ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయిషా (రదియల్లాహు అన్హా) కు నేర్పిన దుఆ
ఇమామ్ ఇబ్న్ మాజా -రహిమహుల్లాహ్ – తన ‘సునన్’ (ప్రార్థన పుస్తకం: అధ్యాయం [4] సమగ్ర దుఆ: నం. 3846) లో ఇలా నివేదించారు: “అబూ బకర్ ఇబ్న్ అబీ షైబా మాకు ఇలా ఉల్లేఖించారు: అఫ్ఫాన్ మాకు ఇలా ఉల్లేఖించారు: హమ్మాద్ ఇబ్న్ సలామా మాకు ఇలా ఉల్లేఖించారు: జబ్ర్ ఇబ్న్ హబీబ్ నాకు తెలియజేసారు: ఉమ్ కుల్తూమ్ బిన్త్ అబీ బకర్ నుండి:ఆయిషా నుండి: అల్లాహ్ యొక్క ప్రవక్త నాకు ఈ దుఆ నేర్పించాడు:
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنَ الْخَيْرِ كُلِّهِ عَاجِلِهِ وَآجِلِهِ مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ وَأَعُوذُ بِكَ مِنَ الشَّرِّ كُلِّهِ عَاجِلِهِ وَآجِلِهِ مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ عَبْدُكَ وَنَبِيُّكَ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عَاذَ بِهِ عَبْدُكَ وَنَبِيُّكَ اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْجَنَّةَ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ وَأَسْأَلُكَ أَنْ تَجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِي خَيْرًا ”
అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక మినల్ ఖైరి కుల్లిహీ ఆజిలిహీ వ ఆజిలిహీ మా అలిమ్ తు మిన్హు వ మాలమ్ అఅ్ లమ్, వ అఊజుబిక మినష్షర్రి కుల్లిహీ ఆజిలిహీ వ ఆజిలిహీ మా అలిమ్ తు మిన్హు వ మాలమ్ అఅ్ లమ్. అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక, వ అఊజుబిక మిన్ షర్రి మా ఆజ బిహీ అబ్దుక వ నబియ్యుక, అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ జన్నత వమా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔ అమలి, వ అఊజుబిక మినన్నారి వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔ అమలి, వ అస్ అలుక అన్త జ్ అల కుల్ల ఖదా ఇన్ ఖదైతహూ లీ ఖైరా
తర్జుమా:
“ఓ అల్లాహ్! నేను త్వరగా చేకూరే లేదా ఆలస్యంగా చేకూరే, నాకు తెలిసిన లేదా నాకు తెలియని అన్ని రకాల మంచిని నీ నుంచి కోరుతున్నాను. అలాగే నేను త్వరగా జరిగే లేదా ఆలస్యంగా జరిగే, నాకు తెలిసిన లేదా నాకు తెలియని అన్ని రకాల చెడుగుల నుంచి నీ రక్షణ కోరుతున్నాను.
ఓ అల్లాహ్! నీ నుంచి నీ దాసుడు మరియు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోరిన ప్రతి మంచినీ కోరుతున్నాను. అలాగే నీ దాసుడు మరియు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోరినట్లుగానే ప్రతి చెడుగు నుంచి రక్షణ కోరుతున్నాను.
ఓ అల్లాహ్! నేను నీ నుంచి స్వర్గాన్ని కోరుతున్నాను. అలాగే స్వర్గానికి చేరువ చేసే వాక్కును, ఆచరణను కోరుతున్నాను. ఓ అల్లాహ్! నరకాగ్ని నుంచి నేను నీ రక్షణ కోరుతున్నాను. అలాగే నరకాగ్నికి చేరువ చేసే వాక్కు నుంచి మరియు ఆచరణ నుంచి నీ రక్షణ కోరుతున్నాను.
ఓ అల్లాహ్! నీవు నా కొరకు నిర్ణయించిన విధిని నా కొరకు ఉత్తమమైనదిగా మలచవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను”
(సహీహ్ సునన్ ఇబ్నె మాజహ్, లిల్ అల్బానీ, అల్ జుజి ఉస్సానీ, హదీస్ నెం : 3102)
ఈ దుఆ క్రింది పుస్తకంలో కూడా పొందు పరచబడింది :
ప్రవక్త ﷺ దుఆలు – షేఖ్ అబ్దుల్ ముహ్సిన్ అల్ అబ్బాద్
దుఆ క్రింది వీడియోలో విని చక్కగా నేర్చుకోండి:
ఇంగ్లీష్ లింక్ :
https://authentic-dua.com/category/group/comprehensive-dua/
