https://youtu.be/f_CUOEI4Xwo [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వృద్ధాప్యంలో లేదా ఖాళీ సమయంలో ఒంటరితనం మరియు నిస్సహాయతను అనుభవించే వారికీ ఇస్లాం ఒక అద్భుతమైన పరిష్కారం చూపుతుందని వివరించబడింది. ఉమ్మె హానీ (రజియల్లాహు అన్హా) అనే ఒక వృద్ధురాలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి, తాను బలహీనంగా ఉన్నందున కూర్చుని చేసుకోగలిగే ఒక సులభమైన ఆరాధనను చెప్పమని కోరారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), నాలుగు చిన్న పదాలను వంద సార్లు చదవడం ద్వారా లభించే అపారమైన పుణ్యాల గురించి వివరించారు. ‘సుబ్ హా నల్లాహ్’ అంటే 100 మంది బానిసలను విముక్తి చేసినంత పుణ్యం, ‘అల్హందులిల్లాహ్’ అంటే అల్లాహ్ మార్గంలో 100 గుర్రాలను దానం చేసినంత పుణ్యం, ‘అల్లాహు అక్బర్’ అంటే 100 ఒంటెలను బలిదానం చేసినంత పుణ్యం, మరియు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే భూమి ఆకాశాల మధ్య ఉన్న స్థలాన్ని పుణ్యాలతో నింపేస్తుందని తెలిపారు. ఈ విధంగా, ఇస్లాం మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు సులభమైన పద్ధతులలో అపారమైన పుణ్యాలను సంపాదించుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుందని ఈ హదీస్ ద్వారా స్పష్టం చేయబడింది.
ఇప్పుడు రండి, నేను మరొక విధమైన ఘనత మనకు తెలియడానికి, ప్రత్యేకంగా ఈ రోజుల్లో కొందరు ఎవరైతే పని లేక, ఉద్యోగం లేక లేక రిటైర్డ్ అయిపోయి ముసలితనంలో చేరి, ఏం చేయాలి, పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉన్నారు, ఒంటరిగా ఉండి పొద్దంతా చాలా బాధ కలుగుతుంది, ఎవరు మాట్లాడేవాడు లేడు, ఇలాంటి రంది, ఇలాంటి బాధలో ఎంతోమంది ఉన్నట్లు చూస్తున్నాము కదా మనం.
కానీ మనం ఇస్లాంలో ఉండి, మన సమయం ఇలా ఎవరు మాట్లాడేవారు లేకుండా, నా పొద్దంతా ఎంతో రందిగా గడుస్తుంది అని అనడానికి అవకాశం ఉందా? ఇస్లాం ధర్మం తెలుసుకొని, ఖురాన్ చదువుతూ, ప్రవక్త యొక్క సీరత్ చదువుతూ, ఈ రోజుల్లో ఏమైనా వింటూ, ఆ యూట్యూబ్‌లో మంచి ప్రసంగాలు చూస్తూ, అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ సమయం ఎంత మంచిగా గడపవచ్చు మనం. మనం మన సమయాన్ని ఎంత మంచి రీతిలో గడపవచ్చు. కానీ ఏంటి? ఇలాంటి అవగాహన లేక, ఇలాంటి అవగాహన లేక, ధర్మ జ్ఞానం యొక్క కొరత వల్ల ఎంతో బాధలో వారు గడుపుతూ ఉంటారు. కానీ ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు.
వృద్ధురాలి ప్రశ్నకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానం
అయితే రండి. ఒక వృద్ధురాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో అడిగిన విషయం ఏంటో ఇప్పుడు మనం ఈ హదీథ్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. శ్రద్ధగా మీరు కూడా ఈ హదీథ్ ను వినండి మరియు ఇందులో ఉన్నటువంటి ఘనతను మీరు స్వయంగా పొందే ప్రయత్నం చేయండి. మీ ఇళ్లల్లో ఎవరైనా పెద్ద మనుషులు ఇలాంటి బాధలో ఉంటే ఈ హదీస్ వినిపించి వారి బాధను దూరం చేయండి. వారి యొక్క సమయాన్ని ఎంతో ఆనందంగా గడిపే విధంగా మీరు వారికి నేర్పండి.
షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీ ఉత్తర్గిబ్ లో ప్రస్తావించారు ఈ హదీథ్ ని. ఉమ్మె హానీ రదియల్లాహు తాలా అన్హా, వృద్ధురాలు. ఆమె ఏమంటుందో చూడండి.
مَرَّ بِي رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ، فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ، قَدْ كَبِرْتُ وَضَعُفْتُ، فَمُرْنِي بِعَمَلٍ أَعْمَلُهُ وَأَنَا جَالِسَةٌ
ఒకసారి ప్రవక్త నా దగ్గరి నుండి దాటారు. నేను అన్నాను, యా రసూలల్లాహ్ ఓ ప్రవక్తా, నేను చాలా వృద్ధురాలిని అయిపోయాను, చాలా బలహీనురాలిని అయిపోయాను. నేను కూర్చుండి కూర్చుండి చేసేటువంటి ఏదైనా ఒక మంచి సత్కార్యం గురించి నాకు తెలపండి.
అల్లాహు అక్బర్ చూస్తున్నారా? ఎలాంటి విషయం అడుగుతున్నారు? నేను ముసలిదాన్ని అయిపోయినా కదా, ఇప్పుడు ఇలాగే కూర్చుండి నా సమయం గడుస్తుంది. అయితే ఇలా నేను ఏ సత్కార్యం చేయగలుగుతాను? పుణ్యాలు సంపాదించడానికి ఎలాంటి మంచి మార్గాన్ని నేను పొందగలుగుతాను?
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
سَبِّحِي اللَّهَ مِائَةَ تَسْبِيحَةٍ
సబ్బిహిల్లాహ మి’అత తస్బీహ
వంద సార్లు నీవు సుబ్ హా నల్లాహ్ అని పలుకు.
ఏంటి లాభం?
فَإِنَّهَا تَعْدِلُ لَكِ مِائَةَ رَقَبَةٍ تَعْتِقِينَهَا مِنْ وَلَدِ إِسْمَاعِيلَ
వంద సార్లు సుబ్ హా నల్లాహ్ పలకడం ద్వారా నీకు లాభం ఏంటంటే, ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతానంలోని వంద బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం నీకు లభిస్తుంది.
وَاحْمَدِي اللَّهَ مِائَةَ تَحْمِيدَةٍ
వహ్మదిల్లాహ మి’అత తహ్మీద
నీవు వంద సార్లు అల్హందులిల్లాహ్ పలుకు.
فَإِنَّهَا تَعْدِلُ لَكِ مِائَةَ فَرَسٍ مُسْرَجَةٍ مُلْجَمَةٍ تَحْمِلِينَ عَلَيْهَا فِي سَبِيلِ اللَّهِ
వంద సార్లు నీవు అల్హందులిల్లాహ్ పలుకుతే, నీవు వంద గుర్రాలు జీనుతో పాటు కళ్ళెం వేసినవి అల్లాహ్ మార్గంలో ఇచ్చినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది.
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ గమనిస్తున్నారా?
وَكَبِّرِي اللَّهَ مِائَةَ تَكْبِيرَةٍ
వ కబ్బిరిల్లాహ మి’అత తక్బీర
వంద సార్లు అల్లాహు అక్బర్ అని పలుకు.
فَإِنَّهَا تَعْدِلُ لَكِ مِائَةَ بَدَنَةٍ مُقَلَّدَةٍ مُتَقَبَّلَةٍ
నీవు వంద ఒంటెలు, వాటికి పట్టాలు వేసి, అల్లాహ్ కొరకు బలిదానం చేయడానికి పంపిన మరియు అల్లాహ్ వద్ద అవి స్వీకరించబడిన దానికి సమానమైన పుణ్యం లభిస్తుంది.
చూస్తున్నారా? ప్రియ వీక్షకులారా గమనిస్తున్నారా? ఇక రండి.
وَهَلِّلِي اللَّهَ مِائَةَ تَهْلِيلَةٍ
వ హల్లలిల్లాహ మి’అత తహ్లీల
నీవు వంద సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకు.
ఏమవుతుంది?
تَمْلَأُ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ
భూమి ఆకాశాల మధ్యలోని స్థలాన్ని అది నింపేస్తుంది. అంటే అంత ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి అని భావం. మరొక లాభం వినండి.
وَلَا يُرْفَعُ يَوْمَئِذٍ لِأَحَدٍ عَمَلٌ إِلَّا أَنْ يَأْتِيَ بِمِثْلِ مَا أَتَيْتِ
ఆ రోజు నీకంటే ఉత్తమమైన సత్కార్యం ఎవరిది కూడా అల్లాహ్ వద్ద హాజరు చేయబడదు. ఆ, నీలాంటి సత్కార్యం ఎవరైనా చేస్తే వారిది కూడా పెట్టబడుతుంది, అది వేరే విషయం.
చూశారా, ఈ నాలుగు పదాల ఘనతలు ఎంత గొప్పగా ఉన్నాయో? వంద సార్లు సుబ్ హా నల్లాహ్ కు బదులుగా వంద బానిసలను విముక్తి కలిగించినంత. వంద సార్లు అల్హందులిల్లాహ్ కు బదులుగా వంద గుర్రాలు జీనుతో, కళ్ళాలతో అల్లాహ్ మార్గంలో ఇచ్చినటువంటి పుణ్యం. వంద సార్లు అల్లాహు అక్బర్, వంద ఒంటెలను బలిదానం చేసినంత, స్వీకరించబడినవి ఎలా ఉంటాయో అలాంటి పుణ్యం. వంద సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్, ఇది భూమి ఆకాశాలను పుణ్యాలతో నింపేస్తుంది. మరియు ఇంతకంటే మంచి ఆచరణ మరెవరిదీ కూడా ఉండదు.
—
ఈ చిన్న వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది :
నాలుగు శుభవచనాల ఘనతలు (సుబ్ హా నల్లాహ్ , అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్) – https://youtu.be/2YarbpvfFK0