దుఆలు

ౙబహ్ చేసే ముందు చదివే దుఆ
ఖుర్బానీ దుఆ

జబహ్ చేసే ముందు చదివే దుఆ
సంకలనం & అనువాదం: ముహమ్మద్ అబ్దుల్ బాఖీ ఫారూఖీ

[డౌన్లోడ్ ఖుర్బానీ దుఆ]
[1.4 MB] [PDF] [4 పేజీలు]

بسم الله الرحمن الرحيم
ౙబహ్ చేసే ముందు చదివే దుఆ

بِسْمِ اللهِ وَ اللهُ أَكْبَرُ

“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు”.
(సహీహ్ ముస్లిం 1966)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)

(లేదా)

“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ హాజా అన్నీ”
”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్ప వాడు, ఇది (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి (స్వీకరించు)”.
(అబూదావూద్ 2810; హసన్)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ వ మిన్ ఆలి బైతీ”

”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)

(లేదా)

“బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, హాజా అన్నీ వ అన్ అహ్లి బైతీ”

”అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు.ఇది (ఈ ఖుర్బానీ ను) నా తరపు నుండి నా ఇంటి వారి తరపు నుండి (స్వీకరించు)”. (అబూదావూద్ 2810)

(లేదా)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ వ అహ్లి”

“అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్ ! (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి స్వీకరించు”. (సహీహ్ ముస్లిం 1967)

(లేదా)

బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమ్మ హాజా మిన్క వ లక అల్లాహుమ్మ హా‘జిహి అన్నీ వ అన్ అహ్లి బైతీ”

“అల్లాహ్ పేరుతో (ౙబహ్ చేస్తున్నాను) మరియు అల్లాహ్ గొప్పవాడు. ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్బానీ జంతువు) నీవు ప్రసాదించినదే మరియు నీ ప్రసన్నత కోసమే (ౙబహ్ చేస్తున్నాను). ఓ అల్లాహ్! దీనిని (ఈ ఖుర్బానీను) నా తరపు నుండి మరియు నా ఇంటి వారి తరపు నుండి (స్వీకరించు)”.

(మజ్మూ అల్ ఫతావా ఇబ్నె ఉసైమీన్ రహిమహుల్లాహ్ భాగం 25, పేజి 55)

“బిస్మిల్లాహి, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్……వ మిన్ ఆలి బైతిహి’

“అల్లాహ్ పేరుతో (జబహ్ చేస్తున్నాను), ఓ అల్లాహ్ ! (ఈ ఖుర్బానీ ను)……తరపు నుండి మరియు అతని ఇంటి వారి తరపు నుండి(స్వీకరించు)”. (సహీహ్ ముస్లిం 1967)

నోట్: గీత …. ఉన్న భాగంలో ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారి పేరు చదవవలెను.

షిర్క్ నుండి రక్షణ కోసం దుఆ

సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఘనతలు – తప్పక వినండి

సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఘనతలు – తప్పక వినండి , కేవలం 5 నిముషాలు
https://youtu.be/CvXZ0XJRynE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్హందులిల్లాహ్. ప్రియులారా! సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ యొక్క ఘనతలో ఈ కొన్ని హదీసులను శ్రద్ధగా వినండి. మరియు అధికంగా ఈ యొక్క జిక్ర్ చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి. అల్లాహ్ నాకు మీకు మనందరికీ ఈ యొక్క జిక్ర్ అధికంగా చేసేటటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

మొదటి హదీస్ షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహలో ప్రస్తావించారు.నూహ్ అలైహిస్సలాం మరణం సమీపించినప్పుడు తన కొడుకును దగ్గరకు పిలుచుకొని, నాన్నా నా కుమారుడా! నేను నీకు రెండు విషయాల గురించి వాంగ్మూలం (వసియత్) చేస్తున్నాను. నేను రెండు విషయాల గురించి ఆదేశిస్తున్నాను, శ్రద్ధగా వాటిని నీవు పాటించు. ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనిపై చాలా స్థిరంగా ఉండు. ఎందుకంటే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత ఎంత గొప్పదంటే మొత్తం భూమ్యాకాశాలు ఈ విశ్వమంతా కూడా ఒక రింగు మాదిరిగా చేసేస్తే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆ రింగును విరగ్గొట్టే అంతటి శక్తి గలది. మరియు అధికంగా సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలుకుతూ ఉండు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి యొక్క ఆరాధన అదే. దాని ద్వారానే వాటికి ఉపాధి లభిస్తుంది.

రెండవ హదీస్ సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లో వచ్చినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అని ఎవరైతే ఒక రోజులో 100 సార్లు పలుకుతారో వారి పాపాలు మన్నించబడతాయి. వారి పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. ఒకవేళ అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే.

మూడవ హదీస్ షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహ్ అత్ తర్గీబ్ లో ప్రస్తావించారు. ఎవరైతే సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఒక్కసారి పలుకుతారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది.

నాలుగవ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లోనిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. నిశ్చయంగా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన పలుకుల్లో ఒకటి సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ.

ఐదవ హదీస్ షేక్ అల్బాని రహమహుల్లాహ్ సహీహ్ అత్ తర్గీబ్ లో ప్రస్తావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రాత్రి మేల్కొని నిలబడి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం, నమాజ్ లో తిలావత్ (ఖురాన్ పారాయణం చేయడం) చాలా కష్టతరంగా అవుతుందో, చేయలేకపోతున్నారో, అలాగే ఎవరి వద్దనైతే డబ్బు ధనము ఉండి ఖర్చు చేయలేకపోతున్నారో, పిసినారితనం వహిస్తున్నారో, లేదా శత్రువు ముందుకు వచ్చినా అతనితో పోరాడే అటువంటి శక్తి లేక పిరికితనం వహిస్తున్నాడో, ప్రత్యేకంగా ఇలాంటి వారు అధికంగా సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అని పలుకుతూ ఉండాలి, ఎందుకంటే, ఈ సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలకడం వారు, బంగారపు పర్వతాలు, మరియు వెండి పర్వతాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా అల్లాహ్ కి చాలా ప్రియమైనది అల్లాహు అక్బర్.

ఆరవ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో రుజువైనది, సహీహ్ ముస్లిం లోని హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అల్లాహు తాలా తన దైవదూతల కొరకు మరియు తన యొక్క దాసుల కొరకు ఇష్టపడిన, ఎన్నుకున్న, ఛాయిస్ చేసినటువంటి పదాలలో ఒకటి చాలా ముఖ్యమైనది సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ.

అల్లాహు తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక!

దుఃఖం , ఆందోళన, ఒత్తిడి & బాధల్లో చదివే ఒక గొప్ప దుఆ

దుఃఖం , ఆందోళన, ఒత్తిడి & బాధల్లో చదివే ఒక గొప్ప దుఆ
https://youtu.be/fZh3aifnBH0 [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

اللّهُمَّ إِنِّي عَبْدُكَ ابْنُ عَبْدِكَ ابْنُ أَمَتِكَ نَاصِيَتِي بِيَدِكَ، مَاضٍ فِيَّ حُكْمُكَ، عَدْلٌ فِيَّ قَضَاؤكَ أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ أَوْ أَنْزَلْتَهُ فِي كِتَابِكَ، أَوْ عَلَّمْتَهُ أَحَداً مِنْ خَلْقِكَ أَوِ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الغَيْبِ عِنْدَكَ أَنْ تَجْعَلَ القُرْآنَ رَبِيعَ قَلْبِي، وَنورَ صَدْرِي وجَلَاءَ حُزْنِي وذَهَابَ هَمِّي

అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక, ఇబ్ను అబ్దిక, ఇబ్ను అమతిక, నాసియతీ బియదిక, మాదిన్ ఫియ్య హుక్ముక, అద్లున్ ఫియ్య ఖదాఉక, అస్అలుక బికుల్లిస్మిన్ హువలక, సమ్మైత బిహీ నఫ్సక, అవ్ అన్జల్తహూ ఫీ కితాబిక అవ్ అల్లమ్ తహూ అహదన్ మిన్ ఖల్ఖిక, అవ్ ఇస్తాసర్త బిహి ఫీ ఇల్మిల్ గైబి ఇన్దక, అన్ తజ్ అలల్ ఖుర్ఆన రబీఅ ఖల్బీ, వ నూర సద్రీ, వ జలాఅ హుజ్నీ, వదహాబ హమ్మీ!

ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నీ దాసుడిని, నీ దాసుడి కుమారుడిని, నీ దాసురాలి పుత్రుడను, నా నొసలు, ముంగురులు నీ చేతిలో ఉన్నాయి. నీ ఆజ్ఞ నాలో కొనసాగుతున్నది నా కొరకై నీ తీర్పు న్యాయసమ్మతమైనది. నీ నామములన్నింటితో, వేటినైతే నీవు నీ కొరకుపెట్టుకున్నావో, లేదా నీ గ్రంథంలో అవతరింపజేసావో, లేదా నీ సృష్టిలో ఎవరికైనా తెలిపావో, లేదా నీ అగోచర జ్ఞానంలోనే ఉంచాలని నిశ్చయంచుకున్నావో, ఆ నామములన్నింటితో నిన్ను అడుగుచున్నాను – ఖుర్ఆన్ ను నా మనసుకు వసంతముగా, హృదయానికి కాంతిగా, నా మనోవేదనను దూరం చేసే దానిగా, నా దుఃఖాన్ని దూరం చేసేదిగా చేయమని వేడుచున్నాను.

[అహ్మద్ 1/391 మరియు అల్బానీ సహీహ్ అన్నారు]

ఈ జిక్ర్ చేస్తే, మీ పాపాలు ఎండిన చెట్టు ఆకుల వలె రాలి పడిపోతాయి

ఈ జిక్ర్ చేస్తే, మీ పాపాలు ఎండిన చెట్టు ఆకుల వలె రాలి పడిపోతాయి
https://youtube.com/shorts/4jdvZGtZ_Kc [1 నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సహృదయ సాధనకు ప్రవక్త ﷺ వారి దుఆలు [వీడియో]

సహృదయ సాధనకు ప్రవక్త ﷺ వారి దుఆలు [వీడియో]
https://youtu.be/aKkC6B1ey8s [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో లో చెప్పిన దుఆలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి:
https://teluguislam.files.wordpress.com/2023/03/duas-for-sound-heart.pdf

اللهُمَّ اغْسِلْ قَلْبِي بِمَاءِ الثَّلْجِ وَالْبَرَدِ وَنَقِّ قَلْبِي مِنَ الْخَطَايَا، كَمَا نَقَّيْتَ الثَّوْبَ الأَبْيَضَ مِنَ الدَّنَسِ
అల్లాహుమ్మగ్ సిల్ ఖల్బీ బిమాఇస్సల్జి వల్ బరది వనఖ్ఖి ఖల్బీ మినల్ ఖతాయా కమా నఖ్ఖైతస్సౌబల్ అబ్యజ మినద్దనస్.
ఓ అల్లాహ్! నా హృదయాన్ని మంచు, వడగండ్లతో కడిగివెయ్యి, తెల్లవస్త్రాన్ని, మురికి తొలగించి శుద్ధి చేసినట్లు నా హృదయాన్ని, పాపాలు, పొరపాట్లు తొలగించి శుద్ధి చెయ్యి. (బుఖారీ 6377).

اللهُمَّ اهْدِ قَلْبِي وَاسْلُلْ سَخِيمَةَ صَدْرِي
అల్లాహుమ్మహ్ ది ఖల్బీ. వస్లుల్ సఖీమత సద్రీ
ఓ అల్లాహ్! నా హృదయానికి సన్మార్గం చూపు
నా మనస్సులో నుండి ఈర్ష్య, జిగస్సులను తొలగించు
(అబూదావూద్ 1510, షేఖ్ అల్బనీ సహీ అన్నారు).

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ قَلْبًا سَلِيمًا
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖల్బన్ సలీమా
ఓ అల్లాహ్! పరిశుద్ధమైన మనస్సు కావాలని నిన్నే వేడుకుంటున్నాను. (నిసాయి 1304, సహీహా 3228).

اللهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورا
అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్బీ నూరా
ఓ అల్లాహ్! నా హృదయం (మనస్సు) కాంతినికి సన్మార్గం చూపు
(అబూదావూద్ 1510, షేఖ్ అల్బనీ సహీ అన్నారు).

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ شَرِّ قَلْبِي
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ షర్రి ఖల్బీ
ఓ అల్లాహ్ నా హృదయ కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను
(తిర్మిజి 3492, సహీ హదీస్)

اللَّهُمَّ مُصَرِّفَ الْقُلُوبِ صَرِّفْ قُلُوبَنَا عَلَى طَاعَتِكَ
అల్లాహుమ్మ ముసర్రిఫల్ ఖులూబి సర్రిఫ్ ఖులూబనా అలా తాఅతిక్
హృదయాలను త్రిప్పే ఓ అల్లాహ్! మా హృదయాలను నీ విధేయత వైపునకు త్రిప్పు.
(ముస్లిం 2654, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్)

يَا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ (الترمذي 2140)
యా ముఖల్లిబల్ ఖులూబి సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్
హృదయాలను త్రిప్పే ఓ అల్లాహ్! మా హృదయాలను నీ విధేయత వైపునకు త్రిప్పు.
(ముస్లిం 2654, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్)

పిల్లల ఉత్తమ శిక్షణకై ఖుర్ఆన్ దుఆలు & షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఉపదేశం [ఆడియో]

పిల్లల ఉత్తమ శిక్షణకై ఖుర్ఆన్ దుఆలు & షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఉపదేశం [ఆడియో]
https://youtu.be/4tRGoamrBW4 [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

أَصْلِحْ لِى فِى ذُرِّيَّتِى
అస్లిహ్ లీ ఫీ జుర్రియ్యతీ
నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు
. (సూరా అల్ ఆహ్ ఖాఫ్ 46:15)

وَإِنِّىٓ أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ ٱلشَّيْطَـٰنِ ٱلرَّجِيمِ
వ ఇన్నీ ఉఈజుహా బిక వ జుర్రియ్యతహా మినష్ షైతానిర్రజీమ్
నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను (సూరా ఆలి ఇమ్రాన్ 3:36)

رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَٰجِنَا وَذُرِّيَّـٰتِنَا قُرَّةَ أَعْيُنٍۢ وَٱجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا
రబ్బనా హబ్ లనా మిన్ అజ్ వాజినా వ జుర్రియ్యాతినా కుర్రత అఅ్’యునివ్ఁ వజ్ అల్ నా లిల్ ముత్తకీన ఇమామా
ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి (సూరా అల్ ఫుర్ఖాన్ 25:74)

رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى
రబ్బిజ్ అల్ నీ ముకీమస్ సలాతి వ మిన్ జుర్రియ్యతీ
నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). (సూరా ఇబ్రహీం 14:40)

رَبَّنَا وَٱجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَآ أُمَّةًۭ مُّسْلِمَةًۭ لَّكَ
రబ్బనా వజ్ అల్ నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక
మా ప్రభూ! మమ్మల్ని నీ విధేయులు (ముస్లింలు)గా చేసుకో. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజెయ్యి (సూరా అల్ బఖర 2:128)

رَبِّ هَبْ لِى مِن لَّدُنكَ ذُرِّيَّةًۭ طَيِّبَةً
రబ్బి హబ్ లీ మిన్ ల జున్ క జుర్రియ్య తన్ తయ్యిబ
”ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు” (సూరా ఆలి ఇమ్రాన్ 3:38)

وَٱجْنُبْنِى وَبَنِىَّ أَن نَّعْبُدَ ٱلْأَصْنَامَ
వజ్ నుబ్ నీ వ బనియ్య అన్ నఅ్’బుదల్ అస్-నామ్
నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు
(సూరా ఇబ్రహీం 14:35)

సర్వ సృష్టి స్తుతించే స్తుతులకు సమానమైన స్తుతి (హమ్ద్) జిక్ర్ ఏమిటో తెలుసా? [వీడియో]

సర్వ సృష్టి స్తుతించే స్తుతులకు సమానమైన స్తుతి (హమ్ద్) జిక్ర్ ఏమిటో తెలుసా? [వీడియో]
https://youtube.com/shorts/o5M-r2U7MNE [30 సెకండ్లు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

من قال إذا أوى إلى فراشِه:

الحمدُ لله الذي كفاني وآواني. الحمدُ لله الذي أطعمَني وسقاني. الحمدُ لله الذي منَّ عليَّ وأفضلَ، اللهمَّ ! إني أسألُك بعزَّتِك أن تُنَجِّيَني من النارِ، فقد حمِدَ اللهَ بجميعِ محامدِ الخَلْقِ كلِّهم.

అల్ హందులిల్లాహిల్లజీ కఫానీ వ ఆవానీ,
అల్ హందు లిల్లా హిల్లజీ అత్అమనీ వ సఖానీ,
అల్ హందులిల్లాహిల్లజీ మన్న అలయ్య వ అఫ్జల్,
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిఇజ్జతిక అన్ తునజ్జియనీ మినన్నార్

[ సహీహా 3444 ]

పుస్తకాలు: