ఈ సూరా మూడో వంతు ఖురాన్ కు సమానం

సుబ్ హానల్లాహి వబిహమ్దిహీ

స్వర్గ నిధుల లోని ఒక నిధి

ధైవస్మరణం విశిష్టత – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
https://www.scribd.com/fullscreen/40339873?access_key=key-2idwgaurytx6u4l280lb

కరుణామయునికి ప్రియమైన రెండు వచనాలు

షైతాన్ నుండి రక్షణకై ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చదివే దుఆ

العاشر‏: ‏ عن أنس رضي الله عنه قال‏: ‏ قال رسول الله صلى الله عليه وسلم ‏: ‏ ‏”‏من قال-يعني إذا خرج من بيته-‏: ‏

بسم الله توكلت على الله، ولا حول ولا قوة إلا بالله ، يقال له‏: ‏ هديت وكفيت ووقيت، وتنحى عنه الشيطان‏“‏‏.

‏ رواه أبو داود والترمذي، والنسائي وغيرهم‏.‏ وقال الترمذي‏: ‏ حديث حسن، زاد أبو داود‏:

‏ ‏”‏فيقول ‏: ‏-يعني الشيطان-لشيطان آخر‏: ‏ كيف لك برجل قد هدي وكفي ووقيّ ‏؟‏

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) తెలియ జేశారు:

ఇంటినుండి బయలుదేరే వ్యక్తి “బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, వలా హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి” (అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. నేను ఆయన్నే నమ్ముకున్నాను. పాపాల నుండి మరలి పోవాలన్నా, మంచి పనులు చేయాలన్నా ఆయన శక్తివల్లనే సాధ్యమవుతుంది) అని పఠించి బయలు దేరినప్పుడు ఆ వ్యక్తితో “నీవు సన్మార్గం పొందావు, నీకు సహాయం కల్పించబడింది, నీవు రక్షించబడ్డావు“ అని అదృశ్యవాణి ఎవరికీ వినపడని విధంగా పలుకుతుంది. అంతేకాదు షైతాన్ కూడా అలాంటి వ్యక్తినుండి దూరంగా పారిపోతాడు.

అబూదావూద్, తిర్మిజీ, నసాయి తదితరులు దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా పేర్కొన్నారు.

అబూదావూద్ లో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి : అప్పుడు ఒక షైతాన్ తోటి షైతాన్ తో “ఈ వ్యక్తికి సన్మార్గం లభించింది, సహాయం అందింది, రక్షణ కల్పించబడింది. ఇక నువ్వు అతనిపై పట్టు ఎలా సాధిస్తావు?” అని అంటాడు

(సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలోనూ, సుననె అబూదావూద్ లోని సంస్కార ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)

ముఖ్యాంశాలు:

పైన పేర్కొనబడిన ప్రార్థనలు మనిషికి అల్లాహ్ పై ఉండవలసిన నమ్మకం, విశ్వాసాలను విశదపరచాయి. ఇంకా ఈ వేడుకోలు వచనాలలో షైతాన్ యొక్క కుయుక్తులు, కుశంకల నుండి కూడా శరణు కోరుకోబడింది. కనుక విశ్వాసులు ఈ వేడుకోలు వచనాలను పఠించటం అలవాటు చేసుకోవాలి

[రిఫరెన్స్: రియాదుస్సాలిహీన్ – హదీసు: 82]

దుఆ విని నేర్చుకోండి:

بسم الله توكلت على الله، ولا حول ولا قوة إلا بالله

బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, వలా హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి

అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. నేను ఆయన్నే నమ్ముకున్నాను. పాపాల నుండి మరలి పోవాలన్నా, మంచి పనులు చేయాలన్నా ఆయన శక్తివల్లనే సాధ్యమవుతుంది

షైతాన్ నుండి రక్షణకై మిగతా దుఆలు క్రింది లింక్ నొక్కి నేర్చుకోండి:

దుఆ: రధీతు బిల్లాహి రబ్బన్, వ బిల్ఇస్లామి దీనన్, వబి ముహమ్మదిన్ రసూలన్

రధీతు బిల్లాహి రబ్బన్, వ బిల్ఇస్లామి దీనన్, వబి ముహమ్మదిన్ రసూలన్
https://youtu.be/4y8XttBrwZo

11- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“ఓ అబూ సఈద్! అల్లాహ్ ను తన పోషకునిగా విశ్వసించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా నమ్మినవాడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 1884).

ఈ హదీసులో:

ఈ మూడింటిని ఎవరైతే పూర్తి విశ్వాసముతో, స్వచ్ఛత, సంకల్పశుద్ధితో నోటి ద్వారా పలుకుతాడో తప్పక అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఎందుకనగా మూడు విషయాల్ని అతడు వాస్తవం చేసిచూపాడు. మరియు ధర్మానికి సంబంధించిన ముఖ్య పునాదుల్ని నమ్మాడు. అవిః అల్లాహ్ పట్ల విశ్వాసం. సత్యధర్మ స్వీకారం. సత్యవంతులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నమ్మకం.

—-

رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ نَبِيًّا ، وَجَبَتْ له الجنَّةُ
“రధీతుబిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబి ముహమ్మదిన్ నబియ్యా“ ఎవరు ఈ దుఆ ఉదయం చదువుతారో, అతని చేయిని పట్టుకొని స్వర్గంలో ప్రవేశింపజేస్తానని ప్రవక్త పూచీ తీసుకున్నారు

والحديث فيه أخرجه الطبراني في “المعجم الكبير” (20/355) ، من طريق الْمُنَيْذِرِ صَاحِبِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – وَكَانَ يَكُونُ بِإِفْرِيقِيَّةَ – قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ قَالَ إِذَا أَصْبَحَ: رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِالْإِسْلَامِ دِينًا ، وَبِمُحَمَّدٍ نَبِيًّا ، فَأَنَا الزَّعِيمُ لِآخُذَ بِيَدِهِ حَتَّى أُدْخِلَهُ الْجَنَّةَ . والحديث حسنه بهذا اللفظ الشيخ الألباني في “السلسلة الصحيحة” (2686) .

ఎవరు అజాన్ లో షహాదతైన్ సందర్భంలో (లేదా చివరిలో) చదువుతారో వారి పాపాలు మన్నించబడతాయి. (సహీ ముస్లింలో 386)

أخرجه مسلم في “صحيحه” (386) ، من حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:

مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْمُؤَذِّنَ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ ، رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِمُحَمَّدٍ رَسُولًا ، وَبِالْإِسْلَامِ دِينًا ، غُفِرَ لَهُ ذَنْبُهُ .

మరెవరయితే ఎప్పుడైనా (సమయం నిర్థారిత కాకుండా, స్వచ్ఛమైన మనస్సుతో, అర్ధభావాలను తెలుసుకోని, ఆచరించి) చదువుతాడో అతని కొరకు స్వర్గం తప్పనిసరి. (అబూదావూద్ లోని సహీ హదీస్ 1368)

من حديث أبي سعيدِ الخدريَّ ، أن رسولَ الله – صلَّى الله عليه وسلم – قال: مَنْ قال: رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ رَسولاً ، وَجَبَتْ له الجنَّةُ . والحديث صححه الشيخ الألباني في “صحيح أبي داود” (1368) .

ఈ జిక్ర్ 10 సార్లు చేస్తే నలుగురు బానిసలను విడిపించినంత పుణ్యం

ధైవస్మరణం విశిష్టత – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
https://www.scribd.com/fullscreen/40339873?access_key=key-2idwgaurytx6u4l280lb

ఐదు విషయాలను కోరుతూ అల్లాహ్ తో ఒక మంచి దుఆ

ఐదు విషయాలను కోరుతూ అల్లాహ్ తో ఒక మంచి దుఆ

اللهمَّ إِني أسأَلُك الصِّحَةَ والعِفَّةَ، والأمَانَةَ وحُسنَ الخُلُقِ، والرِّضَا بالقَدَر

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకస్ సిహ్హత్, వల్ ఇఫ్ఫత, వల్ అమానత, వ హుస్నల్ ఖులుఖ్, వర్రిధా బిల్ ఖద్ర్

ఓ అల్లాహ్ ఆరోగ్యం, సచ్ఛీలత, సౌశీల్యత, విశ్వసనీయత, సద్వర్తన మరియు విధివ్రాతపై సంతృప్తిని ప్రసాదించమని నిన్నే అర్థిస్తున్నాను

[అదబుల్ ముఫ్రద్ 316]

ఎవరైతే ఫజ్ర్ నమాజ్ మరియు అస్ర్ లేదా మగ్రిబ్ తర్వాత ఈ జిక్ర్ 10 సార్లు చదువుతారో

ఎవరైతే ఫజ్ర్ నమాజ్ మరియు అస్ర్ లేదా మగ్రిబ్ తర్వాత ఈ జిక్ర్ 10 సార్లు చదువుతారో వారికి 9 రకాల లాభాలున్నాయి.
{ లా ఇలాహ ఇల్లాల్లహు వహదహ్ లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యూ వ యుమీతు వహువా అలా కుల్లి షైఇన్ ఖదీర్ } 
  
1.  పది విశ్వాస బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది,
2. అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో చేర్పించే 10 పుణ్యాలను రాస్తాడు,
3. అల్లాహ్, నరకంలో చేర్పించే అతని 10 పాపాలను మన్నిస్తాడు,
4. అల్లాహ్ అతని 10 స్థానాలను పెంచుతాడు,
5. ఉదయం చదివితే సాయంత్రం వరకు, సాయంత్రం చదివితే ఉదయం వరకు షైతాను నుండి రక్షించబడతారు,
6. అసహ్యకరమైన, అవాంఛనీయమైన వాటి నుండి కాపాడబడతాడు,
7. ఆ రోజు షిర్క్ తప్ప అతని ఏ పాపం అతనికి నష్టం చేకూర్చదు (పాపం చేయవచ్చని భావం ఎంత మాత్రం కాదు సుమా),
8. సాయంత్రం చదివితే ఉదయం వరకు ఆయుధం ధరించి ఉన్న దైవదూతలను అల్లాహ్ అతని రక్షణ కొరకు పంపిస్తాడు,
9. ఆ రోజు అతని ఆచరణ కంటే ఉత్తమమైన ఆచరణ మరెవరిదీ ఉండదు, అతని మాదిరిగా చదివిన వ్యక్తి లేదా అతని కంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప.

(షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారి సహీ తర్గీబ్ లోని #472 నుండి #477 వరకు హదీసుల సారాంశం).

ఓ అల్లాహ్! నా యొక్క ధర్మాన్ని, జీవనోపాధిని, ఇహ పర లోకాలని సరిదిద్దు


اللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي ، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي ، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرٍّ

అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనియల్లజీ హువ ఇస్మతు అమ్రీ, వఅస్లిహ్ లీ దున్యాయల్లతీ ఫీహా మఆషీ, వఅస్లిహ్ లీ ఆఖిరతియల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతల్లీ ఫీ కుల్లి ఖైర్ ,వజ్అలిల్ మౌత రాహతల్లీ మిన్ కుల్లి షర్ర్

ఓ అల్లాహ్! నా ధర్మాన్ని సరిదిద్దు, అది నా సర్వ వ్యవహారాలను కాపాడునది. నా జీవనోపాధి ఉన్న నా ఈ ప్రపంచాన్ని సరిదిద్దు. నేను మరల వలసి ఉన్న నా పరలోకాన్ని సరిదిద్దు. నా కొరకు ప్రతి ఒక్క శుభంలోనూ నా ఈ జీవితాన్ని పొడిగించు.
మరియు ప్రతి దుష్టత్వం నుండి నా మరణాన్ని కాపాడు.


(ముస్లిం 2720)

చిరస్థాయిగా నిలిచిపోయే పుణ్యములు

రేయింబవళ్లు చేస్తూ ఉండే జిక్ర్ కంటే ఎక్కువ పుణ్యం