తన దాసుడు తన సన్నిధిలో చేతులు చాచి అర్థించినపుడు వట్టి చేతులతో మరలించడానికి అల్లాహ్ సిగ్గుపడతాడు

1344. హజ్రత్ సల్మాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు : “మీ ప్రభువు ఎంతో ఉదాత్తుడు, బిడియం, కలవాడు. తన దాసుడు తన సన్నిధిలో - చేతులు చాచి అర్థించినపుడు వట్టి చేతులతో మరలించడానికి ఆయన సిగ్గుపడతాడు.” 

('నలుగురి'లో నసాయి మినహా మిగిలిన వారు దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

సారాంశం: చేతులెత్తి దుఆ చేయటం సమంజసమేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. పైగా దుఆ మర్యాదలలో ఇది కూడా ఒకటి. అల్లాహ్ సన్నిధిలో ఎత్తబడిన అశక్తుడైన దాసుని చేతులు వట్టిగా వాపసు చేయబడవు. దుఆయే ఇస్తిస్ఖా సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మామూలు దుఆ సమయాల కన్నా మరింత పైకి తన చేతుల్ని ఎత్తేవారు.

[హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) ]
ధ్యానం మరియు దుఆ – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s