అల్లాహ్ వారికి 10 లక్షల పుణ్యాలు వ్రాస్తాడు, 10 లక్షల పాపాలు మన్నిస్తాడు, అతని కొరకు స్వర్గంలో ఇల్లు నిర్మిస్తాడు

బజారులో వెళ్ళినప్పుడు చదువే దుఆ

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ZpD3tDsIhJI [ 7 min]

ప్రవక్త ﷺ తెలిపారని, ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: బజారులో ప్రవేశిస్తూ

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ، يُحْيِي وَيُمِيتُ وَهُوَ حَيٌّ لَا يَمُوتُ، بِيَدِهِ الخَيْرُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వ యుమీతు వహువ హయ్యున్ లా యమూతు బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఎవరు చదువుతారో, అల్లాహ్ వారికి పది లక్షల పుణ్యాలు వ్రాస్తాడు, అతని పది లక్షల పాపాలు మన్నిస్తాడు, అతని కొరకు స్వర్గంలో ఇల్లు నిర్మిస్తాడు. (తిర్మిజి 3429, ఇబ్ను మాజ పదాలు 2235, దార్మీ 2692, హాకిం 1976, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 6231లో హసన్ అన్నారు).

ఒక మిలియన్ (పదిలక్షల) పుణ్యాలు నీ పుణ్యాల త్రాసులో పెట్టబడే విషయాన్ని ఒక సారి ఊహించు, అంతకు మించి పాపాల త్రాసులో నుంచి ఒక మిలియన్ పాపాలు తగ్గించడం, చెరిపివేయడం జరుగుతుంది. నిస్సందేహంగా ఇది నీ త్రాసును చాలా బరువుగలదిగా చేస్తుంది.

పూర్వం పుణ్య పురుషుల్లో ఒకరికి ఈ పుణ్యం సంపాదించే కాంక్ష ఉండేదా అని ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు! అతను ఏ పని లేకున్నా బాజారుకు వెళ్ళి, ఈ దుఆ చదివి తిరిగి వచ్చేవారు, ఈ విషయం అతని త్రాసును బరువుగలదిగా చేయాలని అతని కాంక్ష. ముహమ్మద్ బిన్ వాసిఅ (రహిమహుల్లాహ్) తెలిపారుః నేను మక్కా నగరానికి వచ్చాను, అక్కడ సోదరులు సాలిం బిన్ అబ్దుల్లాహ్ ను కలిశాను, అతను తన తండ్రితో, అతను తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ‘ఎవరు బాజారులో ప్రవేశిస్తూ…’ అన్న ఈ హదీసు వినిపించారు. నేను ఖురాసాన్ వచ్చి, ఖుతైబా బిన్ ముస్లింను కలసి, నేను మీ కొరకు ఒక బహుమానం తీసుకొచ్చాను అని చెప్పి, ఈ హదీసు వినిపించాను. ఆ తర్వాత నుండి అతను తన వాహనముపై ఎక్కి బజారుకు వచ్చి, నిలబడి, ఈ దుఆ చదివి వెళ్ళిపోయేవారు. (సునన్ దార్మీ 1692).

Source: త్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezzan) – PDF Book

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s