ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి? [ఆడియో, టెక్స్ట్]

ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి‌ రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి
https://youtu.be/dy6dlz_jG4g ⏰ 03:20 నిమిషాలు
🎤 నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రతి ముస్లిం రోజూ సూరా అల్-ఇఖ్లాస్, సూరా అల్-ఫలఖ్, మరియు సూరా అన్-నాస్‌లను ఎప్పుడు, ఎన్నిసార్లు పఠించాలో వివరించబడింది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒకసారి, ఉదయం (అద్కార్ అస్-సబాహ్) మరియు సాయంత్రం (అద్కార్ అల్-మసా) దుఆలలో మూడుసార్లు, మరియు నిద్రపోయే ముందు మూడుసార్లు అరచేతులలోకి ఊది శరీరంపై తుడుచుకుంటూ పఠించాలని చెప్పబడింది. ఈ విధంగా ప్రతి సూరాను రోజుకు 14 సార్లు పఠిస్తారని లెక్కించారు. ఒకవేళ ఉదయం మరియు సాయంత్రం అద్కార్లను ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్‌ల తర్వాత చేస్తే, ఆ మూడుసార్లు చేసే పఠనంలోనే నమాజ్ తర్వాత చేసే ఒకసారి పఠనం కూడా కలిసిపోతుందని, అప్పుడు మొత్తం సంఖ్య 12 అవుతుందని స్పష్టం చేశారు. ఈ సూరాల ఘనతను తెలుసుకొని, ఇతర సందర్భాలలో కూడా వాటిని పఠించాలని ప్రోత్సహించారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ప్రతి ముస్లిం, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)

సూరాలు చదవాలి. ఇవి ఐదుసార్లు అవుతాయి. మరియు ఉదయం అద్కార్, అద్కారుస్ సబాహ్ అని ఏవైతే అంటామో, morning supplications, వాటిలో కూడా ఈ మూడు సూరాలూ, సూరాలు మూడేసి సార్లు చదవాలి.

అలాగే అద్కారుల్ మసా, సాయంకాలం చదివే అద్కార్లలో కూడా ఈ మూడు సూరాలు, ఇఖ్లాస్, ఫలఖ్, నాస్ మూడేసి సార్లు చదవాలి. ఎన్ని అయినాయి? ఉదయం మూడు, సాయంకాలం మూడు, ఆరు. మరియు ప్రతీ ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి. ఐదు. పదకొండు అయినాయి.

మళ్లీ రాత్రి పడుకునే ముందు రెండు అరచేతులను కలిపి, అందులో ఊది, ఒక్కొక్కసారి ఈ సూరాలు చదివి, తలపై, ముఖముపై, శరీరం ముందు భాగం, మిగతా శరీర భాగములతో తుడుచుకోవాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఈ విధంగా మొత్తం 14 సార్లు అవుతుంది.

పఠనాల సంఖ్య మరియు ఒక ప్రత్యేక మినహాయింపు

అద్కారుస్ సబాహ్‌లో మూడు సార్లు, మూడు మూడు సార్లు, అద్కారుల్ మసాలో మూడు మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు, మూడు మూడు సార్లు, తొమ్మిది మరియు ఐదు పూటల ఫర్జ్ నమాజ్‌ల తర్వాత ఒక్కొక్కసారి, పద్నాలుగు.

కానీ శ్రద్ధ వహించండి ఇక్కడ. ఎవరైనా అద్కారుస్ సబాహ్ ఫజ్ర్ నమాజ్ తర్వాత చదువుతున్నారు మరియు అద్కారుల్ మసా మగ్రిబ్ నమాజ్ తర్వాత చదువుతున్నారు, అలాంటప్పుడు వారు

మూడుసార్లు

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్, ఏకైకుడు.” (112:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను వేకువ ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (113:1)

మూడుసార్లు

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను మానవుల ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (114:1)

చదువుకున్నారంటే, ఫజ్ర్ తర్వాత ఒక్కొక్కసారి, మగ్రిబ్ తర్వాత ఒక్కొక్కసారి చదివేది ఏదైతే ఉందో అది ఇందులోనే, అంటే మూడుసార్లు చదివితే, ఇంక్లూడ్ (include) అయిపోతుంది. ఎందుకంటే ఫజ్ర్ తర్వాత అద్కారుస్ సబాహ్ ఉద్దేశంతో, మగ్రిబ్ తర్వాత అద్కారుల్ మసా ఉద్దేశంతో చదువుతున్నారు గనుక అని కొందరు ధర్మవేత్తలు చెబుతారు. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే, టోటల్ 12 సార్లు అవుతాయి.

ఇవే కాకుండా ఒక ముస్లిం ఈ సూరాల ఘనతను, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్, సూరతున్నాస్ ఘనతలను హదీథుల ఆధారంగా తెలుసుకోవాలి మరియు వేరు వేరు సందర్భాలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ సందర్భాల్లో చదవాలి. ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకోవడానికి మా క్లాసులో హాజరవుతూ ఉండండి.


ఆయతుల్ కుర్సీ ఎప్పుడెప్పుడు చదవాలి? చదవడం ద్వారా కలిగే పుణ్యాలు [వీడియో]

రోజువారి జీవితంలో ఆయతుల్ కుర్సీ ఎప్పుడెప్పుడు చదవాలి? చదవడం ద్వారా కలిగే పుణ్యాలు
https://youtu.be/tYzmTUdC0o4 [5 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఉదయం మరియు సాయంత్రం ఆయతుల్ కుర్సీ చదవడం వల్ల కలిగే లాభాలు

ఉదయాన దీన్ని పఠించినవారు సాయంత్రం వరకూ షైతాన్ బారి నుండి సురక్షితంగా ఉంటారు , అలాగే సాయంత్రం దీన్ని పఠించిన వారు ఉదయం వరకూ షైతాన్ బారినుండి సురక్షితంగా ఉంటారు. (హాకిం 1/562. హదీసు నంబర్. 2064. షేఖ్ అల్బానీ సహీహా 3162లో ప్రస్తావించారు).

ప్రతీ ఫర్జ్(ఫజ్ర్, జుహ్ర్, అసర్, ముగ్రిబ్, ఇషా) నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదవడం ద్వారా కలిగే లాభాలు

ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహ 972).

పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదవడం వల్ల కలిగే లాభాలు

పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).

సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదివితే కలిగే పుణ్యాలు

సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదివితే కలిగే పుణ్యాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلهَ إلاَّ أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَااسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلاَّ أَنْتَ

అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్ తనీ వ అనా అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅదిక మస్తతఅతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

భావం : ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులోకి వచ్చుచున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు.

ప్రయోజనం : పై దుఆ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలముకు ముందే అతను మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదవి ఉదయించక ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. (బుఖారి 6306).

సృష్టిరాసుల కీడు నుండి అల్లాహ్ రక్షణ కోరే ఒక మంచి ఉదయపు & సాయంకాలపు దుఆ

సృష్టిరాసుల కీడు నుండి అల్లాహ్ రక్షణ కోరే ఒక మంచి ఉదయపు & సాయంకాలపు దుఆ

أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِن شَرِّ مَا خَلَق

అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. {3 సార్లు పఠించండి}

భావం : అల్లాహ్ సంపూర్ణ వచనాలతో నేను శరణు కోరుతున్నాను, ఆయన సృష్టిలో ఉన్న సర్వ కీడుల నుండి. {3 సారి పఠించండి}

ప్రయోజనం : ఈ దుఆ సాయంకాలం 3 సార్లు చదివినవారికి ఆ రాత్రి ఏ విషపురుగు హాని కలిగించదు. (ముస్లిం 2709).
أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِن شَرِّ مَا خَلَق
అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. {3 సార్లు పఠించండి}

అల్లాహ్ సంపూర్ణ వచనాలతో నేను శరణు కోరుతున్నాను, ఆయన సృష్టిలో ఉన్న సర్వ కీడుల నుండి. {3 సారి పఠించండి}. ఈ దుఆ ఉదయం , సాయంకాలం 3 సార్లు చదివినవారికి ఆ రాత్రి ఏ విషపురుగు హాని కలిగించదు. (ముస్లిం 2709).